పెద్దిరెడ్డి త‌న‌ పేషీని అందుకే వ‌ద్ద‌నుకున్నార‌ట‌..!

అమ‌రావ‌తిలోని ఏపీ స‌చివాల‌యం గ‌డ‌చిన వారం రోజులుగా హ‌డావుడిగా మారిన సంగ‌తి తెలిసిందే. కొత్త మంత్రుల ప్ర‌మాణ స్వీకారాలు, శాఖ‌ల కేటాయింపులు, ఆయా శాఖ‌ల పేషీల్లోకి మంచి ముహూర్తాలు చూసుకుని, వేద పండితుల స‌మ‌క్షంలో మంత్రుల ప్ర‌వేశాలు… ఇలా సెక్ర‌టేరియ‌ట్ పేషీల్లో హ‌డావుడిగా ఉంది. ప్ర‌భుత్వం మారిన త‌రువాత‌, గ‌త ప్ర‌భుత్వంలో ఏయే శాఖ‌ల‌కు ఏయే పేషీలున్నాయో… వాటిల్లోకి కొత్త మంత్రులు వెళ్లి, బాధ్య‌త‌లు స్వీక‌రిస్తారు. ఇది రొటీన్ గా జ‌రుగుతుంది. మంత్రులు మారినా.. ఆయా శాఖ‌ల‌కు కేటాయించిన గ‌దుల్లో మార్పులుండ‌వు. అలానే ఇప్పుడు బాధ్య‌త‌లు తీసుకున్న మంత్రులంద‌రూ వెళ్తున్నారు. కానీ, త‌న‌కు కేటాయించిన పేషీలోకి వెళ్లేందుకు మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి ఇష్ట‌ప‌డటం లేద‌ట‌!

మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించాక కొంత‌మంది సిద్ధాంతుల‌ను మాజీ మంత్రి లోకేష్ ఛాంబ‌ర్ కి తీసుకెళ్లార‌నీ, వాస్తుప‌రంగా కొన్ని ఇబ్బందులున్నాయ‌ని వారు చెప్ప‌డం వ‌ల్ల‌నే పెద్దిరెడ్డి ఆలోచిస్తున్నార‌నే ప్ర‌చారం వైకాపా వ‌ర్గాల్లో ఉంది. అయితే, అస‌లు కార‌ణం అది కాద‌నీ… ఆ ఛాంబ‌ర్ కి సెక్ర‌టేరియ‌ట్ లో ఒక ముద్ర ప‌డిపోయింద‌నీ, అలాంటి గుర్తింపు పొందిన ఛాంబ‌ర్ త‌న‌కు వ‌ద్ద‌నేది మంత్రి మ‌నోగ‌తంగా తెలుస్తోంది. ఇంత‌కీ ఆ ముద్ర ఏంటంటే…. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో పంచాయ‌తీ రాజ్ శాఖ‌కు నారా లోకేష్ మంత్రిగా ఉండేవారు. ఆ స‌మ‌యంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఛాంబ‌ర్ త‌రువాత‌, ఎక్కువ‌గా బిజీబిజీగా ఉండేది లోకేష్ ఛాంబ‌రే. దాంతో ఆ ఛాంబ‌ర్ ని పంచాయ‌తీరాజ్ శాఖామంత్రి పేషీ అనే కంటే, లోకేష్ పేషీగానే బాగా ప్రాచుర్యంలో ఉండేది.

ఇప్పుడు ప్ర‌భుత్వం మారిన త‌రువాత కూడా స‌చివాల‌య ఉద్యోగులు, ఇత‌ర సిబ్బందీ ఆ ఛాంబ‌ర్ ని లోకేష్ ఛాంబ‌రే అంటున్నార‌ట‌! ఈ విష‌యం ఆనోటా ఈనోటా మంత్రిగారికి తెలిసింది. తాను ఆ పేషీలోకి వెళ్లినా… ఆయ‌న లోకేష్ పేషీలో ఉన్నార‌ని ఎవ‌రైనా అంటే బాగోదు క‌దా అనేది మంత్రి అభిప్రాయంగా ఉంద‌ట‌! వైకాపాలో పెద్దిరెడ్డి కీల‌క నాయ‌కుడు కాబ‌ట్టి, జ‌నాల తాకిడి కూడా ఎక్కువ‌గానే ఉంటుంది. అందుకే గ‌త మంత్రి పేరుతో నోటెడ్ అయిన పేషీ వ‌ద్ద‌ని ఆయ‌నే స్వ‌యంగా చెప్పార‌ట‌. దీంతో, ఉప ముఖ్య‌మంత్రి పుష్పా శ్రీవాణికి కేటాయిస్తున్న‌ట్టు ఏపీ స‌ర్కారు జీవో కూడా జారీ చేసేసింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హిందూపురం జిల్లా కోసం బాలకృష్ణ..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా జిల్లాల విభజన చేయబోతోందన్న ప్రచారం ఉద్ధృతంగా సాగుతున్న సమయంలో... ఏపీలో రాజకీయ నేతలు ఎవరి డిమాండ్లు వారు వినిపించడం ప్రారంభించారు. వీరి జాబితాలోకి టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ...

ఏపీ సర్కార్ రూ. 65వేల కోట్ల “ప్రైవేటు” అప్పు…!?

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గత వారం హడావుడిగా ఢిల్లీ వెళ్లారు. ఏపీ ప్రభుత్వానికి ఆర్థిక సాయం చేయాలని కోరారు. ఈ విషయాన్ని ప్రెస్‌నోట్ ద్వారా మీడియాకు చెప్పారు. కానీ.....

విశాఖలో మరో “ఫార్మా ఫైర్”..! ఎందుకిలా..?

విశాఖలో అర్థరాత్రి మరో భారీ ఫార్మా కంపెనీలో పేలుడు సంభవించింది. ప్రత్యేకంగా కెమికల్స్ తయారు చేసి.. ఇతర ఫార్మా కంపెనీలకు విక్రయించే... విశాఖ సాల్వెంట్స్ సంస్థలో ప్రమాదం జరింది. ఫ్యాక్టరీ మొత్తం కెమికల్స్‌తో...

కండ‌లు పెంచుతున్న‌ నాగ‌శౌర్య

ల‌వర్ బోయ్ పాత్ర‌ల‌కు అచ్చుగుద్దిన‌ట్టు స‌రిపోతాడు నాగశౌర్య‌. త‌న కెరీర్‌లో అలాంటి క‌థ‌లే ఎక్కువ విజ‌యాల్ని అందించాయి. అయితే... మాస్ హీరోగా నిరూపించుకోవాల‌న్న‌ది నాగ‌శౌర్య తాప‌త్ర‌యం. అలాంటి క‌థ‌లు ఎంచుకుంటున్నా - స‌రైన...

HOT NEWS

[X] Close
[X] Close