ఆర్ఆర్ఆర్‌కి బీజేపీ సపోర్ట్..! రాజకీయమా..? నిజమా..?

రఘురామకృష్ణరాజు అరెస్ట్ వ్యవహారాన్ని బీజేపీ తీవ్రంగా ఖండించింది. తెలుగు రాష్ట్రాల బీజేపీ నేతలు.. ఈ ఖండనల ప్రకటనలు చేశారు. ఆంధ్రప్రదేశ్ నేతలు విష్ణువర్ధన్ రెడ్డి లాంటి వాళ్ల కన్నా… తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఇంకా ఘాటుగా స్పందించారు. రఘురామకృష్ణరాజును నిబంధనలు పాటించకుండా అరెస్ట్ చేయడం.. పార్లమెంట్‌పై దాడిగా చెబుతున్నారు. అదే సమయంలో.. ఇతర రాష్ట్రాల్లోని బీజేపీ నేతలు.. రఘురామకృష్ణరాజుకు మద్దతుగా అధికారిక ట్విట్టర్ హ్యాండిల్స్‌లోనే ప్రకటనలు చేస్తున్నారు. పోలీసులు ఎంపీని కొట్టిన ఫోటోలను ప్రదర్శించి ఇదేమి క్రూరత్వమని ఖండిస్తున్నారు. అంటే.. నర్సాపురం ఎంపీకి బీజేపీ నుంచి మద్దతు బాగానే లభిస్తోంది.

కానీ అది రాజకీయమా..? నిజమా..? అన్నది ఇప్పుడు సందేహంగా మారింది. ఎందుకంటే.. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ.. కొన్ని అంశాలపై రాజకీయంగా ఓ అభిప్రాయం.. అధికారికంగా మరో అభిప్రాయంతో కొనసాగుతోంది. ముఖ్యంగా ఏపీ విషయంలో జరుగుతోంది అదే. అమరావతి దగ్గర్నుంచి ప్రతీ అంశంలోనూ.. వైసీపీ చేసే పనులకు మద్దతు ఇస్తోంది. కానీ ఏపీకి వచ్చే సరికి మాత్రం…. ప్రకటనలు మాత్రం… ప్రజాభిప్రాయం తగ్గట్లే ఉండాలన్నట్లుగా మాట్లాడుతున్నారు. నిర్ణయాలు అలా ఉండటం లేదు. దానికి తగ్గట్లుగానే కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి….స్పందించారు. రఘురామకృష్ణరాజు అరెస్ట్‌పై తనకు సమాచారం లేదని.. తెలుసుకున్న తర్వాత స్పందిస్తానని ఆయన చెప్పి అందర్నీ ఆశ్చర్య పరిచారు.

రఘురామకృష్ణరాజును పోలీసులు గాయపర్చడం ఇప్పుడు.. దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ధర్డ్ డిగ్రీ ప్రయోగాన్ని .. సాధారణ ఖైదీలపై చేయడాన్నే.. గతంలో కోర్టులు తప్పు పట్టాయి. అలా చేసినట్లుగా తేలితే పోలీసులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ వస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా ఓ ఎంపీనే అలా అరెస్ట్ చేసి కొట్టడం… చిన్న విషయం అయ్యే అవకాశం లేదు. పైగా ఆ కేసులు కూడా.. చెల్లుబాటయ్యే కేసులు కాదని… ఆ విషయం తెలిసే ముందే శిక్షించారని.. అది కేవలం రాజకీయ పగ అని మాత్రమే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సందర్భంగా బీజేపీ మరింత నిర్మాణాత్మక పాత్ర పోషించాల్సి ఉంది.

రఘురామకృష్ణరాజు వైసీపీకి రెబల్‌గా మారిన తర్వాత ఆయన బీజేపీతో సన్నిహితంగా ఉంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా… రఘురామరాజును పేరు పెట్టి పిలుస్తారు. హిందూత్వానికి ఆయన బాగా దగ్గర. మత మార్పిళ్లపై పోరాడుతున్నారు . ఈ క్రమంలో రఘురామకృష్ణరాజు వైపు బీజేపీ నిజంగానే ఉందా.. లేక… లోపాయికారీగా.. వైసీపీ పనులకు ఎప్పట్లాగే మద్దతు తెలుపుతుందా.. అనేది ముందు ముందు జరగబోయే పరిణామాల వల్ల ఓ అంచనాకు రావొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

త‌మ‌న్ సంగీత సార‌థ్యంలో యూఎస్‌లో బిగ్గెస్ట్ మ్యూజిక‌ల్ షోను ఏర్పాటు చేసిన హంసిని ఎంట‌ర్‌టైన్‌మెంట్‌

త‌మ‌న్ సంగీత సార‌థ్యంలో యూఎస్‌లో  'అలా అమెరికాపురములో..` పేరుతో బిగ్గెస్ట్ మ్యూజిక‌ల్ షోను ఏర్పాటు చేసిన  హంసిని ఎంట‌ర్‌టైన్‌మెంట్‌. సెన్సేష‌న‌ల్ కాన్స‌ర్ట్స్ ఏర్పాటుచేయ‌డంలో అగ్రగామిగా ఉన్న హంసిని ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ ఈ సంవత్సరం టాలీవుడ్ మ్యూజిక్...

శ్రీ‌నువైట్ల మ‌ల్టీస్టార‌ర్… ‘డ‌బుల్స్‌’

వ‌రుస హిట్లు ఇచ్చిన శ్రీ‌నువైట్ల‌.. ఇప్పుడు వ‌రుస ఫ్లాపుల‌ను మోస్తున్నాడు. అయినా స‌రే, మళ్లీ త‌న‌దైన ముద్ర వేయ‌డానికి త‌ప‌న ప‌డుతున్నాడు. అందులో భాగంగా `ఢీ అండ్ ఢీ` తీస్తున్నాడు. `డ‌బుల్ డోస్‌`...

జనసేనను మరోసారి కించ పర్చిన ఏపీ బీజేపీ..!

పవన్ కల్యాణ్‌కు కేంద్రంలో మంత్రి పదవి అని ఢిల్లీ నుంచి బీజేపీ లీకులు ఇస్తూ గిలిగింతలు పెడుతోంది కానీ.. అసలు విషయం మాత్రం అసలు జనసేనను లెక్కలోకి తీసుకోవడం లేదు. ముఖ్యంగా ఏపీ...

ఏపీ సర్కార్‌ను అప్పులు చేయనివ్వొద్దని మోడీకి రఘురామ లేఖ..!

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అప్పుల మీద నడుస్తోంది. నెలకు రూ. ఆరేడు వేల కోట్లు అప్పులు ఎలాగోలా తెచ్చుకోకపోతే.. ఆ నెల దివాలా ప్రకటించాల్సిన పరిస్థితి. ఆ అప్పులు కూడా రాకుండా చేయాలని...

HOT NEWS

[X] Close
[X] Close