బ‌న్నీతో హ్యాట్రిక్‌… ఆశ‌ల్లో బుట్ట‌బొమ్మ‌

ఎందుక‌నో పూజా హెగ్డేకి ఈమ‌ధ్య టైమ్ అస్స‌లు క‌ల‌సి రావ‌డం లేదు. యువ హీరోయిన్ల తాకిడికి అవ‌కాశాలు త‌గ్గాయి. ‘గుంటూరు కారం’ సినిమాలో ఛాన్స్ వ‌చ్చిన‌ట్టే వ‌చ్చి పోయింది. అందులో కొన్ని సీన్ల‌లో న‌టించిన త‌ర‌వాత‌.. ఆ ప్రాజెక్ట్ నుంచి త‌ప్పుకొంది. ఆ తర‌వాత టాలీవుడ్ నుంచి త‌న‌కేం ఆఫ‌ర్లు రాలేదు. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ తో మ‌ళ్లీ జోడీ క‌ట్ట‌బోతోంద‌న్న ఊహాగానాలు మొద‌ల‌య్యాయి. బ‌న్నీ – అట్లీ కాంబినేష‌న్‌లో ఓ చిత్రం త్వర‌లోనే ప‌ట్టాలెక్క‌బోతోంది. ఈ సినిమాలో క‌థానాయిక‌ల కోసం వేట మొద‌లైంది. ఆ ఆఫ‌ర్ ఇప్పుడు పూజా వ‌ర‌కూ వ‌చ్చింద‌ని టాక్‌. అన్నీ కుదిరితే బ‌న్నీతో పూజాకి ఇది హ్యాట్రిక్ మూవీ అవుతుంది. ఇది వ‌ర‌కు డీజే, అలా వైకుంఠ‌పుర‌ములో చిత్రాల్లో ఇద్ద‌రూ జోడీ క‌ట్టారు. ‘డీజే’ యావ‌రేజ్ అయితే, ‘అల వైకుంఠ‌పుర‌ములో’ ఇండ‌స్ట్రీ హిట్ గా నిలిచింది. బ‌న్నీ – పూజాల‌ది ఆర‌కంగా హిట్ కాంబినేష‌న్‌గా ముద్ర ప‌డిపోయింది. అందుకే… ఈ కాంబోపై మ‌ళ్లీ ఫోక‌స్ ప‌డింది.

అల్లు అర్జున్ – అట్లీల సినిమా అంటే పాన్ ఇండియా స్థాయి క్రేజ్ ఉంటుంది. బాలీవుడ్ ప్రేక్ష‌కుల అభిరుచిని దృష్టిలో ఉంచుకొని కాస్టింగ్ చేయాల్సివుంటుంది. పూజా అయితే.. బాలీవుడ్ వాళ్ల‌కూ ట‌చ్ లో ఉన్న క‌థానాయిక‌. అందుకే ఆ ర‌కంగానూ పూజా స‌రైన ఆప్ష‌న్ అని టీమ్ భావిస్తోంది. అన్నింటికంటే ముఖ్యంగా పూజా ఇప్పుడు పెద్ద‌గా బిజీగా ఏం లేదు. కావ‌ల్సిన‌న్ని కాల్షీట్లు, కావ‌ల్సిన టైమ్‌లో అందుబాటులో ఉంచ‌గ‌ల‌దు. అందుకే పూజా వైపు మొగ్గు చూపిస్తున్నాడు అట్లీ. ఒక‌వేళ ఈ ఆఫ‌ర్ అందుకొంటే, పూజాకు మ‌ళ్లీ మంచి రోజులు మొద‌లైన‌ట్టే. ఎందుకంటే ఇలాంటి ఓ ఆఫ‌ర్ కోస‌మే పూజా ఇప్పుడు వేయి క‌ళ్ల‌తో ఎదురు చూస్తోంది. త‌న‌కు అచ్చొచ్చిన బ‌న్నీతో సినిమా చేస్తే.. పూర్వ వైభ‌వం తిరిగొస్తుంద‌ని భావిస్తోంది. మ‌రి.. ఏమ‌వుతుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఓటేస్తున్నారా ? : ఏపీ రాజధానేదో ఒక్క సారి గుర్తు తెచ్చుకోండి !

పాలకుడు సొంత రాష్ట్రంపై కుట్రలు చేసుకునేవాడు అయి ఉండకూడదు. సొంత ప్రజల్ని నాశనం చేసి తాను ఒక్కడినే సింహాసనంపై కూర్చుని అందర్నీ పీల్చి పిప్పి చేయాలనే వ్యక్తిత్వం ఉండకూడదు. అలా ఉంటే...

ఎడిటర్స్ కామెంట్ : గుర్తుకొస్తున్నావయ్యా.. శేషన్ !

టీ.ఎన్.శేషన్. ఈ పేరు భారత్ లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా స్మరించుకుంటూనే ఉన్నారు. గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. కానీ ఆయనను మరిపించేలా మాత్రం ఎవరూ రావడం లేదు. ఎన్నికల సంఘం...

నిప్పుల కుంపటిలా తెలంగాణ..

తెలంగాణ నిప్పుల కొలిమిలా మారింది. రాష్ట్రంలో రోజురోజుకు ఎండలు మరింత ముదురుతున్నాయి. భానుడు ప్రతాపంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మరో నాలుగైదు రోజులపాటు వేసవి తీవ్రత ఇలాగే ఉంటుందని.. ఎండతోపాటు వడగాడ్పులు వీస్తాయని వాతావరణ...

రేవంత్ కు హైకమాండ్ అభినందనలు..ఎందుకంటే..?

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ హైకమాండ్ ప్రశంసల జల్లు కురిపించినట్లుగా తెలుస్తోంది. ఎన్నికల ప్రచారంలో రేవంత్ లేవనెత్తుతోన్న అంశాల ఆధారంగా కాంగ్రెస్ గ్రాఫ్ జాతీయ స్థాయిలో పెరుగుతోందని రేవంత్ పని తీరును...

HOT NEWS

css.php
[X] Close
[X] Close