ఆరో తేదీన గుంటూరుకు మోడీ..! ఏం చెప్పుకుంటారు..?

నాలుగున్నరేళ్ల కాలంలో.. ఏ ఒక్క అభివృద్ధి పని ప్రారంభోత్సవానికి అమరావతికి వచ్చే ప్రయత్నం చేయని.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ… ఇప్పుడు రాజకీయ పర్యటనలకు శ్రీకారం చుడుతున్నారు. అమరావతి శంకుస్థాపనకు వచ్చి.. చెంబుడు నీళ్లు, గుప్పెడు మట్టి ఇచ్చి వెళ్లారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో.. ఓట్ల వేట కోసం మరోసారి ఏపీకి రావాలని నిర్ణయించుకున్నారు. వచ్చే నెల ఆరో తేదీన మోడీతో గుంటూరులో భారీ బహిరంగసభ ఏర్పాటు చేస్తున్నామని… ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ ప్రకటించారు. నాలుగున్నరేళ్లలో ఏపీకే కేంద్రం చేసిన సాయాన్ని… అభివృద్ధికి అండగా ఉన్న వైనాన్ని చెబుతామని కన్నా అంటున్నారు.

మోడీ ఏం చెప్పుకుంటారన్నదే… ఇప్పుడు ఆసక్తికరగా మారింది. ప్రత్యేకహోదా ఇచ్చారా..? రైల్వే జోన్ ఇచ్చారా..? స్టీల్ ప్లాంట్ ఇచ్చారా..? పోర్ట్ ఇచ్చారా..? మోడీ భాషలో ఢిల్లీని మించిన రాజధానికి .. కనీసం నిధులిచ్చారా..? … ప్రజల్లో పాతుకుపోయిన ప్రశ్నలు ఇవి. వీటి సంగతి చెప్పకుండా.. పన్నుల్లో వాటాల ప్రకారం.. రాజ్యాంగబద్ధంగా ఏపీకి రావాల్సిన నిధులు.. ఉపాధిహామీ పనుల నిధులు చెప్పి… తాము ఏపీ పట్ల ఉదారంగా ఉన్నామని చెప్పుకుంటే… ప్రజలు అంత అమాయకులు కాదుగా..!. ప్రతి రాష్ట్రంలోనూ.. న్యాయబద్ధంగా ఉండాల్సిన విద్యాసంస్థలు, ఎయిమ్స్ వంటి వాటిని పేపర్ల మీద పెట్టి… పదేళ్లు, ఇరవై ఏళ్లు అయినా పూర్తి కాని విధంగా అరకొరగా నిధులు కేటాయిస్తూ…అదే తమ ఘనత అని చెప్పుకుంటారా..?. హామీలన్నింటికీ.. చట్టంలో పరిశీలించమని ఉందని.. తాము పరిశీలించేమని.. ప్రకటించుకుంటారా..?

2014 ఎన్నికల ప్రచారంలో మోడీ చెప్పిన దానికి నాలుగున్నరేళ్లలో ఏపీకి చేసిన దానికి పొంతనే లేదు. ఏపీని అత్యంత దారుణంగా అవమానించారు కూడా. చరిత్రలో ఇంత వరకూ ఓ రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులను ఆ రాష్ట్ర ఖాతాలో వేసి వెనక్కి తీసుకున్న సందర్భం లేదు. ఆ కక్ష సాధింపును మొదటి సారి ఏపీపై చూపింది కేంద్రం. యూసీల పేరుతో.. పార్టీ నేతల్ని పంపి హడావుడి చేశారు. చివరికి యూసీలన్నీ సమర్పించారని.. నిధులు మంజూరు చేయాలని.. సంబంధిత.. నీతిఆయోగ్ స్పష్టమైన సూచన చేసినపప్పటికీ మోడీ నిధులివ్వలేదు. ఇంత దారుణంగా అవమానిస్తూ కూడా.. మోడీ ఏపీలో ఎన్నికల ప్రచారానికి ధైర్యంగా వస్తున్నారు. అదే ఏపీ ప్రజలు పాటించే విలువలేమో..? దీన్నే బీజేపీ నేతలు చేత కాని తనంగా భావిస్తున్నారేమో..? తమిళనాడులో అయితే.. మోడీ వస్తున్నారు.. అని తెలియగానే.. అందరూ స్టిఫ్ అలర్ట్ అయిపోతారు..! ఆ దెబ్బకు ఆ టూర్ క్యాన్సిల్ అయిపోయేది..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

విశ్వ‌క్ సేన్‌తో బేరం కుదిరింది

త‌మిళ‌ 'ఓ మై క‌ద‌వులే' రీమేకు హ‌క్కులు పీవీపీ ద‌గ్గ‌రున్నాయి. ఈ సినిమాని విశ్వ‌క్‌సేన్‌తో రీమేక్ చేయాల‌న్న‌ది ప్లాన్‌. ఆ విష‌యం ముందే మీడియాకు లీకైంది. య‌ధావిధిగా వార్త‌లొచ్చాయి. అయితే విశ్వ‌క్ మాత్రం...

సచివాలయ కూల్చివేత ఇక ముందుకు సాగుతుందా..!?

తెలంగాణ సచివాలయం కూల్చివేత శరవేగంగా చేపట్టినా.. న్యాయపరమైన చిక్కులు వచ్చి పడ్డాయి. హైకోర్టు సోమవారం వరకూ.. కూల్చివేతలు ఆపాలని ఆదేశించింది. ఆ రోజున విచారణ జరిపి అనుమతి ఇస్తుందా... మరికొంత కాలం పొడిగింపు...

ఏపీ ఆర్టీసీని ఆ అధికారి ముంచేశాడా..!?

ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్‌ను ప్రభుత్వం ఆకస్మాత్‌గా బదలీ చేసేసింది. ఆయనను లూప్ లైన్ పోస్టులోకి.. పంపేసింది. ఆర్టీసీ ఎండీగా ఆయనను నియమించి ఆరు నెలలు మాత్రమే అయింది. ఈ లోపే.. హడావుడిగా.....

ఏపీలో జంబో “అడ్వైజర్స్ కేబినెట్”..! కానీ ఒక్కరే ఆల్ ఇన్ వన్..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయకల్లాం నుంచి అన్ని శాఖలను ముఖ్యమమంత్రి జగన్ తీసేయడంతో... సలహాదారులపై చర్చ ప్రారంభమయింది. అసలు ఎంత మంది సలహాదారులు ఉన్నారు..? వారి జీతభత్యాలేంటి..? వారి ఎవరికి.. ఏ...

HOT NEWS

[X] Close
[X] Close