కొమ్మినేని తనకు 70 ఏళ్లు అని.. గుండెల్లో దడ ఉందని.. యూరిన్ ఇన్ ఫెక్షన్ ఉందని జైలుకు పంపవద్దని జడ్జిని వేడుకున్నాడు. కనీసం ఆయన బాధను పొన్నవోలు బలంగా చెప్పలేకపోయారు. అసలు ఆ మాటలన్నది కొమ్మినేని కాదని న్యాయమూర్తికి అర్థమయ్యేలా చెప్పలేకపోయారు. ఫలితంగా ఎస్సీ, ఎస్టీ సెక్షన్లు తీసేసినా .. జడ్జి మాత్రం కొమ్మినేనికి రిమాండ్ కు పంపారు. దీంతో ఈ వయసులో ఆయన ఇబ్బంది పడాల్సి వస్తోంది.
అసలు పొన్నవోలు సుధాకర్ రెడ్డిని ప్రతీ కేసులో ఎందుకు పంపుతారో వైసీపీ నేతలకు అర్థం కావడం లేదు. ఆయనకు కనీస లా సెక్షన్లు తెలియని కాసేపు మాట్లాడితే ఎవరికైనా అర్థం అవుతుంది. రాజకీయ ప్రత్యర్థులతో వాదించినట్లుగా కోర్టులో జడ్జిలతో వాదించడం ఆయన ప్రత్యేకత. కేసులో ఏమీ లేకపోయినా పొన్నవోలు మాట్లాడే విధానం చూసి న్యాయమూర్తులకు కోపం వచ్చేలా ఉంటుంది. పొన్నవోలును చాలా సార్లు న్యాయమూర్తులు హెచ్చరించారు కూడా.
కొమ్మినేని బాధను అర్థం చేసుకుని అయినా జగన్ రెడ్డి.. రాజ్యసభ సభ్యుడు.. నిరంజన్ రెడ్డిని పంపి ఉండాల్సిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఆయన సుప్రీంకోర్టు లాయర్ కాబట్టి.. కొమ్మినేని ఆ మాటలు అనలేదని.. యాంకర్ గా ఉన్నారని చెప్పి ఎలాగోలా కవర్ చేసేవారు. కానీ కొమ్మినేని జైలుకు పోతేనే వైసీపీకి కాస్త రాజకీయ లాభం ఉంటుందని అనుకున్నారేమో కానీ.. పొన్నవోలును పంపించారు. ఆయన తన సామర్థ్యాన్ని మరోసారి నిరూపించుకున్నారు