రాజకీయం అయిపోయిన “కరోనా వ్యాక్సిన్”..!

ఆగస్టు పదిహేనో తేదీ కల్లా కరోనా వ్యాక్సిన్ వస్తుందని ఐసీఎంఆర్ ప్రకటించడం.. దేశంలో కొత్త దుమారం రేపుతోంది. వైద్య పరిశోధనల్లో ఎంతో ముందు ఉన్న దేశాలు కూడా ఇలాంటి డెడ్‌లైన్ పెట్టలేదన్న సంగతి వివిధ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. ఫలితాలు ఎలా వస్తాయో తెలియకుండా.. పరీక్షలు నిర్వహిస్తూ.. హ్యూమన్ క్లినికల్ ట్రయర్స్ ప్రారంభించి.. వ్యాక్సిన్ రిలీజ్ చేస్తామని ప్రకటించడం.. సరికాదని అటున్నారు. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న భారత్ బయోటెక్‌లో కరోనా వ్యాక్సిన్ ప్రయోగ ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. దీన్ని ధృవీకరించిన ఐసీఎంఆర్.. హడావుడి చేస్తోంది.

ఐసీఎంఆర్ ప్రకటన వెనుక రాజకీయం ఉందని… కరోనాను కూడా రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్న విమర్శలు వైద్య వర్గాల నుంచి ఎక్కువగా వస్తున్నాయి. ఆగస్టు పదిహేనో తేదీన ప్రధాని మోడీ.. తన ప్రసంగంలో గొప్పగా చెప్పుకోవడానికే.. ఈ ప్రయత్నమని.. విపక్ష రాజకీయవర్గాలు అంటున్నాయి. సాధారణంగా వ్యాక్సిన్ సిద్ధం చేయడానికి కనీసం పద్దెనిమిది నెలలు పడుతుంది. అది కూడా.. చేస్తున్న ప్రతి ప్రయోగం సక్సెస్ అయితే.. సైడ్ ఎఫెక్ట్‌లు లేనప్పుడే. ప్రస్తుతం… ఈ ప్రయోగ ఫలితాలు.. ఎలా ఉంటాయో.. ఎవరికీ తెలియదు. హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం కాబోతున్నాయి. ఆ ఫలితాలను విశ్లేషించడానికి చలా సమయం పడుతుంది. సైడ్ ఎఫెక్ట్‌లు అంచనా వేయడానికి ఇంకా ఎక్కువ సమయం పట్టవచ్చని.. వైద్య నిపుణులు అంటున్నారు.

అన్ని వర్గాల నుంచి విమర్శలు రావడంతో.. ఐసీఎంఆర్ కూడా వివరణ ఇచ్చింది. కోవ్యాక్సిన్‌ వ్యాక్సిన్‌పై భారత్‌ బయోటెక్‌ అందజేసిన సమగ్ర సమాచారం ఆశాజనకంగా ఉన్నందునే తదుపరి అనుమతులు ఇచ్చామని చెప్పుకొచ్చింది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునే..వేగంగా ప్రక్రియ పూర్తి చేస్తున్నామని చెబుతోంది. అయితే.. సైన్స్ రాజకీయం అయితే.. మొదటికే మోసం వస్తుందని.. ఫార్మా రంగంలో భారత్‌కు ఉన్న మంచి పేరు.. ఇలాంటి తొందరపాటు నిర్ణయాల వద్ద దెబ్బతింటుందన్న ఆందోళన.. వైద్యవర్గాల్లో ఎక్కువగా వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close