పిరియాడిక్ రూరల్ బ్యాక్ డ్రాప్ వున్న సినిమాలపై ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. కథ, కథనాలు కుదరాలే కానీ చిన్న సినిమాలు కూడా మంచి విజయాలు సాధించే అవకాశం వున్న జోనర్ ఇది. యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల లీడ్ రోల్స్ ఓ రూరల్ డ్రామా వస్తోంది. అదే ‘పొట్టేల్’. గతంలో సవారి సినిమా తీసిన సాహిత్ మోత్ఖూరి ఈ చిత్రానికి దర్శకుడు.
ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు. 1980 నేపధ్యంలో తెలంగాణలో జరిగిన కథ ఇది. కూతురి చదవు కోసం తల్లితండ్రుల చేసిన పోరాటం ఈ సినిమా కథాంశం. ట్రైలర్ ని ఆకట్టుకునేలా కట్ చేశారు. ఆర్టిస్టులు పెర్ఫార్మెన్స్, యాంబియన్స్, మేకింగ్.. నేచురల్ గా వున్నాయి. యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల తో పాటు అజయ్ ఓ కీలక పాత్రలో కనిపించాడు. అతడిదే విలన్ రోల్. తన గెటప్ కూడా కొత్తగా వుంది. బలిచ్చే పొట్టేల్ కి, హీరో కూతురు చదువుకి లింక్ ఏమిటనే తెరపై చూడాలి.
ట్రైలర్ కి శేఖర్ చంద్ర ఇచ్చిన బీజీఎం ఇంపాక్ట్ ఫుల్ గా వుంది. రెగ్యులర్ గా కాకుండా కొత్త పాయింటే పట్టుకున్నాడు దర్శకుడు. విద్య ప్రాముఖ్యతని తెలియజేసే కథని ఎంచుకోవడం మంచి విషయమే. అక్టోబర్ 25న ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు వస్తోంది.