జేపీకి కూడా ‘కులం’ అంట‌గ‌ట్టిన పోసాని

జ‌య ప్రకాశ్ నారాయ‌ణ‌ అంటే తెలియ‌నివాళ్లుండ‌రు. ఆయ‌న్ని పార్టీల‌కు అతీతంగా అభిమానిస్తారు. కేవ‌లం ప్ర‌జాసేవ చేయాల‌న్న ఉద్దేశ్యంతోనే ఉన్న‌త ఉద్యోగాన్ని కూడా ప‌క్క‌న పెట్టారు. ఉన్న‌త‌మైన ఆశ‌యాల‌తో రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. కుళ్లిపోయిన ఈ రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌ని బాగు చేయాల‌ని త‌ప‌న ప‌డ్డారు. జేపీ ఏ అంశంపై మాట్లాడినా, అందులోని 360 కోణాల్నీ త‌న‌దైన శైలిలో విశ్లేషిస్తుంటారు. ప్ర‌పంచ రాజ‌కీయ జ్ఞానం తెలిసిన వ్య‌క్తి. ముఖ్యంగా కుల వ్య‌వ‌స్థ పోవాల‌ని త‌న ప్ర‌తి ప్ర‌సంగంలోనూ చెబుతుంటారు. కులాన్ని చూసో, మ‌తాన్ని చూసో ఓటేయొద్దు అని హ‌చ్చ‌రిస్తుంటారు. ఇలాంటి జేపీకి కూడా కులం అంట‌గ‌ట్టారు పోసాని కృష్ణ‌ముర‌ళి. ‘ఫ‌లానా కులం వాడు కాబ‌ట్టే.. అలా మాట్లాడుతున్నాడు’ అంటూ నింద‌లు వేయ‌డానికి ఓ ప్రెస్ మీట్ కూడా పెట్టారు. జేపీకి స‌డ‌న్‌గా కులం ముసుగు వేయ‌డానికి కార‌ణం.. ఆయ‌న చంద్ర‌బాబు నాయుడుని పొగ‌డ్డ‌మే. చంద్ర‌బాబు గొప్ప విజ‌న‌రీ అని, ఆయ‌న భ‌విష్య‌త్తుని చూడ‌గ‌ల‌డ‌ని చెప్ప‌డ‌మే.

చంద్ర‌బాబుని ఎవ‌రు పొగిడినా, పోసానికి శ‌త్రువులే. ఎందుకంటే ఇప్పుడు పోసాని ఉన్న‌ది వైకాపా పంచ‌న‌. సినిమాల్లో అవ‌కాశాలు మృగ్య‌మైన వేళ‌, కేవ‌లం ప‌వ‌న్ క‌ల్యాణ్‌ని బాగా తిడ‌తాడ‌న్న క్యాలిఫికేష‌న్‌తో ఏపీలో ఓ నామిటేటెడ్ ప‌ద‌వి ద‌క్కించుకొని ఫ‌లాల్ని ఎంజాయ్ చేస్తున్నారు పోసాని. ఏపీ చ‌ల‌న చిత్ర అభివృద్ది సంస్థ ఛైర్మ‌న్‌గా ప‌ద‌విని అనుభ‌విస్తున్న పోసాని, ఏనాడూ చిత్ర‌సీమ గురించి, దాని అభివృద్ధి గురించి మాట్లాడ‌లేదు. కానీ ఇప్పుడు జేపీని తిట్టడానికి ఓ ప్రెస్ మీట్ పెట్టేశారు. చంద్ర‌బాబుదీ జేపీదీ ఒకే కులం కాబ‌ట్టి, త‌న సామాజిక వర్గానికి చెందిన నాయ‌కుడ్ని వెన‌కేసుకువ‌స్తున్నార‌ని తీవ్ర స్థాయిలో మండి ప‌డ్డారు పోసాని. త‌న కులం వాడినే ప్రోత్స‌హించాల‌నో, మ‌ద్ద‌తు తెల‌పాల‌నో జేపీ అనుకొంటే ఆయ‌న ఆ ప‌ని ఎప్పుడో చేసేవాడు. త‌ప్పు ఎక్క‌డున్నా నిల‌దీయ‌డం జేపీ త‌త్వం. మంచిత‌నం ఎక్క‌డున్నా మెచ్చుకోవ‌డం కూడా ఆయ‌న గుణమే. చంద్ర‌బాబు విజ‌న‌రీ గురించి హైటెక్ సిటీలోని ప్ర‌తి అంగుళం చెబుతుంది. హైద‌రాబాద్ లోని ప్ర‌తి విధీ మాట్లాడుతుంది. జేపీ కూడా అదే చెప్పారు. అందుకే ఆయ‌న ఇప్పుడు వైకాపాకి, ముఖ్యంగా ఆ పంచ‌న బ‌తికేసే పోసాని ముర‌ళికీ శ‌త్రువైపోయాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గురి తప్పిన ట్వీట్… వైసీపీ ప్లాన్ బూమరాంగ్!

ఎన్నికల్లో ఘోర పరాజయంతో పార్టీ మనుగడనే ప్రశ్నార్ధకం చేసుకున్న వైసీపీ... సోషల్ మీడియా పుణ్యమా అని తన గోతిని తనే తవ్వి తీసుకుంటున్నట్లు కనబడుతోంది. కూటమి సర్కార్ ను టార్గెట్ చేయబోయి తన...

టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీ‌నివాస్

ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ ను నియమించారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు. ప్రస్తుతం అధ్యక్షుడిగా కొనసాగుతోన్న అచ్చెన్నాయుడు మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో ఆయన స్థానంలో పల్లాకు పార్టీ పగ్గాలు అప్పగించినట్లు...

ప‌వ‌న్ ఇక సినిమాల‌కు గుడ్ బై చెప్పిన‌ట్లేనా?

డిప్యూటీ సీఎం... గ్రామీణాభివృద్ధి, పంచాయితీరాజ్, గ్రామీణ తాగునీటితో పాటు అడ‌వులు లాంటి కీల‌క శాఖ‌లు. అంటే ప్ర‌తిరోజు జ‌నంతో మ‌మేకం అయ్యే శాఖ‌లే. ప్ర‌తి రోజు అలుపెర‌గ‌కుండా ప‌ర్య‌టిస్తూ, రివ్యూలు చేస్తూ, నిర్ణ‌యాలు...

శాఖ‌ల కేటాయింపు… పొత్తుల్లో మోడీనే ఫాలో అయిన చంద్ర‌బాబు

రెండ్రోజులుగా ఎదురుచూస్తున్న మంత్రుల‌కు శాఖ‌ల కేటాయింపు ఏపీలోనూ పూర్త‌యింది. గ‌తానికి భిన్నంగా ఈసారి శాఖ‌ల కేటాయింపు కాస్య ఆల‌స్య‌మైనా...స‌మ‌తుల్యంగా కేటాయించిన‌ట్లు క‌న‌ప‌డుతోంది. అయితే, ఈ శాఖ‌ల కేటాయింపులో చంద్ర‌బాబు -మోడీ ఒకేవిధంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close