ముందుకొచ్చిన పెదకాపు

ప్రభాస్ సలార్ వాయిదా పడింది. సెప్టెంబర్ 28న రావడం లేదు. మేకర్స్ నుంచి ఇంకా అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు కానీ సినిమా ఐతే రావడం లేదు. కొత్త డేట్ నవంబర్ లేదా డిసెంబర్ లో ఉండొచ్చు. సలార్ వెనక్కి వెళ్ళడంతో మిగతా సినిమాలు ఆ డేట్ పై గురి పెట్టాయి. రవితేజ టైగర్ నాగేశ్వర రావు విడుదల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఐతే కొన్ని సిజీ పనులు పెండింగ్ లో వున్నాయి. ఆ సమయానికి అందుకుంటారా లేదో తెలీదు. ఐతే ఇప్పుడో మీడియం రేంజ్ సినిమాని సరిగ్గా సలార్ డేట్ కి అనౌన్స్ చేశారు.

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న సినిమా పెదకాపు1. విరాట్ కర్ణ అనే కొత్త కుర్రాడు ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. నిజానికి ఈ సినిమా కూడా విడుదల రెడీగా వుంది. దసరా కి వద్దామనుకుంటే పెద్ద పోటీనే వుంది. సెప్టెంబర్ మొదటి మూడు వారాలు ఖుషి, మిస్టర్ శెట్టి, స్కంద తీసుకున్నాయి. నాలుగో వారంలో సలార్ అనుకున్నారు. దీంతో ఎప్పుడు రావాలా? అనే డైలామా వుండేది. ఐతే ఇప్పుడు సలార్ వాయిదా పడటంతో సెప్టెంబర్ 29న పెదకాపుని విడుదల చేస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల నుంచి చాలా రోజుల తర్వాత వస్తున్న సినిమా కావడం, ఇప్పటివరకూ లవ్ స్టొరీలు తీసిన ఆయన ఈ సినిమాతో రాజకీయాలు, వర్గ పోరాటాలు టచ్ చేయడం, టీజర్ ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై ఆసక్తి ఏర్పడింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జనసేన స్ట్రైక్ రేట్ ఎనభై శాతం ఉంటుందా?

జనసేన పార్టీ గత ఎన్నికల్లో చదవి చూసిన ఘోర పరాజయాన్ని మరిపించేలా ఈ సారి ఎన్నికల పలితాలు ఉంటాయని పోలింగ్ సరళి తర్వాత నిపుణులు ఓ అంచనాకు వస్తున్నారు. మొత్తం ఇరవై...

భారత్ కు అమెరికా వార్నింగ్ ..!!

ఇరాన్ తో చాబహార్ పోర్టుకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకోవడంపై ఇండియాకు అమెరికా వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్ తో ఏ సంస్థ అయినా, దేశమైనా వ్యాపార లావాదేవీలు జరిపితే ఆంక్షలు విధిస్తామని...

తెరపైకి క్రికెటర్ క్యారెక్టరైజేషన్

ఫాస్ట్ బౌలర్ లక్ష్మీపతి బాలాజీ గుర్తున్నాడా? మెరుపు వేగంతో బంతులు వేసే బాలాజీ ఎప్పుడూ నవ్వుతూనే కనిపిస్తాడు. ఆయన సీరియస్ గా కనిపించిన సందర్భాలు చాలా తక్కువ. దాదాపుగా ఆయన స్మైల్ ఫేస్...

పట్టభద్రుల బైపోల్..ప్రధాన పార్టీలకు స్వతంత్ర అభ్యర్థుల బెడద..?

లోక్ సభ ఎన్నికలు ముగియడంతో తెలంగాణలో ఇప్పుడు అందరి దృష్టి గ్రాడ్యుయేట్ ఉప ఎన్నికపైనే నెలకొంది. ఈ నెల 27న ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల స్థానానికి బైపోల్ జరగనున్న నేపథ్యంలో ఈ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close