ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ-1గా ఉన్న ప్రభాకర్ శాశ్వతంగా అమెరికాలో తలదాచుకోవాలనుకోని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చివరి ప్రయత్నంలోనూ ఆయనకు ఎదురుదెబ్బే తగిలింది. దీంతో ప్రభాకర్ రావు ఈ నెల చివరి వరకు తెలంగాణకు రావడం ఖాయంగా కనిపిస్తోంది.
ఫోన్ ట్యాపింగ్ కేసును రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో అరెస్ట్ చేస్తారని అమెరికాలోనే ఏడాదిన్నర కాలంగా గడుపుతున్నారు నిందితుడు ప్రభాకర్ రావు. ఆయనను ఇండియాకు తీసుకొచ్చేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేసినా అనారోగ్యమని , ఇంకేదో కారణాలు చెప్పి తప్పించుకున్నారు. మరోసారి అలాంటి స్ట్రాటజీని ప్లే చేశారు. తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలని ట్రంప్ సర్కార్ కు దరఖాస్తు చేసుకున్నారు.
అసలే ఆయన ట్రంప్..విదేశాలకు చెందిన వారిని వెనక్కి పంపేస్తున్నా ట్రంప్.. ప్రభాకర్ రావు అభ్యర్ధనను మన్నిస్తారా? నో చాన్స్. ఆయనకు అమెరికాలో ఆశ్రయం ఇచ్చేందుకు నిరాకరించింది ట్రంప్ ప్రభుత్వం. మరోవైపు ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసింది ఇంటర్ పోల్. దీంతో అమెరికాలోని హోం ల్యాండ్ సెక్యూరిటీ ఏజెన్సీ ఆయన్ను ఇండియాకు తరలించే ఏర్పాట్లు చేస్తోంది.