ఇదీ పీకే సర్వే – టీఆర్ఎస్ “ప్లాన్డ్ లీక్” !

ప్రశాంత్ కిషోర్ సర్వేను అనధికారికంగా టీఆర్ఎస్ లీక్ చేసింది. కొంత మంది మీడియా ప్రతినిధులకు వివరాలు ఇచ్చింది. చాలా సెలక్టివ్‌గా నియోజకవర్గాల గురించి మాత్రమే లీక్ చేసింది. ఓవరాల్‌గా మొత్తం పరిస్థితి ఎలా ఉందో చెప్పింది. నిజంగా పీకే అలా ఇచ్చాడా లేకపోతే టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా ప్రజల్లో చర్చ జరగడానికి ఇలా చేశారా అన్నది తర్వాత తర్వాత తేలనుంది.

సొంతంగా మెజార్టీ సాధించనున్న టీఆర్ఎస్ !

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్ ఖచ్చితంగా గెలుస్తుదందని పీకే సర్వే తెలిపింది. ఇతరులపై ఆధారాపడాల్సిన అవసరం కూడా లేదని .. సొంత మెజార్టీ వస్తుందని కూడా పీకే నివేదిక తేల్చింది. రెండో స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుందని… ఆ పార్టీ గట్టి పోటీ ఇస్తుందని చెబుతున్నారు. ఇక బీజేపీ హడావుడి పెరిగినప్పటికీ.. చాలా దూరంగా మూడో స్థానంలో ఉంటుందని.. కొన్ని స్థానాల్లో పోటీ ఇచ్చే పరిస్థితి ఉంది కానీ రాష్ట్రం మొత్తం పోటీ ఇచ్చే పరిస్థితి లేదని పీకే తేల్చినట్లుగా టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

టీఆర్ఎస్ సీనియర్ నేతలు.. ఎమ్మెల్యేలపై అసంతృప్తి !

ప్రజల్లో టీఆర్ఎస్‌లో సుదీర్ఘంగా ఉన్న సీనియర్ నేతలు.. ఎమ్మెల్యేల తీరుపై అసంతృప్తి ఉందని పీకే నివేదిక ఇచ్చారు. చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పట్ల ప్రజల్లో సానుకూలత లేదని.. ఖచ్చితంగా వారిని మార్చాల్సిందేనని చెబుతున్నారు. కొన్ని నియోజకవర్గాల పేర్లను కూడా టీఆర్ఎస్ వర్గాలు కొన్ని మీడియాలకు లీక్ చేశాయి. ఆయా స్థానాల్లో సిట్టింగ్‌లకు సీట్లు ఉండవని ముందుగానే సంకేతాలు పంపేందుకు ఇలా చేశారన్న అభిప్రాయం వినిపిస్తోంది.

ప్రభుత్వంపై కూడా అసంతృప్తి – తగ్గించే మార్గాలు !

ప్రభుత్వంపై కూడా ప్రజల్లో అసంతృప్తి ఉందని ప్రశాంత్ కిషోర్ సర్వే తెలిపింది. కొత్త పింఛన్లు, రేషన్ కార్డులు ఇవ్వడం లేదన్న అసంతృప్తి ప్రతీ చోటా కనిపించిందని పీకే చెప్పారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ అసంతృప్తిని తగ్గించుకోవాలన్నారు. అసలు కొత్త పించన్లు, రేషన్ కార్డులు ఇవ్వడం లేదు. హుజూరాబాద్‌ ఎన్నికల సమయంలో ఆ నియోజకవర్గంలో వారికి కొంత మందికి కొత్తగా మంజూరు చేశారు. ఇప్పుడు మళ్లీ ఎన్నికలకు ముందు అడిగిన వారందరికీ రేషన్ కార్డులు, పించన్లు ఇవ్వబోతున్న కేటీఆర్ సభల్లో చెబుతున్నారు. అది పీకే ఎఫెక్టేనని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

మొత్తంగా ఇది పీకే సర్వేనా లేక.. పీకే సర్వేను తమకు అనుకూలంగా టీఆర్ఎస్ వర్గాలు లీక్ చేసుకున్నాయా అన్నది స్పష్టం కాలేదు. కాదు కూడా. కానీ ఇలాంటి సర్వేలు లీక‌్ చేసి.. చర్చ పెట్టడం టీఆర్ఎస్ రాజకీయ వ్యూహాల్లో ఒకటని గతానుభవాలను బట్టి అంచనా వేయవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇది కూడా కేంద్రం ర్యాంకులే.. బీహార్ కంటే ఏపీ ఘోరం !

2020 నాటికి ప్రామాణికంగా తీసుకున్న ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్.. ఈవోడీబీ ర్యాంకుల్లో ఏపీ అగ్రస్థానానికి వచ్చిందని విపరీతంగా ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు కేంద్రం స్టార్టప్స్ ఎకో సిస్టం బాగున్న రాష్ట్రాలకు ర్యాంకులు...

విజయసాయిరెడ్డి తండ్రి హంతకుడు – ఇవిగో రఘురామ బయట పెట్టిన డీటైల్స్ !

విజయసాయిరెడ్డి తండ్రి సుందరరామిరెడ్డి కూడా హంతకుడని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రకటించారు. ఇటీవల విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో అత్యంత దారుణంగా బూతులు తిడుతూండటంతో దానికి పోటీగా రఘురామ కృష్ణరాజు కూడా అదే లాంగ్వేజ్...

ఇద్దరు మహానుభావులని గుర్తు తెచ్చిన… సీతా రామం

మహా గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం లేని లోటు పూడ్చలేనిది. చివర్లో ఆయన పాటలు పాడటం తగ్గించేసిన్నప్పటికీ ఆయన తప్పా మరో గాయకుడు వద్దు అనుకునే పాటలు, సందర్భాలు అనేకం. అయితే ఇప్పుడా ఆయన...
video

మెగా లుక్‌: గాడ్ ఫాద‌ర్ ఆగ‌మనం

https://www.youtube.com/watch?v=WuCjEeyQrq8 మ‌ల‌యాళంలో పెద్ద విజ‌యాన్ని అందుకొన్న చిత్రం... లూసీఫ‌ర్‌. తెలుగులో చిరంజీవితో గాడ్ ఫాద‌ర్ గా రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. మోహ‌న్ రాజా ద‌ర్శ‌కుడు. ఈ సినిమా నుంచి ఫ‌స్ట్ లుక్ బ‌య‌ట‌కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close