టాలీవుడ్ కి కొత్త ఫ్రాంచైజీ

టాలీవుడ్‌లో ఫ్రాంచైజీ సినిమాల హవా త‌క్కువే. ఒకే టైటిల్ తో క‌థ‌ని మార్చి వ‌రుస‌గా సినిమాలు తీయ‌డం అరుదు. హిట్‌, హిట్ 2… ఆ లోటు కాస్త తీర్చాయి. హిట్ 3, 4, 5 కూడా వ‌స్తాయ‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు ఎప్పుడో చెప్పేశారు. ఇప్పుడు `మా ఊరి పొలిమేర‌` కూడా ఓ ఫ్రాంచైజీగా మారిపోయింది. స‌త్యం రాజేష్ న‌టించిన‌ `మా ఊరి పొలిమేర‌` లాక్ డౌన్ స‌మ‌యంలో ఓటీటీలో విడుద‌లైంది. అప్ప‌ట్లో ఈ సినిమాకి మంచి ఆద‌ర‌ణ ద‌క్కింది. థియేట‌ర్ల‌లో విడుద‌ల చేసి ఉంటే బాగుండేద‌న్న కామెంట్లు వినిపించాయి. ఇటీవ‌ల `మా ఊరి పొలిమేర 2` వ‌చ్చింది. ఈ సినిమా అనూహ్య‌మైన విజ‌యాన్ని ద‌క్కించుకొని, నిర్మాత‌ల‌కు లాభాలు మిగిల్చింది. గీతా ఆర్ట్స్ ఈ సినిమాని పంపిణీ చేయ‌డం బాగా క‌లిసొచ్చింది.

ఇప్పుడు ‘మా ఊరి పొలిమేర 3’ కూడా రాబోతోంది. ద‌ర్శ‌కుడి ద‌గ్గ‌ర `మా ఊరి పొలిమేర 5` క‌థ కూడా రెడీగానే ఉంద‌ట‌. నిజానికి `మా ఊరి పొలిమేర 2` త‌ర‌వాత మ‌రో క‌థ‌ని చేద్దామ‌ని ఫిక్స‌య్యాడు ద‌ర్శ‌కుడు అనిల్ విశ్వ‌నాథ్. అయితే ఈ సినిమాకి వ‌చ్చిన స్పంద‌న చూసి వెంట‌నే పార్ట్ 3 కి ఏర్పాట్లు చేసుకొంటున్నాడు. గీతా ఆర్ట్స్ ఈ సారి సినిమాలో నేరుగా పెట్టుబ‌డి పెట్ట‌డానికి ముందుకొచ్చింద‌ని స‌మాచారం. గీతా ఆర్ట్స్ లాంటి సంస్థ అండ‌దండ‌లు ఉంటే… అంత‌కంటే కావ‌ల్సింది ఏముంది..? పెద్ద హీరోలు, బ‌డా నిర్మాణ సంస్థ‌లు చేప‌ట్టే సినిమాల‌కు ఫ్రాంచైజీలు రావ‌డం కంటే, చిన్న సినిమాల‌కు పార్ట్ 2, పార్ట్ 3 రావ‌డం చిత్ర‌సీమ‌లో మ‌రింత మంచి శ‌కునం. చిన్న నిర్మాత‌ల‌కు ఇలాంటి ఫ‌లితాలు కొండంత ఉత్సాహాన్ని ఇస్తాయ‌న‌డంలో సందేహం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కాల్పులు – నరికి వేతలు ! గోదావరి జిల్లాల్లో రక్త చరిత్ర !

ఓ వ్యక్తిని ఇంట్లోనే రెండు రౌండ్లతో కాల్చి చంపేశారు. అదీ కూడా గోదావరి జిల్లాల్లో. ప్రశాంతమైన గోదావరి జిల్లాల్లో ఇలాంటి హత్యలు కూడా జరుగుతున్నాయా అని జనం ఆశ్చర్యపోయారు. చనిపోయిన...

‘హ‌ను – మాన్‌’ బ‌లం స‌రిపోతుందా?

'హను - మాన్‌' ప్రాజెక్ట్ మొద‌లెట్టిన‌ప్పుడు ఎవ‌రికీ ఆ సినిమాపై ఆశ‌లు, అంచ‌నాలూ లేవు. ఎప్పుడైతే టీజ‌ర్ వ‌చ్చిందో.. అప్పుడు అటెన్ష‌న్ సంపాదించుకొంది. ప్ర‌శాంత్ వ‌ర్మ ఏదో చేస్తున్నాడు, ఓ విజువ‌ల్ వండ‌ర్...

సుప్రీంకోర్టు తీర్పులపైనా నీలి, కూలి మీడియా తప్పుడు ప్రచారం !

తెలుగులో నీలి, కూలి మీడియా వ్యవహారం రాను రాను సంచలనంగా మారుతోంది. ఎంతగా అంటే చివరికి సుప్రీంకోర్టు తీర్పులనూ పూర్తిగా రివర్స్ లో ప్రచారం చేసేంత. సుప్రీంకోర్టు...

ఎల్జీ పాలిమర్స్ బాధితులకు కంపెనీ ఇచ్చిన సొమ్ము జగన్ రెడ్డి సర్కార్ నొక్కేసిందా !?

జగన్ రెడ్డి సీఎం సీట్లో కూర్చోగానే... ఏపీలో జరిగిన అతి పెద్ద అరిష్టం విశాఖ ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం. ఆ ఘటనపై చాలా అనుమానాలున్నా... విచారణలో ఏదీ బయటకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close