కోర్టుల్లో శిక్షలు పడే కేసుల్లో కూడా బిందాస్ ఉండే నేతలు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఓ జగన్ భక్త రిటైర్డ్ ఐఏఎస్ దాఖలు చేసిన పబ్లిసిటీ పిటిషన్ విచారణకు వస్తే.. పవన్ కు షాక్ అని సంబరాలు చేసుకుంటున్నారు. అసలు ఈ పిటిషన్ ఏమిటో.. అందులో ఆయన ఏం చెప్పాడో.. అది ఎలా తప్పవుతుందో ఒక్కరంటే ఒక్కరూ ఆలోచించడంలేదు. విజయ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ విచారణకు అర్హత ఉందో లేదో ఎనిమిదో తేదీన హైకోర్టు తేలుస్తుంది. అంత మాత్రాన దానికే షాకులు అంటూ సంబరాలు చేసుకుంటున్నరాు.
పవన్ కల్యాణ్ .. సినిమా ప్రమోషన్లో ప్రభుత్వ నిధులు, అధికార యంత్రాంగాన్ని వినియోగించారని, మంత్రి గా కొనసాగుతూ సినిమాలు చేస్తున్నారని , ఆయనపై స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలంటూ విజయ్‌కుమార్ పిటిషన్ వేశారు. సినిమా ప్రమోషన్షన్ కు ప్రభుత్వ నిధులు ఉపయోగించడం, అధికార యంత్రాంగాన్ని వినియోగించడం అనే ఆరోపణలకు విజయ్ కుమార్ ఎలాంటి ఆధారాలు జత చయలేదు. మంత్రిగా కొనసాగుతూ సినిమాలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు.. అలా చేయకూడదని ఎక్కడా లేదు.. సీఎం అనుమతితో చేసుకోవచ్చు.
ఉపముఖ్యమంత్రి సినిమాల్లో నటన కొనసాగించడాన్ని అనైతికం, రాజ్యాంగవిరుద్ధమై చర్యగా ప్రకటించాలని ఆయన అంటున్నారు. అలా అయితే.. ఇక పదవుల్లో ఉండే ఎవరూ వ్యక్తిగతపనులు చేసుకున్నా రాజ్యాంగ విరుద్ధమే అవుతుంది. అసలు పిటిషన్ కు విచారణ అర్హతా ఉందాలేదా అన్నది తేలుస్తారు. అంతే కానీ.. దానిపై విచారణ జరిగినంత మాత్రాన పవన్ ఏదో తప్పు చేశారని ప్రచారం చేయడం అతి రాజకీయానికి పరాకాష్ట. శిక్షలు పడినవాళ్లు ఉన్న పార్టీలు ఇలా చేయడం మరీ అతి అవుతుంది.