బయట కనిపిస్తే ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం, గొడవలు రేగేలా రెచ్చగొట్టడం కేసులు నమోదైతే కనిపించకుండా పోవడం..కోర్టులో రిలీఫ్ దొరికిన తర్వాతే మళ్లీ బందరులో ప్రత్యక్షం కావడం అనే టైంటేబుల్ ను పేర్ని నాని కంటిన్యూ చేస్తున్నారు. ఇటీవల వరుసగా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు. చంద్రబాబు ప్రాణానికి కూడా హాని తలపెడతామన్నట్లుగా వ్యాఖ్యానించడంతో పలు చోట్ల కేసులు నమోదయ్యాయి.
ఈ కేసుల్లో పేర్ని నాని తనను అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలని హైకోర్టుకు వెళ్లారు. కానీ ఊరట దక్కలేదు. మళ్లీ మంగళవారం విచారణకు రానుంది. ఆలోపు అరెస్టు చేస్తే.. ఆ పిటిషన్ నిర్వీర్యం అయిపోతుంది. మళ్లీ బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలి. అందుకే పోలీసులకు కనిపించుకండా ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మంగళవారం అనుకూల తీర్పు వస్తే మళ్లీ మీడియా ముందుకు యథావిధిగా రప్పా .. రప్పా డైలాగులు చెప్పి క్యాడర్ ను రెచ్చగొట్టే అవకాశాలు ఉన్నాయి.
మిథున్ రెడ్డిని అరెస్టు చేస్తే పేర్ని నాని ఎక్కడా కనిపించలేదు. పెద్ద నోరున్నా నేతల్లో ఒకరు.. అన్నీ వదిలేసినా నేతల్లో కీలక వ్యక్తి కావడంతో బలమైన వాయిస్ వినిపిస్తారని అనుకున్నారు. కానీ ఆయన మీడియా ముందుకు రాకపోవడంతో వైసీపీ నేతలు ఆశ్చర్యపోయారు. చివరికి అజ్ఞాతంలో ఉన్నట్లుగా తేల్చుకున్నారు.