ఆపరేషన్ సిందూర్ దెబ్బకు పాకిస్తాన్ మూడు రోజుల్లోనే కాళ్ల బేరానికి వచ్చిందని ప్రధాని మోదీ తెలిపారు. ఆపరేషన్ సిందూర్ ప్రారంభమైన తర్వాత తొలి సారి ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఇప్పటి వరకూ జరిగిన పరిణామాలను వివరించారు. ఉగ్రవాదులపైనే మన సైన్యం దాడి చేసిందని..కానీ పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని మద్దతుగా ఉంటూ మనపై ఎదురుదాడి చేసిందన్నారు. పాకిస్తాన్ కు నేరుగా బుద్ది చెప్పామని మూడు రోజుల్లోనే కాళ్ల బేరానికి వచ్చిందని తెలిపారు.
ఉగ్రవాతం, చర్చలు ఒకే సారి ఉండే అవకాశం లేదని స్పష్టం చేశారు. పాకిస్తాన్ తో చర్చలు అంటూ జరిగిదే అతి ఉగ్రవాదం, పాక్ ఆక్రమిత కశ్మీర్ అంశంపైనే అని స్పష్టం చేశారు. కిస్తాన్ మిస్సైల్స్ అన్నీ మన రక్షణ వ్యవస్థల ముందు తేలిపోయాయని మనం మాత్రం పాకిస్తాన్ గుండెల్లో బాంబులు పేల్చామని మోదీ తెలిపారు. భారత్ దాడి తర్వాత బతికి ఉంటే చాలని పాకిస్తాన్ అనుకుంటోందని ..లలో కూడా ఉలిక్కిపడేలా పాకిస్తాన్ను దెబ్బతీశామని ప్రధాని స్పష్టం చేశారు.
పాకిస్తాన్ తదుపరి చర్యలపై ఓ కన్నేసి ఉంంచామన్నారు. అణుదాడి చేస్తామని బెదిరిస్తే సహించేది లేదన్నారు. పాక్ తోక జాడిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. భారత్ దాడులకు తాళలేక ప్ర మే పదో తేదీన పాకిస్తాన్ డీజీఎంవో భారత్ ను సంప్రదించిందని మోదీ తెలిపారు. అప్పటికే పాకిస్తాన్ లో ని ఉగ్రమూకల్ని తుదముట్టించామని తెలిపారు. ఆపరేషన్ సిందూర్ ను నిలిపివేశామని.. పాకిస్తాన్ తదుపరి చర్యలను బట్టి.. రియాక్షన్ ఉంటుందని మోదీ తెలిపారు. భారత్ పై ఉగ్రవాదంతో మళ్లీ దాడి చేస్తే ముఖం పగిలే రీతిలో సమాధానం చెబుతామని స్పష్టం చేశారు. అణ్వాయుధాలను అడ్డం పెట్టుకుని ఉగ్రవాదానికి పాల్పడతామని అంటే చూస్తూ ఊరుకునేది లేదన్నారు.
అమెరికా మధ్యవర్తిత్వంతో సహా ఇతర అంశాలపై ప్రధాని మోదీ ఎలాంటి ప్రస్తావన చేయలేదు. అయితే కశ్మీర్ పై ఎవరి మధ్యవర్తిత్వం ఉండదని.. పీవోకే విషయంలో మాత్రమే చర్చలు జరుపుతామని స్పష్టమైన సంకేతాలను మోదీ ఇచ్చారు.