ప్రకాశం జిల్లాను ఏపీలో భాగంగా భావించడం లేదా..!?

ప్రకాశం జిల్లా విషయంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఆ ప్రాంత ప్రజాప్రతినిధులకు సైతం ఆవేదన కలిగిస్తోంది. అత్యధికంగా అధికార పార్టీ ప్రతినిధులే కావడంతో బహిరంగంగా ఎవరూ నోరెత్తలేకపోతున్నారు. కానీ విపక్ష పార్టీ నేతలు మాత్రం సైలెంట్‌గా ఉండలేకపోతున్నారు. ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతుందని తెలిసినా తమ జిల్లా కోసం గొంతెత్తుతున్నారు. ప్రకాశం జిల్లాకు వెలిగొండ ప్రాజెక్ట్ కరువు తీర్చే మంత్రం లాంటిది. ఆ ప్రాజెక్టు దాదాపుగా పూర్తయింది. కొన్ని పనులు మిగిలి ఉన్నాయి. అ ప్రాజెక్టుకు నిధులు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. దానిపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తూ కృష్ణా బోర్డుకు లేఖ రాసింది.

వెలిగొండ ప్రాజెక్టుకు అనుమతులు లేవని.. అనుమతులు లేని ప్రాజెక్టుకు నిధులు ఇవ్వవొద్దని కోరింది. నిజానికి ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా అ ప్రాజెక్టును కేంద్రం నోటిఫై చేయలేదు. కృష్ణాబోర్డు గెజిట్‌లో ఆ ప్రాజెక్టుకు చోటు దక్కలేదు. అయితే తర్వాత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చొరవతో దాన్ని గెజిట్‌లో చేర్చారు. గెజిట్‌లో చేర్చడం.. నిధులు ఇవ్వడంపై తెలంగాణ ఫిర్యాదుల లేఖ రాసింది. కానీ ఏపీ ప్రభుత్వంలో స్పందన లేకపోవడంతో టీడీపీ ఎమ్మెల్యేలు నేరుగా తెలంగాణ సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. తెలంగాణలోని కల్వకుర్తి, నెట్టెంపాడులకు ఎలా అనుమతులు ఇచ్చారో అలాగే వెలిగొండకు కూడా వచ్చాయని విభజన చట్టంలో ఆ విషయం స్పష్టంగా ఉందని గుర్తు చేశారు. కరువు జిల్లా అయిన ప్రకాశంపై వివాదాలు సృష్టించవద్దని కోరారు.

నిజానికి రాయలసీమ ఎత్తిపోతల నిర్మిస్తే అత్యధికంగా నష్టపోయేది తెలంగాణ ఏమో కానీ ఏపలోని ప్రకాశం కూడా మరింత కరువులో చిక్కుకుంటుంది. ఇదే విషయాన్ని ప్రశ్నిస్తూ ప్రకాశం ఎమ్మెల్యేలు సీఎంకు లేఖ రాశారు. అయినా సీఎం జగన్ స్పందించలేదు. ఇప్పుడు ప్రకాశం జిల్లా రైతులకు నీరందించే ప్రాజెక్టు వెలిగొండపైనా వివాద ప్రాజెక్టు ముద్ర వేసే ప్రయత్నం చేస్తూండటంపైనా వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close