తాడిపత్రి పెద్దారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మున్సిపల్ స్థలం ఆక్రమించి ఇల్లు కట్టుకున్నట్లుగా నిర్దారణ అయింది. మున్సిపల్ సర్వేయర్లు సర్వే చేసి.. పెద్దారెడ్డి రెండు సెంట్ల స్థలం ఆక్రమించుకుని కట్టారని నిర్దారించారు. ఈ రిపోర్టును సర్వేయర్లు మున్సిపల్ కమిషనర్‌కు ఇస్తారు. ఇక్కడ ఆక్రమించడమే కాదు.. అసలు ఇంటికి పర్మిషన్ కూడా తీసుకోలేదు. ఈ రెండు కారణాలతో కూల్చివేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.
పెద్దారెడ్డిది తాడిపత్రి కాదు. ఆయన సొంత ఊరు శింగనమల నియోజకవర్గంలో ఉంటుంది. గతంలో ఫ్యాక్షన్ ఒప్పందాల కారణంగా తాడిపత్రిలో కేతిరెడ్డి కుటుంబం రాజకీయం చేయకూడదు.కానీ జగన్ రెడ్డి ప్రోద్భలంతో కేతిరెడ్డి మళ్లీ తాడిపత్రిలోకి వచ్చారు. ఓ సారి గెలిచినందుకు ఆయన మిడిసిపడ్డారు. గెలిచినప్పుడు తాడిపత్రిలో పన్నెండు సెంట్లలో ఇల్లు కట్టుకున్నారు. ఇందులో రెండు సెంట్లు మున్సిపల్ స్థలం. ఆ భవనానికీ అనుమతి లేదు. ఎమ్మెల్యేగా ఉన్నా అనుమతి తీసుకోలేదు. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే కావడంతో అది కూడా మైనస్ అయింది.
తాడిపత్రిలోకి రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి.. .సుప్రీంకోర్టుకు వెళ్లి ఒక రోజు వచ్చి వెళ్లిన పెద్దారెడ్డికి.. మళ్లీ సారి వచ్చే సరికి ఉండటానికి ఇల్లు ఉండని పరిస్థితి ఏర్పడింది. అసలు అనుమతి లేని.. మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించి కట్టిన ఇంటిని ఊపేక్షించే అవకాశం లేదు. పెద్దారెడ్డి కోర్టుకెళ్లి ఆపుకోవాల్సి ఉంటుంది.
