పేర్ని నాని కోపం కలెక్టర్ పై కాదు సీఎం పైనే !

మాజీ మంత్రి పేర్ని నాని పరోక్షంగా జగన్ రెడ్డిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. గతంలో ఏలూరు జిల్లా కలెక్టర్ పై మండిపడ్డారు. తీవ్ర ఆరోపణలు చేయడమే కాదు.. సీఎం ఇంటి ముందు ముందు ధర్నా చేస్తానన్నారు. అప్పట్లో ఇద్దర్నీ పిలిపించి ఏదో విధంగా సర్దుబాటు చేశారు. కానీ ఆ అసంతృప్తి అంతే ఉంది. తాజాగా పేర్ని నాని జెడ్పీ సమావేశానికి గైర్హాజరు అవడంపై మరోసారి మండిపడ్డారు. ఏలూరు కలెక్టర్ ప్రసన్న వెంకటేష్.. కృష్ణా జిల్లా జడ్పీ సమావేసానికి రాకపోవడంతో కలెక్టర్ టార్గెట్ గా పేర్ని నాని వ్యాఖ్యలు చేశారు.

సర్వ సభ్య సమావేశం కన్నా వ్యవసాయ సలహా మండలి సమావేశం ఎక్కువయ్యిందా ? అంటూ కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌పై మండిపడ్డారు పేర్నినాని.. ఓట్లు వేసిన ప్రజలకు జవాబుదారీగా ఉండలేని అధికారులు ఎందుకని ప్రశ్నించారు. వ్యవసాయ సలహా మండలి సమావేశం కంటే ముందే సర్వ సభ్య సమావేశం నిర్వహణపై నిర్ణయం తీసుకున్నారు.. కానీ, జడ్పీ సమావేశానికి రాకూడదు అనే ఈ సమావేశం కలెక్టర్ ఏర్పాటు చేశారని విమర్శించారు. నిజానికి జడ్పీ సమావేశానికి వెళ్లనవసరం లేదని.. వ్యవసాయ సలహా మండలి సమావేశం పెట్టుకోవాలని ఏలూరు కలెక్టర్ కు.. సీఎంవోనే సూచించింది. ఈ విషయం కూడా పేర్ని నానికి తెలుసు. అందుకే తన విమర్శల్లో సీఎంవో ప్రస్తావన కూడా తీసుకు వచ్చారు. సర్వ సభ్య సమావేశానికి వెళ్లొద్దని సీఎంవో చెప్పిందా అని మండిపడ్డారు. జిల్లాలో తనపై కుట్ర జరుగుతోందని పేర్ని నాని గట్టిగా నమ్ముతున్నారు.

తనను మంత్రి పదవి నుంచి తప్పించడమే కాకుండా ప్రతిపక్ష నేతల్ని ఘోరంగా తిట్టడానికి మాత్రమే తనను వినియోగించుకుంటున్నారని ఇతర విషయాల్లో పక్కన పెట్టారని పేర్ని నానికి కూడా అర్థమైంది. అందుకే.. ఆయన సందర్భం వచ్చినప్పడుల్లా.. సీఎంవోను టార్గెట్ చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మరో ఇద్దరు ఏపీ ఐఏఎస్‌లకు జైలు శిక్ష – సిగ్గు రాదా ?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్వాకాల గురించి గ్రంధాలు రాసినా తరగనంత సాహిత్యం పోగుపడిపోయింది. కోర్టుల దగ్గర ఉన్న ధిక్కార పిటిషన్లను లెక్కేసుకోవడానికి ఐదేళ్లు చాలవు. అతి కష్టం మీద తీర్పు వచ్చినా వాటిని అమలు...

ఏపీ సర్కార్ వారి డేటా ఎనలిటికల్ యూనిట్ – పెద్ద ప్లానే !

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా డేటా ఎనలిటికల్ యూనిట్ ను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఏం డేటా ఎనలటిక్స్ చేస్తుందంటే... ఆదాయమంట. ఆదాయం ఎక్కడ తగ్గిపోయిందో గుర్తించి పెంచడానికి ఈ యూనిట్...

చంద్రబాబు బెయిల్ రద్దు కాలేదు సరి కదా సర్కార్‌కు సుప్రీం షరతు !

చంద్రబాబు జనాల్లోకి వస్తే తమ పరిస్థితి ఏమి అయిపోతుందోనని కంగారు పడిపోతున్న జగన్ రెడ్డి అండ్ గ్యాంగ్ సుప్రీంకోర్టులోనూ దాని కోసమే ప్రయత్నించారు. చంద్రబాబు రాజకీయ ర్యాలీలు, సమావేశాల్లో పాల్గొనకుండా షరతులు విధించాలని...

గెలిపించకపోతే చచ్చిపోతా : బీఆర్ఎస్ అభ్యర్థి

ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థులు చివరి ప్రయత్నంగా ఆత్మహత్య చేసుకుంటామని ఓటర్లను బెదిరిస్తున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ పై పోటీ చేస్తున్న కౌశిక్ రెడ్డి చివరి ప్రయత్నంగా ఓటర్లను బెదిరించడం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close