ఎన్టీఆర్‌ వైఎస్‌ఆర్‌ కెసిఆర్‌ అంతా కమ్యూనిస్టులే!

గత ఆదివారం మార్చి 19వ తేదీన హైదరాబాదు సరూర్‌ నగర్‌ ఔట్‌డోర్‌ స్టేడియంలో సిపిఎం ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన సభ జరిగింది. తమ్మినేని వీరభద్రం బృందం మహాజనపాదయాత్ర ముగింపు సందర్భంగా జరిగిన ఈ పాదయాత్రకు కేవలం ఆ పార్టీ వారే గాక ఇతర రాజకీయ పక్షాల వారూ సామాజిక సంస్థలూ మేధావులు కళాకారులూ హాజరైనారు. చాలా కాలానికి కమ్యూనిస్టులు ఒక గొప్ప సభ జరిపారన్న పేరు రావడమే గాక హైదరాబాదులో ప్రధాన పత్రికలన్నీదాన్నేబ్యానర్‌గా తీసుకున్నాయి. లాల్‌ నీల్‌ పేరిట సామాజిక న్యాయం కోసం పోరాటాన్ని మేళవించడం ఈ యాత్రలోనూ సభలోనూ ప్రత్యేకత అయింది. అయితే ఆ మరుసటిరోజునే వరంగల్‌లో సిపిఎం బహిష్క్రతులు కొందరిని టిఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు. ఆ జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి కెటిఆర్‌ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆ సభలో కెటిఆర్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్‌ను మించిన కమ్యూనిస్టు ఎవరని ప్రశ్నించారు. దానికి ముందు రోజే శాసనసభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ కమ్యూనిజం చాలా గొప్ప సిద్ధాంతమని దాన్ని మించిన ప్రత్నామ్నాయ భావన ఏదీ రాలేదని ప్రశంసించారు.ఆ సిద్ధాంతం పనికి మాలిందని కాలం చెల్లిందని అంతకు ముందు తాను చేసిన వ్యాఖ్యలకు అది సర్దుబాటు. అయితే ఆ సిద్ధాంతాన్ని అమలు చేయడంలో దేశంలోని కమ్యూనిస్టులు జడత్వం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. అలా అయితే మీరే దాన్ని స్వీకరించి సమర్థంగా అమలు చేయొచ్చు కదా అని నేను సరదాగా రాశాను. ఎన్టీఆర్‌ అసలైన లెఫ్టిస్టునని చెప్పుకునేవారు.వైఎస్‌ రాజశేఖర రెడ్డి పెద్ద కమ్యూనిస్టు అని రఘువీరారెడ్డి అప్పట్లో చెప్పారు.అంజయ్య ఆరణాల కూలినంటూ ఆ కోవలోనే మాట్లాడేవారు. చారువాల్‌ ప్రధానినంటూ నరేంద్ర మోడీ కూడా కష్టజీవిలాగే మాట్లాడుతున్నారు.

ఇదంతా చూస్తుంటే ఒక విచిత్రం కనిపిస్తుంది. ఈ నేతలంతా కమ్యూనిస్టులను తిట్టిపోస్తారు. గేళి చేస్తారు. మళ్లీ తామే కమ్యూనిస్టులమని గొప్పలు చెప్పుకుంటారు. అంటే సీట్లు ఓట్లు రాకున్నా కమ్యూనిస్టు సిద్ధాంతం భావజాలం ఇప్పటికీ ప్రజలను ఆకర్షిస్తుందన్నమాట. కనుకనే ఎవరికి వారు స్వంత పార్టీలు పెట్టుకుని ఏకపక్ష పాలన చేస్తూనే తామే అసలైన కమ్యూనిస్టులమని గొప్పలు చెబుతుంటారు. ఇంతకంటే వింత ఏమీ వుండదు. కమ్యూనిజానికి కాలం చెల్లిపోయిందంటూ కెసిఆర్‌ తమ్మినేని వీరభద్రం పాదయాత్రను అడ్డుకోవాలని పిలుపునిచ్చినా ఎలాటి ఆటంకం రాలేదు. ఇప్పుడేమో సిద్ధాంతం గొప్పదే నాయకులే సరిగ్గా లేరంటున్నారు. కెటిఆర్‌ విషయానికి వస్తే అసలు మా నాన్నే కమ్యూనిస్టుపొమ్మంటున్నాడు. బిజెపి కూడా వాజ్‌పేయి హయాంలో గాంధేయ సోషలిజం నినాదమిచ్చిందని గుర్తుంచుకోవాలి. నిజానికి దానికి గాంధీ సోషలిజం రెండూ సరిపడని విషయాలే.అయితేనేం కమ్యూనిజం సోషలిజంపై ప్రజల ఆసక్తి రీత్యా అలా చెప్పుకుంటూనే వుంటారు.ఇప్పుడు కెసిఆర్‌ కమ్యూనిజమైనా అంతే.

ఇదేగాక కెటిఆర్‌ తమ విధానాలను కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్‌ కొనియాడితే తమ్మినేని వీరభద్రం విమర్శిస్తున్నాడని ఆరోపించారు. రాష్ట్రాల మధ్య ప్రభుత్వాల మద్య స్నేహపూర్వక సంబంధాలు వుండొచ్చు గాని రాజకీయంగా తాము టిఆర్‌ఎస్‌ విధానాలను సమర్థించే ప్రసక్తి లేదని విజయన్‌ తన ఇంటర్వ్యూలో ఖచ్చితంగా చెప్పారు. అయినా మరో రాష్ట్ర ముఖ్యమంత్రి మర్యాదగా కలిస్తే దాన్ని కూడా రాజకీయ ప్రచారానికి వాడుకోవడం ఉచితం కాదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close