బిగ్ బాస్‌కి కొత్త త‌ల‌నొప్పి… హైకోర్టులో పిల్‌

తెలుగు బిగ్ బాస్ 3కి కొత్త త‌ల‌నొప్పులు మొద‌ల‌య్యాయి. ఈ షో నిర్వ‌హ‌ణ‌ని అడ్డుకోవాల‌ని కోరుతూ కేతిరెడ్డి జ‌గ‌దీశ్వ‌రెడ్డి హైకోర్టులో ప్ర‌జా ప్ర‌యోజ‌న వాజ్ఞం దాఖ‌లు చేశారు. యువ‌త‌రాన్ని, ముఖ్యంగా పిల్ల‌ల్ని చెడుదోవ ప‌ట్టించేలా ఈ షో ఉంటోంద‌ని, సినిమాని ఎలా సెన్సార్ చేస్తారో, అలానే ఈ షోనీ సెన్సార్ చేసి ఆ త‌ర‌వాతే ప్ర‌సారం చేసేలా చూడాల‌ని, సెల‌క్ష‌న్ పేరుతో మ‌హిళ‌ల్ని వేధిస్తూ, క‌మిట్‌మెంట్ పేరిట ఒత్తిడికి గురి చేస్తున్న `స్టార్ మా` యాజ‌మాన్యంపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆ పిటీష‌న్‌లో్ కోరారు. రాత్రి 11 గంట‌ల‌కు దాటాకే ఈ కార్య‌క్ర‌మం ప్ర‌సారం చేయాల‌ని న్యాయ‌స్థానానికి పిటీష‌న్ దారుడు విజ్ఞ‌ప్తి చేశారు. ఈ కేసులో ప‌ది మంది ప్ర‌తివాదుల్ని చేర్చారు. అందులో బిగ్ బాస్ 3 హోస్ట్ నాగార్జున కూడా ఉన్నారు. ఇరు ప‌క్షాల వాద‌న విన్న కోర్టు.. ఈనెల 23న విచార‌ణ‌ని వాయిదా వేసింది. ఈనెల 21 నుంచి బిగ్ బాస్ షో ప్రారంభం కానున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే సెల‌బ్రెటీలు ఎవ‌రన్న‌ది దాదాపుగా తేలిపోయింది. అయితే అధికారికంగా మాత్రం 21నే `మా` యాజ‌మాన్యం వెల్ల‌డించ‌నుంది. ప్రారంభానికి ముందే అనేక వివాదాల‌కు నెల‌వైన బిగ్ బాస్ షో.. మున్ముందు ఇంకెన్ని విమ‌ర్శ‌ల్ని, వివాదాల‌నూ ఎదుర్కుంటుందో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కండ‌లు పెంచుతున్న‌ నాగ‌శౌర్య

ల‌వర్ బోయ్ పాత్ర‌ల‌కు అచ్చుగుద్దిన‌ట్టు స‌రిపోతాడు నాగశౌర్య‌. త‌న కెరీర్‌లో అలాంటి క‌థ‌లే ఎక్కువ విజ‌యాల్ని అందించాయి. అయితే... మాస్ హీరోగా నిరూపించుకోవాల‌న్న‌ది నాగ‌శౌర్య తాప‌త్ర‌యం. అలాంటి క‌థ‌లు ఎంచుకుంటున్నా - స‌రైన...

‘పుష్ష‌’‌పై విజ‌య్‌ సేతుప‌తి క్లారిటీ

అల్లు అర్జున్ - సుకుమార్‌ల హ్యాట్రిక్ సినిమా 'పుష్ష‌'. ఈ సినిమా కోసం విజ‌య్ సేతుప‌తిని విల‌న్ గా ఎంచుకున్నారు. కొన్ని కార‌ణాల వ‌ల్ల విజ‌య్ ఈ సినిమా నుంచి త‌ప్పుకున్నాడు. ఆ...

వ‌ర్మ‌ని లైట్ తీసుకున్నాడా?

రాంగోపాల్ వ‌ర్మ పేల్చ‌బోతున్న బాంబు `ప‌వ‌ర్ స్టార్‌`. ఓటీటీ వేదిక‌గా వ‌ర్మ ఇది వ‌ర‌కు ప‌లు సినిమాల్ని వ‌దిలాడు. దేనికీ రాని క్రేజు.. `ప‌వ‌ర్ స్టార్‌`కి వ‌చ్చింది. ఈ సినిమా స్పెషాలిటీ గురించి...

రాజకీయాల్లో రాజస్థాన్ “సచిన్” హిట్ వికెట్ ..!?

రాజస్థాన్ ప్రభుత్వాన్ని మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింధియా కూల్చేసినట్లుగా కూల్చేస్తారని భావించిన సచిన్ పైలట్.. చివరికి.. హిట్ వికెట్‌గా మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. తన వైపు 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని.. ఆయన తనకు...

HOT NEWS

[X] Close
[X] Close