ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి ఏపీ పర్యటనకు వస్తున్నారు. ఈ సారి ఆయన రాయలసీమకుస్తున్నారు. జీఎస్టీ తగ్గింపు ప్రచార కార్యక్రమాల్లో భాగంగా కర్నూలులో రోడ్ షో ఏర్పాటు చేశారు. అలాగే నంద్యాలలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఉన్నాయి.
మోదీ పర్యటన వివరాలను శాసనమండలి లాబీలో సహచర మంత్రులు, ఎమ్మెల్సీలకు నారా లోకేష్ వివరించారు. జీఎస్టీ సంస్కరణల పై కర్నూల్ లో భారీ ర్యాలీ ఉంటుందని తెలిపారు. ఈ ర్యాలీకి మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ హాజరవుతారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు మోదీ శంకుస్థాపన లు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఆ రోజున కర్నూల్, నంద్యాల జిల్లాల్లో పర్యటించనున్న మోదీ… శ్రీశైలం లో మల్లన్న దర్శనం చేసుకుంటారని తెలిపారు.
మోదీ పర్యటన ఏర్పాట్ల బాధ్యతను, టూర్ ను విజయవంతం చేసే బాధ్యతలను నారా లోకేష్ తీసుకున్నారు. కర్నూలులో రోడ్ షోను.. శ్రీశైలం పర్యటనను పక్కాగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయనున్నారు, కూటమి మంచి పరిపాలన అందిస్తోందని.. ఇటీవల సూపర్ హిట్ సూపర్ సిక్స్ సభనునిర్వహించారు. ఇప్పుడు మోదీ కూడా అలాంటి సంబరాల్లో పాల్గొననుండటం.. కూటమి నేతల్ని మరింత ఉత్సాహపరుస్తోంది.