ప్రధాని నరేంద్ర మోడి కేరళలో హడావుడి అందుకేనా?

మొన్న శనివారం రాత్రి కేరళలోని కొల్లాంలో పుట్టింగళ్ దేవాలయం వద్ద జరిగిన బాణాసంచా ప్రదర్శన కాస్తా ఒక పెను అగ్నిప్రమాదంగా మారింది. ఆ ప్రమాదంలో సుమారు 77 మందికి పైగా చనిపోయారు. ఆ ప్రమాదంలో గాయపడిన 273మంది వివిధ స్థానిక ఆసుపత్రులలో చికిత్సపొందుతున్నారు.

ఈ ప్రమాదం గురించి తెలియగానే ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర ఆరోగ్యశాఖా మంత్రి జెపి.నడ్డాతో కలిసి నిన్న కేరళ చేరుకొని ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. ప్రధాని మోడీ తమతో బాటు డిల్లీలోని ఎయిమ్స్, రామ్ మనోహర్ లోహియా మరియు సఫ్దర్ జంగ్ ఆసుపత్రులకు చెందిన మొత్తం 26 మంది ప్రముఖ వైద్యుల బృందాన్ని, ప్లాస్టిక్ సర్జన్స్, అనెస్తీషియన్స్, పారా మెడికల్ సిబ్బంది, మరియు నర్సులను కూడా తన వెంట తీసుకురావడం విశేషం. వారు స్థానిక వైద్య బృందాలతో కలిసి భాదితులకు అవసరమయిన వైద్య సేవలు అందిస్తారు. ప్రధాని నరేంద్ర మోడి, కేరళ ముఖ్యమంత్రి ఊమన్ చాందీతో సమావేశమయ్యి అగ్నిప్రమాదం గురించి, ప్రభుత్వం చేపట్టిన చర్యల గురించి అడిగి తెలుసుకొన్నారు.

భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా ఘటన స్థలాన్ని, భాదితులను పరామర్శించారు. వారి తరువాత కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధి, మాజీ కేంద్ర మంత్రి ఎకె.అంటోనీని వెంటబెట్టుకొని ఘటన స్థలాన్ని, భాదితులను పరామర్శించారు.

అగ్నిప్రమాదం జరిగిన వెంటనే ప్రధాని నరేంద్ర మోడి డిల్లీ నుంచి వైద్య నిపుణులను వెంటబెట్టుకొని కేరళ వెళ్ళడం హర్షణీయమే కానీ, త్వరలో కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నందున వాటిని దృష్టిలో పెట్టుకొనే ఆయన ఇంత హడావుడి చేసారని అనుమానించవలసి వస్తోంది. కేరళ ప్రభుత్వం అడగక ముందే ఆయన డిల్లీ నుంచి వైద్య బృందాన్ని వెంటబెట్టుకొని రాష్ట్రంలో వాలిపోవడం, ఆయన వెనుకే భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా వాలిపోవడం గమనిస్తే ప్రధాని ఉద్దేశ్యం ఏమిటో అర్ధం అవుతుంది. అయితే మన దేశంలో రాజకీయ నేతలు ఈవిధంగా వ్యవహరించడం మనకేమి కొత్తకాదు కనుక దీనిని కూడా ఒక ‘ఎన్నికల స్టంట్’ గానే పరిగణించవలసి ఉంటుంది. అందుకే రాహుల్ గాంధి కూడా అక్కడ వాలిపోయి హడావుడి చేసారనుకోవాలి. ఈసారి ఎన్నికలలో వామపక్ష కూటమికి విజయావకాశాలున్నందున వాళ్ళు కూడా అక్కడ వాలిపోతే ఆశ్చర్యమేమీ లేదు. ఎంతటి పెనువిషాద సంఘటనయినా, రాజకీయ లబ్ది కోసం ఏవిధంగా వాడుకోవచ్చునో మన రాజకీయ నేతలు కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గీతా ఆర్ట్స్ పేరుతో మోసం

సినిమా అవ‌కాశాల కోసం ఎదురు చూసే అమాయ‌కుల‌ను టార్గెట్ చేస్తూ, సైబర్ నేర‌గాళ్లు రెచ్చిపోతున్నారు. ఇటీవ‌ల అజ‌య్ భూప‌తి పేరు వాడుకుంటూ.. త‌న‌లా అమ్మాయిల‌తో మాట్లాడుతూ, వాళ్ల‌ని లోబ‌రుచుకోవాల‌ని చూస్తున్న ఓ ముఠాపై...

రొమాంటిక్ రాధేశ్యామ్‌

జాన్‌- రాధేశ్యామ్‌.. ఈ రెండింటిటో ప్ర‌భాస్ టైటిల్ ఏమిట‌న్న ఉత్కంఠ‌త‌కు తెర ప‌డింది. చిత్ర‌బృందం రాధే శ్యామ్‌పైనే మొగ్గు చూపించింది. ఈ సినిమా టైటిల్ తో పాటు ఫ‌స్ట్ లుక్‌ని చిత్ర‌బృందం విడుద‌ల...

స్మగ్లర్‌ స్వప్నా సురేష్.. కేరళను కుదిపేస్తోంది..!

స్వప్నా సురేష్... ఇప్పుడు కేరళలో హాట్ టాపిక్. ఆమె సూపర్ హిట్ సినిమాలో లెటెస్ట్ సెన్సేషన్ హీరోయిన్ కాదు. అంతచందాలతో ఆకట్టుకునే మరో కళాకారిణి కాదు. ప్రజలను రక్షించేందుకు ప్రస్తుత సంక్షోభంలో సర్వం...

నర్సాపురం ఎంపీ ఇక లేఖలు ఆపేస్తారా..?

రఘురామకృష్ణరాజును ఎలా కంట్రోల్ చేయాలో తెలియక వైసీపీ అన్ని రకాల ప్రయత్నాలు చేసింది. కానీ ఆయన... వైసీపీ ఒక అడుగు వేస్తే.. ఆయన రెండు అడుగులు వేస్తూ.. మరింత దూకుడు చూపిస్తూ వస్తున్నారు....

HOT NEWS

[X] Close
[X] Close