జగన్ రెడ్డి నేలను నాకించేసినా.. తన భార్యను జైలుకుపోవాల్సిన పరిస్థితి కల్పించినా మాజీ మంత్రి పేర్ని నానికి ఇంకా బల్బ్ వెలగలేదు. వెలిగినా తనకు అంతకు మించిన దారి లేదనుకుంటున్నారేమో కానీ కార్యకర్తల్ని రెచ్చగొట్టి ఏదో సాధిద్దామని ప్రయత్నిస్తున్నారు. అధికారంలోకి వచ్చాక అందర్నీ సైలెంట్ గా చంపేద్దామని ఇప్పుడు రప్పా రప్పా అని అరవడం ఎందుకని ఆయన అసహనం వ్యక్తం చేస్తున్నారు. అరిచే కుక్క కరవదని కూడా పార్టీ నేతలపై మండి పడుతున్నారు. పార్టీ కార్యకర్తల ముందు మైక్ పట్టుకున్నప్పుడల్లా పేర్ని నానిది ఇదే గోల.
పేర్ని కృష్ణమూర్తి అనే పెద్దాయన కొడుకుగా రాజకీయాల్లోకి వచ్చి.. వైఎస్ వెన్నుపోటుతో ఒక సారి ఓడిపోయిన ఆయన.. తర్వాత ఆ కుటుంబానికి బానిసలా మారారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి భావజాలాన్ని మచిలీపట్నంలో అమలు చేస్తామన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కుటుంబ సమస్యల కారణంగా గత ఎన్నికల్లో తన ఎమ్మెల్యే టిక్కెట్ ను కుమారుడికి ఇప్పించుకుని ఘోరంగా పడిపోయేలా చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి బాటలో రాజకీయ ప్రత్యర్థుల్ని వ్యక్తిగత శత్రువులుగా చేసుకున్నారు. పవన్ కల్యాణ్ పై అనకూడని మాటలు మాట్లాడి.. జగన్ ను మెప్పించారు కానీ.. సొంత వర్గంలోనే పరపతి కోల్పోయారు. జగన్ రెడ్డి చివరికి జోగి రమేష్ కోసం మంత్రి పదవిని పీకేసినా ఏమీ మాట్లాడలేకపోయారు . ఇప్పుడు అదే జోగి రమేష్ సైలెంట్ గా ఉండి.. తలుపులు తెరిస్తే టీడీపీలోకి వెళ్లేందుకు రెడీగా ఉన్నారు. కానీ ఆయన నీడ కూడా పడేందుకు అంగీకరించకపోవడంతో సైలెంటుగా ఉన్నారు. అప్పుడప్పుడు పేర్ని భాషలో మొరుగుతున్నా..అది అవసరార్థమే. ఆ లాజిక్ కూడా పేర్నికి అర్థం కాలేదు.
పేర్ని నానితో జగన్ రెడ్డి తన గేమ్ ఆడుతున్నారు. ఇప్పటికి ఆయన రాజకీయ జీవితం తేడా కొట్టేసింది. కొడుకు రాజకీయ జీవితాన్ని ఇప్పటికే సమాధి చేసేశారు. ఆ కొడుకు అధికారంలో ఉన్నప్పుడు చేసిన వ్యవహారాలు.. ఏ మాత్రం విషయ పరిజ్ఞానం లేని గొప్పతనం అందరికీ తేట తెల్లమయింది. పేర్ని నాని కొడుకులో ఎవరూ లీడర్నీ చూసే పరిస్థితి లేకుండా పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఫ్రస్ట్రేషన్ కు గురవుతున్నారేమో కానీ.. పేర్ని నాని కంట్రోల్ తప్పి పోతున్నారు.
జగన్ రెడ్డిని నమ్ముకుని సర్వం నాశనమైనవాళ్లు కళ్ల ముందే కనిపిస్తున్నారు. వారిలో కొంత మంది నేర్చుకుంటున్నారు.. తెలుసుకుంటున్నారు. కానీ పేర్ని నాని మాత్రం ఇంకా ఇంకా రెచ్చిపోతున్నారు. తాను కార్యకర్తలకు చెప్పే మాట.. అరిచే కుక్క కరవదు అనే విషయాన్ని కూడా మరచిపోతున్నారు.