చంద్రబాబును భౌతికంగా నిర్మూలించే కుట్రలు – ఇవన్నీ సాక్ష్యాలే !?

చంద్రబాబును ఫినిష్ చేస్తామని స్పీకర్ తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఓ స్పీక్ర స్థానంలో ఉండి అలా మాట్లాడాల్సిన వ్యక్తి కాదు. అలా మాట్లాడటం తప్పని తెలియక కాదు. కానీ ఆయన ఉద్దేశపూర్వకంగా అలా మాట్లాడారని క్రి్మినాలజీ నిపుణులు విశ్లేషిస్తున్నారు. కొంత కాలంగా చంద్రబాబు చుట్టూ జరుగుతున్న పరిణామాలు చూస్తే ఇదే నిజమని.. అంటున్నారు.

చంద్రబాబుపై వైసీపీ చేసిన రాళ్ల దాడిలో వృద్ధుడు మృతి

కొద్ది రోజుల క్రితం యర్రగొండపాలెంలో టీడీపీ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఆ సభలో ఉద్దేశపూర్వకంగా చంద్రబాబుపై రాళ్ల దాడి చేశారు. సెక్యూరిటీ అడ్డుకున్నారు. కానీ చంద్రబాబుపై చేసిన రాళ్ల దాడి కారణంగా ఓటీడీపీ కార్యకర్త గాయపడ్డారు. చాలా రోజులు ఆస్పత్రిలో చికిత్స పొంది చనిపోయారు. ఆ రాయి టార్గెట్ చేసింది చంద్రబాబునే. మంత్రి సురేష్ ఆధ్వర్యంలో పకడ్బందీ ప్రణాళిక ప్రకారం ఆ రాళ్ల దాడి జరిగింది. రాళ్ల దాడి చేయడానికి పోలీసులు, సురేష్ పక్కా ప్రణాళిక వేసుకున్నట్లుగా వారి మాటల వీడియో కూడా వెలుగులోకి వచ్చింది. ఇదంతా చంద్రబాబును ఎలిమినేట్ చేయడానికి చేసిన కుట్రేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదంటున్నారు.

చంద్రబాబు ఎక్కడకు వెళ్లిన రాళ్ల దాడులు !

చంద్రబాబు కుప్పం వెళ్లినా రాళ్ల దాడులు చేస్తున్నారు. ఎక్కడకు వెళ్లినా ఏదో ఓ కారణం చూపించి దాడి చేస్తున్నారు. ఇదంతా వైసీపీలోని కొంత మంది పెద్దల కుట్రలతోనే జరుగుతోందని చెబుతున్నారు. ఇది రాజకీయంగా తేలికగా తీసుకోవాల్సిన విషయం కాదని.. జడ్ ప్లస్ కేటగిరి రక్షణలో ఉన్న వ్యక్తి మీద రాళ్లు వేయాలంటే ఎవరైనా సంకోచిస్తారు.కానీ ఏపీలో అధికార పార్టీ ప్రముఖుల కుట్రలు.. పోలీసుల సహకారంతోనే ఇలాంటి దాడులకు ప్రణాళికలు వేస్తున్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదంటున్నారు.

పదే పదే చంద్రబాబు సెక్యూరిటీ బ్రీచ్

చంద్రబాబు సెక్యూరిటీలోకి పదే పదే ఇతర వాహనాలు వస్తున్నాయి. తరచూ అడ్డం పడుతున్నారు. చంద్రబాబు భద్రతను స్థానిక పోలీసులు సీరియస్ గా తీసుకోవడం లేదు. ఉద్దేశపూర్వకంగా లోపాలు ఉండేలా చేస్తున్నారు. ఇదంతా పైకి కనిపిస్తున్న బహిరంగ రహస్యం. వైసీపీ నేతలు దాడులు చేసే వాతావరాణాన్ని పోలీసులు కల్పిస్తున్నారు. ఇలాంటివి అత్యంత తీవ్రమైన విషయాలు. కానీ తేలికగా తీసుకుంటున్నారు. అదీ కూడా ఉద్దేశపూర్వకంగానే.

పాలకుల మనస్థత్వం అదే !

ఏపీలో పాలకుల మనస్థత్వం అదే. వారు తీవ్రమైన అభియోగాలు ఎదుర్కొంటున్నారు. సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత దారుణంగా హత్య చేయించారన్న ఆరోపణలు వస్తున్నాయి. పాలకుల నోటి నుండి చంద్రబాబును చంపడం.. ఎలిమినేట్ చేయడం వంటి అంశాలు చాలా సార్లు వచ్చాయి. అధికారం పోతుందన్న అసహనంతో.. ఉన్మాదానికి లోనై.. ఎలాంటి కుట్రలైనా చేయవచ్చన్న అభిభిప్రాయం మానసిక నిపుణుల్లోనూ వినిపిస్తోంది.

చంద్రబాబు ప్రాణానికి ముప్పుపై కేంద్రానికి స్పష్టమైన సమాచారం ?

చంద్రబాబు ప్రాణానికి ముప్పు ఉందని..కేంద్రానికి స్పష్టమైన సమాచారం ఉన్నట్లుగా భావిస్తున్నారు. అందుకే జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న నేతలకు ఎవరికీ లేనంతగా ఇరవై నాలుగు మంది కమెండోలతో భద్రతను కల్పిస్తున్నాయి. కేంద్ర ఇంటలిజెన్స్ వ్యవస్థ చంద్రబాబుపై జరుగుతున్న రాజకీయ కుట్రలు.. దాడులు పన్నాగాలను ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇవన్నీ ఆషామాషీగా జరుగుతున్న వ్యవహారాలు కాదని.. త్వరలోనే చంద్రబాబుపై జరిగిన అతి పెద్ద కుట్రను కేంద్ర ఇంటలిజెన్స్ వర్గాలు చేధిస్తాయని టీడీపీ వర్గాలంటున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎన్టీఆర్ స్పందించకపోతే ఐ డోంట్ కేర్ : బాలకృష్ణ

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ పై సినీ పరిశ్రమ స్పందన తీరుపై చాలా విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబు పాలనలో ఎంతో అభివృద్ధి సాధించిన సినీ పరిశ్రమ, అలాగే లబ్దిపొందిన చాలా...

జగన్ రెడ్డి ఢిల్లీ వెళ్లేది నిజం – మోదీ, షాలతో భేటీ డౌట్ !

లండన్ లో ఉండి చంద్రబాబును అరెస్టు చేయించి ఇండియాకు రాక ముందే ఢిల్లీ పర్యటన పేరుతో ప్రచారం చేసుకుని మోడీ , షాలతో భేటీ అవుతారని ప్రచారం చేయించుకున్న జగన్ రెడ్డి తాపత్రయం...

చంద్రబాబుకు డబ్బు ముట్టినట్లు ఆధారాలున్నాయా ?: ఏసీబీ కోర్టు జడ్జి

చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని సీఐడీ దాఖలు చేసిన పిటిషన్, అలాగే బెయిల్ కోసం చంద్రబాబు దాఖలు చేసుకున్న పిటిషన్లపై విచారణ ఏసీబీ కోర్టులో జరిగింది. ఉదయం చంద్రబాబు తరపు లాయర్ దూబే, మధ్యాహ్నం...

సుధీర్ బాబుకి ‘హంట్’ నేర్పిన గుణపాఠం

సుధీర్ బాబు 'హంట్' సినిమా బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ అయ్యింది. కెరీర్ లో పలు ప్రయోగాలు చేసిన సుధీర్ బాబు.. హంట్ కూడా తనకు మరో ప్రయోగాత్మక చిత్రం అవుతుందని బలంగా నమ్మాడు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close