రాహుల్ రాజీనామా ఆ సీనియర్లను ఇంటికి పంపేందుకే..!

గ్రాండ్ ఓల్డ్ పార్టీకి యువనాయకుడు..ఉత్తేజాన్ని ఇవ్వలేకపోయారు. చివరికి చిరాకేసి.. ఆయనే వైదొలగాల్సి వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమిటి..?. ఉనికికే ముప్పు ఏర్పడిన దశలో.. రాహుల్ గాంధీ.. చేతులెత్తేయడం పార్టీని మరింత దిగజార్చడం ఖాయంగా కనిపిస్తోంది. తాను కొత్త ఆలోచనలతో పార్టీని ముందుకు తీసుకెళ్లాలనుకున్నా.. పాతుకుపోయిన సీనియర్లు.. తన చేతులు, కాళ్లు కట్టేశారన్న భావనతో.. రాహుల్ .. రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లుగా కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

రాజస్థాన్ సీఎంగా సచిన్ పైలట్ ఉంటే బావుంటుదని రాహుల్ అనుకున్నారు. తన అభిష్టానికి వ్యతిరేకంగా అశోక్ గెహ్లాట్‌కు పగ్గాలు అప్పగించాల్సి వచ్చింది. మధ్యప్రదేశ్లో దిగ్విజయ్ గందరగోళం సృష్టించడం ఒక వంతయితే.. సీఎం పదవిని కమల్‌నాథ్‌కు అప్పగించాల్సి రావడం మరో వంతు. సింథియాకు ఇవ్వాలనుకున్న పదవి కమల్‌నాథ్ చేతిలో పెట్టడం రాహుల్‌కు సుతారమూ ఇష్టం లేదని పార్టీలో కొందరి వాదన. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని గెలిపించలేకపోయిన మాజీ సీఎం సిద్దరామయ్యకు సమన్వయ కమిటీ బాధ్యతలు అప్పగించడం కూడా రాహుల్‌ కు ఇష్టం లేదు. ఆయన సంకీర్ణానికి సమస్యలు తెస్తున్నారు. ఈ సీనియర్లంతా లోక్ సభ ఎన్నికల్లో చాలా పరిమితమైన పాత్ర పోషించారు. కనీస మాత్ర ఎంపీలను గెలిపించలేకపోయారు.

నచ్చిన వారిని ప్రోత్సహించేందుకు రాహుల్ చేసిన ప్రయత్నాలు కూడా ఫలించడం లేదు. పంజాబ్ వ్యవహారంలో రాహుల్ అనుకున్నదొక్కటీ. జరిగిందొక్కటీ. పంజాబ్ మంత్రి సిద్ధూను ఆయన ప్రొత్సహించాలనుకున్నారు. అయితే వయసు పైబడినందున చివరి చాన్స్ అంటూ.. మళ్లీ సీఎం అయిన అమరీందర్ సింగ్ మాత్రం రాహుల్ మనోగతాన్ని అర్థం చేసుకోకుండా సిద్ధూను కిందకు నెట్టేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. సిద్ధూ వద్ద ఉన్న కొన్ని మంత్రిత్వ శాఖలను కూడా లాగేసుకున్నారు. రాహుల్‌ గట్టిగా ఎవరిని, ఏమీ అనలేని పరిస్థితికి చేరుకున్నారు.

శక్తిమంతులైన వ్యక్తులు అధికారాన్ని అంటిపెట్టుకుంటున్నారన్న రాహుల్ వ్యాఖ్యలు సీనియర్ గ్రూప్‌పై ఆయన అసంతృప్తికి నిదర్శనంగా నిలిచింది. అధికారకాంక్షను వదులుకోలేకపోతే ప్రత్యర్థులను ఓడించడం కుదరదని ఆయన నేరుగానే చెప్పేశారు. సైద్ధాంతిక పోరుగా పార్టీ సమూల మార్పులను ఆశిస్తోందని ఆయన చెప్పడం కొందరికీ ఉద్వాసన తప్పదన్న సంకేతాలివ్వడమేనని అంటున్నారు. యువనాయకత్వాలకు పగ్గాలిచ్చేందుకు.. తనకు పూర్తి స్వేచ్చని.. పార్టీ మొత్తాన్ని ప్రక్షాళన చేయడానికి అంగీకరిస్తే.. రాహుల్ మళ్లీ మనసు మార్చుకోవచ్చంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రివ్యూ: ‘నిఫా వైర‌స్‌’

ప్ర‌పంచం మొత్తం.. క‌రోనా భ‌యంతో వ‌ణికిపోతోంది. ఇప్పుడైతే ఈ ప్ర‌కంప‌న‌లు కాస్త త‌గ్గాయి గానీ, క‌రోనా వ్యాపించిన కొత్త‌లో... ఈ వైర‌స్ గురించి తెలుసుకుని అల్లాడిపోయారంతా. అస‌లు మ‌నిషి మ‌నుగ‌డ‌ని, శాస్త్ర సాంకేతిక...

సర్వేలు.. ఎగ్జిట్ పోల్స్ అన్నీ బోగస్సే..!

గ్రేటర్ ఎన్నికల విషయంలో ఎగ్జిట్ పోల్స్ మొత్తం బోల్తా కొట్టాయి. ఒక్కటంటే.. ఒక్క సంస్థ కూడా సరిగ్గా ఫలితాలను అంచనా వేయలేకపోయింది. భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న వేవ్ ను...

కాంగ్రెస్ పనైపోయింది..! ఉత్తమ్ పదవి వదిలేశారు..!

పీసీసీ చీఫ్ పోస్టుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. తాను ఎప్పుడో రాజీనామా చేశానని.. దాన్ని ఆమోదించి.. కొత్తగా పీసీసీ చీఫ్ ను నియమించాలని ఆయన కొత్తగా ఏఐసిసికి లేఖ రాశారు....

గ్రేటర్ టర్న్ : టీఆర్ఎస్‌పై బీజేపీ సర్జికల్ స్ట్రైక్..!

గ్రేటర్‌ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అనూహ్యమైన ఫలితాలు సాధించింది. హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ కాస్త ముందు ఉన్నట్లుగా కనిపిస్తోంది కానీ.. భారతీయ జనతా పార్టీ.. టీఆర్ఎస్‌పై సర్జికల్‌ స్ట్రైక్...

HOT NEWS

[X] Close
[X] Close