వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తిరుగులేని శక్తిగా వెలిగిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఇప్పుడు బిల్లుల కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. తన భార్య పేరు మీద సుప్రీంకోర్టులో పిటిషన్లు వేస్తున్నారు. ఆయన కుటుంబానికి చెందిన పీఎల్ఆర్ ప్రాజెక్ట్స్ కంపెనీకి రావాల్సిన బకాయిల కోసం పెద్దిరెడ్డి భార్య స్వర్ణలత ఏకంగా సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసిన అత్యున్నత న్యాయస్థానం, ఏవైనా అభ్యంతరాలు ఉంటే హైకోర్టులోనే తేల్చుకోవాలని సూచిస్తూ పిటిషన్‌ను తిరస్కరించింది.
ఆ బిల్లులన్నీ జగన్ హయాంలో పెట్టుకున్నవే !
ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పీఎల్ఆర్ కంపెనీకి కొత్తగా ఎలాంటి పనులు కేటాయించలేదు. గతంలో జగన్ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా కట్టబెట్టిన అనేక పనులను ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటికే నిలిపివేసింది. ఇప్పుడు పెద్దిరెడ్డి అడుగుతున్న పెండింగ్ బిల్లులన్నీ గత వైసీపీ ప్రభుత్వ కాలంలో చేసిన పనులకు సంబంధించినవే . తన అత్యంత సన్నిహితుడు, పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన పెద్దిరెడ్డికి కూడా జగన్ తన హయాంలో బిల్లులు చెల్లించలేదనే విషయం ఈ పిటిషన్ ద్వారా బహిర్గతమైంది. ఎన్నికల సమయంలో ఆర్థికంగా వాడుకుని, బిల్లుల దగ్గరకు వచ్చేసరికి జగన్ చేతులెత్తేయడంతో పెద్దిరెడ్డి ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది.
బిల్లులు లేవు.. జైలు పాలయినా మిథున్ రెడ్డి
రాజకీయంగా జగన్‌ను నమ్ముకున్నందుకు పెద్దిరెడ్డి కుటుంబం ఇప్పుడు భారీ మూల్యం చెల్లించుకుంటున్నట్లు కనిపిస్తోంది. తనయుడు మిథున్ రెడ్డిని కూడా అనేక వివాదాల్లోకి నెట్టి, చివరకు జైలు పాలు చేశారు. మద్యం స్కాంలో పిసరంత మిథున్‌రెడ్డికి ఇచ్చి ఆయనను బలి చేశారు. అధికారంలో ఉన్నప్పుడు చక్రం తిప్పిన పెద్దిరెడ్డి చంద్రబాబు, బాలకృష్ణలను ఓడించడానికి వందల కోట్లు ఖర్చు చేశారు. ఆ ఖర్చులన్నీ ప్రభుత్వ బిల్లుల ద్వారానే రావాలి. ముఫ్పై ఏళ్లు మనమే ఉంటామని జగన్ రెడ్డి ఇవ్వలేదు. ఇప్పుడు బిల్లుల కోసం కోర్టుల చుట్టూ తిరగడం కంటే, తనను అడ్డగోలుగా వాడుకున్న జగన్ రెడ్డినే నిలదీయాలన్న సలహాలు ఆయనకు వైసీపీ నేతల నుంచే వస్తున్నాయి.
పెద్దిరెడ్డిని కూడా వదలకుండా ముంచేసిన జగన్
జగన్ రెడ్డి నాయకత్వంలో నష్టపోయిన నేతల జాబితాలో పెద్దిరెడ్డి పేరు కూడా చేరిపోయింది. పీఎల్ఆర్ కంపెనీకి సంబంధించిన బిల్లులు నిలిచిపోవడంతో పెద్దిరెడ్డి కుటుంబం ఆర్థికంగానూ ఇబ్బందుల్లో పడినట్లుగా కనిపిస్తోంది. సమాచారం. సొంత పార్టీ అధికారంలో ఉన్నప్పుడే బకాయిలు వసూలు చేసుకోలేకపోయిన పెద్దిరెడ్డి, ఇప్పుడు కోర్టుల ద్వారా సాధించేది ఏముంటుందన్న ప్రశ్న వినిపిస్తోంది.


