వరంగల్ ఉప ఎన్నికలకు పోలింగ్ మొదలు

వరంగల్ లోక్ సభ నియోజక వర్గంలో ఈరోజు ఉదయం ఏడు గంటల నుండి పోలింగ్ మొదలయింది. అన్ని పోలింగ్ స్టేషన్లలో మొట్ట మొదట ఓటు వేసిన ఓటర్లకు ఎన్నికల అధికారులు పుష్ప గుచ్చం ఇచ్చి స్వాగతించడం విశేషం. ఒకే ఒక్క లోక్ సభ స్థానానికి మొత్తం 23 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. కానీ పోటీ ప్రధానంగా మూడు ప్రధాన పార్టీల మధ్యనే ఉండబోతోందని స్పష్టం అయింది. వాటిలో ఏ పార్టీని వరంగల్ ప్రజలు గెలిపిస్తారో మరో నాలుగు రోజుల్లో అంటే నవంబర్ 24వ తేదీన ఫలితాలు వెల్లడయినప్పుడు తెలుస్తుంది. వరంగల్ లోక్ సభ నియోజక వర్గ పరిధిలో మొత్తం 15, 09,671 మంది ఓటర్లు ఉన్నారు. వారి కోసం మొత్తం 1, 778 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. మొత్తం 9, 425 మంది ఎన్నికల సిబ్బంది ఈ పోలింగ్ ప్రక్రియను నిర్వహిస్తున్నారు. సుమారు 10, 000 మంది పోలీసులను మొహరించారు. సాయంత్రం 5గంటలకి పోలింగ్ ముగుస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

యుద్ధం మొద‌ల‌వ్వ‌క‌ముందే.. తెల్ల‌జెండా ఊపేసిన ర‌జ‌నీ!

క‌రోనా ఎంత ప‌ని చేసిందో? క‌రోనా వ‌ల్ల సినిమా షూటింగులు ఆగిపోయాయి. సినిమా విడుద‌ల‌లూ ఆగిపోయాయి. ఆఖ‌రికి... ఓ సూప‌ర్ స్టార్ రాజ‌కీయ రంగ ప్ర‌వేశానికీ బ్రేకులు ప‌డ్డాయి. ఆ స్టార్...

పెళ్లి సంద‌డి ‘క్లాసులు’ షురూ!

రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో రూపొందుతున్న చిత్రం `పెళ్లి సంద‌డి`. ఆనాటి పెళ్లి సంద‌డిలో శ్రీ‌కాంత్ హీరో అయిన‌ట్టే, ఇప్ప‌టి పెళ్లి సంద‌డిలో శ్రీ‌కాంత్ త‌న‌యుడ్ని హీరోగా ఎంచుకున్నారు. శ్రీ‌కాంత్ వార‌సుడు రోష‌న్‌కి ఇప్ప‌టికే...

శ్రీ‌దేవి జ‌పం చేస్తున్న సుధీర్ బాబు

ప‌లాస‌తో ఆక‌ట్టుకున్న ద‌ర్శ‌కుడు క‌రుణ‌కుమార్‌. ఇప్పుడు సుధీర్ బాబుతో ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో ఈ సినిమాకి సంబంధించిన ప్ర‌చారం మొద‌లెట్టేశారు. గోలీసోడాలు చూపించి... `ఇవి మీకు గుర్తున్నాయా..` అంటూ...

దేశంలోనే ఫస్ట్..! ఏపీలో స్కూళ్లు తెరుస్తారంతే..!

కరోనా ఉరుముతోంది. సెకండ్ వేర్.. ధర్డ్ వేవ్ అంచనాలను నిపుణులు వేస్తున్నారు. ఈ సమయంలో దేశంలో ఎక్కడా స్కూళ్లు తెరిచే సాహసాన్ని ప్రభుత్వాలు చేయడం లేదు. కానీ రోజుకు మూడు వేల కేసుల...

HOT NEWS

[X] Close
[X] Close