హైకోర్టులో పెద్దిరెడ్డికి ఊరట..కానీ షరతులు వర్తిస్తాయి..!

ఈ నెల 21వ తేదీ వరకూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని హౌస్ అరెస్ట్ చేయాలన్న ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశాలను హైకోర్టు రద్దు చేసింది. అయితే ఎస్‌ఈసీ ఇచ్చిన ఆదేశాల్లో ఇదొక్కటి మాత్రమే హైకోర్టు కొట్టి వేసింది. ఎన్నికల అంశాల్లో జోక్యం చేసుకోకూడదని మీడియాతో మాట్లాడవద్దన్న ఎస్ఈసీ నిర్ణయాలను హైకోర్టు సమర్థించింది. దీంతో పెద్దిరెడ్డి … మీడియాతో మాట్లాడుతూ… చేస్తున్న వ్యాఖ్యాలను ఇక ఆపేయాల్సి ఉంది. అలాగే.. ఎన్నికలకు సంబంధించిన అంశాలపై జోక్యం చేసుకోకూడదు. ఎస్‌ఈసీ తన హౌస్ అరెస్ట్‌పై ఆదేశాలు ఇవ్వగానే మంత్రి పెద్దిరెడ్డి అవి అమలు కావని వ్యాఖ్యానించారు. తర్వాత కట్టుబడి ఉంటానన్నారు. రాత్రికి హౌస్ మోషన్ పిటిషన్ వేశారు. ఉదయమే హైకోర్టు విచారణ జరిపి .. పెద్దిరెడ్డికి రిలీఫ్ ఇచ్చింది.

పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుండి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి .. నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై డైరక్ట్ ఎటాక్ చేస్తున్నారు. కుక్కలతో సహా పోల్చి విపరీతంగా తిడుతున్నారు. అదే సమయంలో జైలు శిక్షవేస్తామని బెదిరిస్తున్నారు. వాటితో పాటు.. తాజాగా ఉద్యోగుల్ని కూడా బెదిరించారు. ఎస్‌ఈసీ మాటలు వింటే మార్చి 31 తర్వాత బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరికలు జారీ చేశారు. ఇవన్నీ నేరపూరితమైన .. ఉద్దేశపూర్వకంగా ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగించే చర్యలే కావడంతో ఎస్‌ఈసీ చర్యలు చేపట్టింది. కానీ దీనిపైనా ఆయన న్యాయపోరాటం చేసి రిలీఫ్ తెచ్చుకున్నారు.

ఎస్‌ఈసీ ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం పెద్దలతో పాటు పెద్దిరెడ్డి కూడా ఎప్పుడూ పెద్దగా పాటించలేదు. అయితే.. ఎస్‌ఈసీ తన ఆదేశాలను కేంద్ర హోంశాఖ కార్యదర్శికి కూడా పంపారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా జరుగుతున్న పరిణామాలను.. మంత్రుల తీరును.. వారి బెదిరింపులను వారి దృష్టికి తీసుకెళ్లారు. సరైన సూచనలు చేయాలని కోరారు. ఈ లోపు కోర్టుకెళ్లడంతో హౌస్ అరెస్ట్ నుంచి మాత్రం మినహాయింపు లభించింది. ఇప్పుడు కేంద్ర హోంశాఖ వైపు నుంచి ఎలాంటి స్పందన వస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

టీ 20 ప్ర‌పంచ‌క‌ప్: భార‌త జ‌ట్టు ఇదే

జూన్‌లో జ‌ర‌గ‌బోయే టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం భార‌త‌జ‌ట్టుని బీసీసీఐ ప్ర‌క‌టించింది. రోహిత్ శ‌ర్మ‌ని కెప్టెన్‌గా నియ‌మించింది. గాయం కార‌ణంగా జ‌ట్టుకు దూర‌మై, ప్ర‌స్తుతం ఐపీఎల్ లో బ్యాటర్‌, కీప‌ర్ గా...

గాజు గ్లాస్ గుర్తుపై ఏ క్షణమైనా ఈసీ నిర్ణయం – లేకపోతే హైకోర్టులో !

జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తు రిజర్వ్ చేసినప్పటికీ ఆ పార్టీ పోటీ చేయని స్థానాల్లో స్వతంత్రులకు గుర్తు కేటాయించడంపై తీవ్ర వివాదాస్పదమయింది. ఈ అంశంపై జనసేన హైకోర్టును ఆశ్రయించింది. ఈ సందర్బంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close