అటూ ఇటూ తిరిగి తెలంగాణ కాంగ్రెస్‌కు చుట్టుకుంటుందా..?

పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ రాజకీయ అంశం అవుతోంది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచేందుకు ఉత్తర్వులు జారీ చేస్తే , అధికార టిఆర్ఎస్ పార్టీ ఎందుకు స్పందించడం లేదని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఓ రకంగా.. జీవో జారీ చేసిన తర్వాత వారం పాటు.. తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శలు ప్రారంభించిన తర్వాతే… విషయాన్ని టేకప్ చేశారు. కానీ ఇప్పుడు ఆ వివాదం.. కాంగ్రెస్‌లోనే కాక రేపుతోంది. దీనికి కారణం.. కాంగ్రెస్ హయాంలోనే.. పోతిరెడ్డి పాడు నిర్మాణం జరిగింది మరి.

ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్లక్ష్యనికి కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులు ఎండిపోయే ప్రమాదం ఉందని నేతలు హెచ్చరిస్తున్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, కల్వకుర్తి, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులకు నీరు అందని పరిస్థితి ఉంటుందని.. మహబూబ్ నగర్, నల్లగొండ, ఖమ్మం, ఉమ్మడి జిల్లాలు ఎడారిగా మారు తాయని ప్రెస్‌మీట్లు పెట్టి చెబుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ కు కూడా మంచి నీటి సమస్య వస్తుందని ఉంటున్నారు ఇలా చేస్తున్న విమర్శల్లో.. పోతిరెడ్డిపాడు పుట్టుక గురించిన చర్చ కూడా… టీ కాంగ్రెస్ నేతల విమర్శల్లో వస్తోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి.., అసలు మొదటి నుంచి పోతిరెడ్డి పాడు విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని ప్రకటించారు. దీనిపై పొన్నాల లక్ష్మయ్య అభ్యంతరం చెప్పినట్లుగా తెలుస్తోంది.

వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు.. పొన్నాల భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నారు. అప్పుడే పోతిరెడ్డిపాడును నిర్మించారు. ఆనాడు పోతిరెడ్డిపాడుకు కేబినెట్ ఆమోదించిందని కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిందని పొన్నాల గుర్తు చేశారు. వరదజలాలను వినియోగించుకోవడానికి రెండు రాష్ట్రాల్లో ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టామని చెప్పుకొచ్చారు. అప్పట్లో కేసీఆర్ అందుకే.. పోతిరెడ్డిపాడు అంశాన్ని తెలంగాణ సెంటిమెంట్ ను పెంచడానికి బాగా ఉపయోగించుకున్నారు. ఈ విషయం రాజకీయ దుమారంగా మారితే మొదట.. ఇబ్బంది పడేది కాంగ్రెస్ పార్టీనే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంగ్లిష్ మీడియం కోసమూ సుప్రీంకోర్టుకు ఏపీ సర్కార్..!

వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏపీలో ఇంగ్లిష్ మీడియం మాత్రమే ఉండాలనే పట్టుదలను ప్రదర్శిస్తున్న ఏపీ సర్కార్.. సుప్రీంకోర్టు తలుపు తట్టింది. ఇంగ్లీష్ మీడియంపై హైకోర్టు ఆదేశాలను సుప్రీంలో...

కృష్ణా బోర్డు భేటీలో ఎప్పటి వాదనలే.. ఎప్పటి వాటాలే..!

కృష్ణా నద యాజమాన్య బోర్డు భేటీలో ఆరు గంటలు వాదోపవాదాలు చేసుకున్నా..చివరికి మొదటికే వచ్చారు రెండు రాష్ట్రాల అధికారులు. ఇద్దరి వాదనలుక..కేఆర్ఎంబీ బోర్డు.. డీపీఆర్‌లు సమర్పించాలనే సూచనతో ముగింపునిచ్చింది. డీపీఆర్‌లు...

తూచ్.. విజయ్‌ మాల్యాను అప్పగించరట..!

విజయ్ మాల్యాను అప్పగించడం లేదని బ్రిటన్ ప్రభుత్వం తేల్చేసింది. న్యాయపరమైన ప్రక్రియ పూర్తి కాలేదని.. చట్ట లాంచనాలు పూర్తి చేయాల్సి ఉందని అక్కడి ప్రభుత్వం చెబుతోంది. అవి ఏమిటో..ఎప్పుడు పూర్తవుతాయో..మాత్రం చెప్పడం లేదు....

బాల‌య్య ఇంట్లో విందు… చిరు వ‌స్తాడా?

జూన్ 10... బాల‌కృష్ణ పుట్టిన రోజు. ఈసారి పుట్టిన రోజు ప్ర‌త్యేక‌త ఏమిటంటే.. ఇది ఆయ‌న ష‌ష్టి పూర్తి మ‌హోత్స‌వ సంవ‌త్స‌రం. అందుకే ఈ పుట్టిన రోజుని కాస్త ప్ర‌త్యేకంగా జ‌రుపుకోవాల‌ని బాల‌య్య...

HOT NEWS

[X] Close
[X] Close