పొన్నాల ఫోన్‌కూడా ట్యాప్ అయ్యిందంట!

హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల ఫోన్‌లనుకూడా ట్యాప్ చేయించిందని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. ఓటుకు నోటు కేసు బయటపడటానికి చాలా ముందునుంచే తమ ఫోన్‌లు ట్యాప్ అవుతున్నాయని, ముఖ్యమంత్రి కేసీఆరే స్వయంగా ఈ ట్యాపింగ్ చేయిస్తున్నారని పొన్నాల వరంగల్‌లో మీడియా సమావేశంలో చెప్పారు. కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలనుంచి నాయకులను టీఆర్ఎస్‌‍లోకి తీసుకెళ్ళే సమయంలో ఈ ట్యాపింగ్‌లు జరిగాయని అన్నారు. ఫిరాయింపులన్నింటినీ కేసీఆరే చేయించారని ఆరోపించారు. అయితే కాంగ్రెస్ పార్టీలో ఎవరి ఫోన్లు ట్యాప్ అయ్యాయనేది పేర్లు చెప్పటానికి పొన్నాల నిరాకరించారు. దీనిపై ఢిల్లీనుంచి తనకు పక్కా సమాచారం అందిందనిమాత్రం చెప్పారు. ప్రభుత్వంలో కొనసాగే నైతిక హక్కును కేసీఆర్ కోల్పోయారని అన్నారు. ఎన్నికలముందు చేసిన వాగ్దానాలను నెరవేర్చటంలో ఆయన విఫలమయ్యారని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తక్షణమే రద్దుచేయాలని డిమాండ్ చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

టీడీపీ వర్చువల్ మహానాడు..!

సాంకేతికత ఉపయోగించుకోవడంలో.. టీడీపీ అధినేత చంద్రబాబు ముందు ఉంటారు. కరోనా కాలంలోనూ ఆయన ఈ సాంకేతిక ఆధారంగానే పనులు చక్క బెడుతున్నారు. జూమ్ యాప్‌ను గరిష్టంగా ఉపయోగించుకుంటున్నారు. మహానాడును కూడా డిజిటల్ మయం...

ఏడాది యాత్ర 8: సంపద సృష్టించలేక ఆస్తులు అమ్మి పాలన..!

"భూములమ్ముతున్నారు... ప్రభుత్వం ఏమైనా దివాలా తీసిందా..?" అని హైకోర్టు మొహం మీదనే ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. ఈ డౌట్ హైకోర్టుకు మాత్రమే కాదు.. సామాన్య ప్రజలకూ వస్తోంది. ఎందుకంటే.. ఇప్పటి వరకూ ఉన్న...

‘గైడ్‌లైన్స్’ రూపొందించుకున్న టాలీవుడ్

చిత్ర‌సీమ యావ‌త్తూ 'క్లాప్' కొట్టే ముహూర్తం కోసం ఎదురు చూస్తోంది. మ‌ళ్లీ సెట్లు క‌ళ‌క‌ళ‌లాడే రోజు కోసం క‌ల‌లు కంటోంది. జూన్‌లో చిత్రీక‌ర‌ణ‌లు మొద‌ల‌వుతాయి. అయితే.. కేంద్ర ప్ర‌భుత్వం ఇచ్చే గైడ్ లైన్స్‌కి...

త్రివిక్ర‌మ్‌కి రీమేకులు వ‌ర్క‌వుట్ అవుతాయా?

స్వ‌త‌హాగా ర‌చ‌యిత‌లైన ద‌ర్శ‌కులు రీమేక్‌ల‌ను అంత‌గా ప్రోత్స‌హించ‌రు. కార‌ణం.. వాళ్ల ద‌గ్గ‌రే బోలెడ‌న్ని క‌థ‌లుంటాయి. త్రివిక్ర‌మ్ ఇప్ప‌టి వ‌ర‌కూ రీమేక్ జోలికి వెళ్ల‌లేదు. హాలీవుడ్ క‌థ‌ల్ని, న‌వ‌ల‌ల్ని, పాత సినిమాల్నీ స్ఫూర్తిగా తీసుకుని...

HOT NEWS

[X] Close
[X] Close