‘స‌లార్’ రిలీజ్ డేట్ .. పెద్ద ప్లానే ఉంది!

పాన్ ఇండియా ప్రాజెక్టు స‌లార్ రిలీజ్ డేట్ వ‌చ్చేసింది. 2023 సెప్టెంబ‌రు 28న ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు. ఇది.. `రెబ‌ల్` రిలీజ్ డేట్. దాంతో ప్ర‌భాస్ అభిమానులు కంగారు ప‌డుతున్నారు.కాక‌పోతే… ఈ డేట్ ఎంచుకోవ‌డానికి పెద్ద కార‌ణ‌మే ఉంది. సెప్టెంబ‌రు 28.. గురువారం వ‌చ్చింది. సాధార‌ణంగా బ‌డా సినిమాలు శుక్ర‌వారం విడుద‌ల అవుతాయి. ఒక రోజు ముందుగా రిలీజ్ అవ్వ‌డానికి కార‌ణం… గురువారం నేష‌న‌ల్ హాలిడే. ముస్లింల పండుగ‌ మిలాదున‌బి గురువారం వ‌చ్చింది. సో.. ఓ రోజు సెలవు క‌లిసొస్తుంది. శుక్ర‌, శ‌ని, ఆది వీకెండ్స్‌. అక్టోబ‌రు 2 గాంధీ జ‌యంతి. అంటే.. వ‌రుస‌గా రాబోతున్న సెల‌వు రోజులు స‌లార్‌కి ప్ల‌స్ కాబోతున్నాయ‌న్న‌మాట‌. పాన్ ఇండియా సినిమాకి ఈ మాత్రం స్పేస్ కావాలి. సినిమా రిపోర్ట్ ఎలా ఉన్నా.. తొలి 5 రోజులూ… స‌లార్ బాక్సాఫీసు ద‌గ్గ‌ర సునామీ సృష్టించేయొచ్చు. బాగుంటే మాత్రం ఇక స‌లార్‌ని ఎవ‌రూ ఆప‌లేరు. అయితే.. అదే సెప్టెంబ‌రు 28న హృతిక్ రోష‌న్ సినిమా `ఫైట‌ర్‌` వ‌స్తోంది. బాలీవుడ్ లో మాత్రం ప్ర‌భాస్ – హృతిక్‌ల మ‌ధ్య గ‌ట్టి పోటీ నెల‌కొంది. ప్ర‌భాస్‌కున్న స్టామినా, త‌న క్రేజ్ ఇప్పుడు పూర్తిగా వేరు. ఒక‌ప్పుడైతే హృతిక్ ని చూసి, ప్ర‌భాస్ వెన‌క్కి త‌గ్గేవాడేమో..? ఇప్పుడు ప్ర‌భాస్ ని చూసి హృతిక్ సినిమానే వెనుక‌డుగు వేసే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

5 నెలల్లో రూ. 40వేల కోట్లు గల్లంతయ్యాయట !

ఏపీ బడ్జెట్ నిర్వహణ గురించి ప్రత్యేకంగా సర్టిఫికెట్లు ఇవ్వాల్సిన పని లేదు. బడ్జెట్ వ్యవహారం ఇప్పుడు కూడా నడుస్తోంది. ఈ ఐదు నెలల్లో రూ. నలభైవేల కోట్లకుపైగా లెక్కలు తెలియడం లేదని గగ్గోలు...

‘గాడ్ ఫాద‌ర్‌’ హిట్‌… నాగ్ హ్యాపీ!

ఈ ద‌స‌రాకి మూడు సినిమాలొచ్చాయి. గాడ్‌ఫాద‌ర్‌, ది ఘోస్ట్‌, స్వాతిముత్యం. గాడ్ ఫాద‌ర్‌కి వ‌సూళ్లు బాగున్నాయి. స్వాతి ముత్యంకి రివ్యూలు బాగా వ‌చ్చాయి. ది ఘోస్ట్ కి ఇవి రెండూ లేవు....

వైసీపీ సర్పంచ్‌ల బాధ జగన్‌కూ పట్టడం లేదు !

వారు వైసీపీ తరపున సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు. ప్రత్యర్థి పార్టీనో.. సొంత పార్టీలో ప్రత్యర్థుల్నో దెబ్బకొట్టడానికి పెద్ద ఎత్తున ఖర్చు పెట్టుకున్నారు. గెలిచారు. కానీ ఇప్పుడు వారికి అసలు సినిమా కనిపిస్తోంది. వీధిలైట్...

చిరంజీవి ఫ్యాన్స్ Vs బ్రాహ్మణ సంఘాలు..

చిరంజీవి ఫ్యాన్స్ Vs బ్రాహ్మణ సంఘాలు.. ఇప్పుడు బంతి... వాళ్లిద్ద‌రి చేతికీ చిక్కింది. ఇక ఆడుకోవ‌డ‌మే త‌రువాయి. అవును... అల‌య్ బ‌ల‌య్‌... కార్య‌క్ర‌మంలో చిరంజీవి - గ‌రిక‌పాటి మ‌ధ్య ఏం జ‌రిగిందో తెలిసింది. చిరుని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close