చపాతి ఎలా చేయాలో క్లాస్‌లో చెప్పడం వేరు.. కానీ నేరుగా చేసి చూపించడం వేరు. అద్భుతంగా చెప్పేవారు.. చేసేటప్పుడు అసలు చేయలేకపోవచ్చు. ఎందుకంటే థీయరీ వేరు.. ప్రాక్టికల్స్ వేరు. రాజకీయాల్లో అయితే అది ఇంకా ఎక్కువ. ఇది మరోసారి ప్రశాంత్ కిషోర్ రూపంలో నిరూపితమయింది. రాజకీయ సలహాలు ఇచ్చే ఆయన చేసిన రాజకీయాలు ఘోరంగా ఫెయిలయ్యాయి. బీహార్ లో ఆయనకు ఓట్లు కూడా రాలేదు.
ప్రశాంత్ కిషోర్ దేశంలోనే నెంబర్ వన్ స్ట్రాటజిస్ట్. రెండు గంటల సలహాలకు కోట్లకు కోట్లు వస్తాయని ఆయన చెప్పుకుంటారు. ఎన్నో పార్టీల్ని గెలిపించానని ఆయన చెప్పుకుంటారు. కానీ సొంత పార్టీ పెట్టుకుని డిపాజిట్లు కూడా రాకుండా గల్లంతయ్యారు. బీహార్ లో మజ్లిస్ పార్టీ కూడా ఓ ఎమ్మెల్యే సీటు గెలిచింది కానీ.. పీకే జనసురాజ్ పార్టీ మాత్రం గెలవలేకపోయింది. గెలుపు సంగతి తర్వాత అసలు ఎక్కడా డిపాజిట్లు తెచ్చుకునే పరిస్థితి లేకుండా పోయింది.
అసెంబ్లీ ఎన్నికలలో ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జన సురాజ్ పార్టీ 243 సీట్లలో 238 సీట్లకు పోటీ చేసింది. ఓటు షేర్ కనీసం 5% కంటే తక్కువే వచ్చింది. కొన్ని ఎగ్జిట్ పోల్స్ పది శాతం వరకూ వస్తాయని అంచనా వేశాయి. కాని ఫలితాలు వచ్చిన తర్వాత ఇది 3-5% మధ్య పరిమితమైంది. ఎన్నికల కమిషన్ ట్రెండ్స్ ప్రకారం అత్యధిక స్థానాల్లో నోటా కంటే వెనుకబడిపోయారు. ప్రజలు మాపై విశ్వాసం చూపలేదని జనసురాజ్ పార్టీ అధికార ప్రతినిధి చెప్పారు. పార్టీ క్యాడర్ బలం లేకపోవడం, మేజర్ పార్టీల మధ్య బైపోలార్ పోటీ, టికెట్ డిస్ట్రిబ్యూషన్ తర్వాత మొమెంటం తగ్గడం, కిషోర్ ఒక్కరే ఫేస్‌గా ఉండటం వల్ల క్యాండిడేట్లు ప్రభావం చూపలేదని చెప్పుకుంటున్నారు.

