చంద్రబాబును తప్పుడు కేసుల్లో అరెస్టు చేసి దాదాపుగా రెండు నెలలు జైల్లో ఉంచి ఆయన ఆరోగ్యానికి పెను ముప్పు తెచ్చిన జగన్ రెడ్డి సైకోతత్వాన్ని ప్రజలు మర్చిపోయారని అనుకుంటున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఎన్నికలు దగ్గరకు రావడంతో పార్టీ క్యాడర్ గుర్తు వచ్చారు. వారిని పార్టీ ఆఫీసుకు పిలిచి భోజనాలు పెట్టి.. ప్రజల చేత రెండు బటన్లు నొక్కించాలని చెబుతున్నారు. ఈ క్రమంలో జగన్ రెడ్డి చేసిన నిర్వాకాలను ప్రజలు మర్చిపోయారని.. వాటి గురించి ఆందోళన వద్దన్నట్లుగా ఆయన చెప్పడం పార్టీ కార్యకర్తలను కూడా ఆశ్చర్యపరిచింది.
చంద్రబాబు జైలుకి వెళ్ళారు, బెయిల్ పై వచ్చారని జనం మర్చిపోయారు. రోగాలు ఉన్నాయని జైలు నుండి బెయిల్ పై వచ్చిన చంద్రబాబు.. ఈరోజు యువకుడిలా ఊర్లలో తిరుగుతున్నారని ఆక్రోశం వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం.. కేసులపై మాట్లాడవద్దని సుప్రీంకోర్టు నుంచి ఆదే్శాలు తెచ్చుకుంది ప్రభుత్వం. ఈ అంశంపై ప్రజల్లో చర్చ జరగదని ఆయన అనుకుంటే అంత కంటే అమాయకత్వం ఉండదు. జగన్ రెడ్డి చేసిన ప్రతీ నిర్వాకంపై ప్రజల్లో చర్చ ఉంటుంది. జగన్ రెడ్డి సైకోతత్వానికి తగ్గట్లుగా టీడీపీ నేతలపై చేసిన ప్రతీ దాష్టీకంపై ఎన్నికల సమయంలో చర్చ జరుగుతుంది. అవేమీ గుర్తుండవు కాబట్టి ప్రజలు వాటిని గుర్తుంచుకోని ఓట్లు వేయరని చెబుతున్నారు. అంతే కాదు మైనార్టీలకు గత ప్రభుత్వం చేసేవి కూడా చేయబోమని ఆయన చెబుతున్నారు. షాదీ తోఫా నిబంధనలు మార్పు చేయటానికి కూడా జగన్ అంగీకారo చెప్పలేదు.
ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మహిళలకు ఉచిత బస్సు, షాదీ తోఫా నిబంధన సడలింపు ఇవ్వాలని జగన్ అనుకోవడం లేదని అంటున్నారు. నొక్కుతున్న బటన్లకు డబ్బులు పడటం లేదని ఐదేళ్లుగా పార్టీ క్యాడర్ ను పట్టించుకోవడం లేదని ఎవరన్నా చెబితే.. సజ్జల వినే పరిస్థితులో కూడా లేరు.