సినిమా వాళ్లతో గేమ్స్ – “పవర్” ప్రదర్శనతో ఇగో శాటిస్‌ఫై చేసుకుంటున్నారా ?

సంక్రాంతికి ఇద్దరు స్టార్ హీరోల సినిమాల రిలీజవుతున్నాయి. అగ్రహీరోలయిన చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు వస్తున్నాయి. వీటి ప్రి రిలీజ్ ఫంక్షన్ ఏపీలోనే నిర్వహించాలనుకున్నారు. బాలకృష్ణ సినిమా ఒంగోలులో.. చిరంజీవి సినిమాకు విశాఖలో నిర్వహించాలనుకున్నారు. మామూలుగా ఇలాంటి వేడుకలు ఎక్కడ జరిగినా అధికారులు ఎవర్నీ ఇబ్బంది పెట్టరు. ఎక్కడ నిర్వహించాలనుకుంటే అక్కడ పర్మిషన్ ఇస్తారు. భద్రత పరంగా సహకరిస్తారు. ఇంత కాలం జరిగింది ఇదే. కానీ విచిత్రంగా ఇప్పుడు.. రెండు సినిమాలకూ అధికారులు చుక్కలు చూపించారు. వేదికల్ని మార్చి మార్చి… అదనపు ఖర్చుకు కారణం అయ్యారు. అనుమతుల్లో గందరోళం సృష్టించారు. లేనిపోని ఆంక్షలు పెట్టారు. ఇందు కోసం ఆయా సినిమా బృందాల్ని తమ వెంట అదే పనిగా తిప్పుకున్నారు.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత జగన్ వద్ద నిలబడిన ఓ ఫోటోను వైసీపీ సోషల్ మీడియా విస్తృతంగా ప్రచారం చేసుకుంది. అన్న సంతకం కోసం నెల రోజుల పాటు తిరిగితే కానీ.. సినిమా రిలీజ్ చేసుకోలేరని.. అదీ అసలు హీరోయిజం అని ఎలివేట్ చేసుకోవడం ప్రారంభించారు. దీన్ని బట్టి చూస్తే.. కేవలం సినిమాలు తమ కంటే తక్కువ .. తమ అధికారం కంటే వారి ప్రజాదరణ తక్కువ అని నిరూపించడానికి.. ఆ హీరోల్ని కించపర్చడానికి ఈ ఎపిసోడ్ ను నడిపించినట్లుగా ఎక్కువ మంది అనుమానిస్తున్నారు. జగన్ తో పాటు వైసీపీ నేతలు తమ ఇగోను శాటిస్ ఫై చేసుకోవడానికి వీరయ్య, వీరసింహారెడ్డిలను ఇబ్బంది పెట్టారని క్లారిటీ వస్తోంది.

అయితే హీరోలను తన తగ్గరకు రప్పించుకునేంత అధికారం.. సంతకాల కోసం తమ చుట్టూ తిప్పుకునేంత అధికారం ఇచ్చింది ప్రజలు. అయితే వారు ఇచ్చిన అధికారం ఈగో శాటిస్ ఫై చేసుకోవడానికి కాదు. ప్రజలకు మేలు చేయడానికి . అధికార దర్పం చూపించుకోవడానికి కాదు. అధికారం పోతే.. జగన్ ను అయినా..మరొకర్ని అయినా దేకడు. వ్యక్తిగతంగా జగన్ అనుమతి కోసం ఎవరూ రారు. ప్రభుత్వం దగ్గరకే వస్తారు. ఈ ప్రభుత్వానికి అధిపతిగా ఇవాళ జగన్ ఉంటారు.. రేపు ఉండరు. అదీ తేడా. గుర్తిస్తే సరే లేదంటే.. తర్వాత ప్రదర్శించుకోవడానికి అధికారం ఉండదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చంద్రబాబు – జైలు – వాయిదాలు !

ఎఫ్ఐఆర్ కూడా లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. కానీ న్యాయం కోసం ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్లపై తీర్పులు మాత్రం.. అంత వేగంగా రావడం లేదు. ఎప్పుడొస్తాయో తెలియదన్నట్లుగా సీన్...

అనసూయ కన్నీళ్లకి అసలు కారణం ఇదే

యాంకర్, నటి అనసూయ ఇటివలే షేర్‌ చేసిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇందులో ఆమె కన్నీటి పర్యంతమవుతూ కనిపించారు. ఆన్‌లైన్‌ల ట్రోల్స్ వల్లే ఆమె కన్నీళ్లు పెట్టుకుందని నెట్టింట ప్రచారం...

ప్రభాస్ ‘కల్కి’తో జాగ్రత్త!

ప్రభాస్‌ తో నాగ్ అశ్విన్‌ రూపొందిస్తున్న సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ ‘కల్కి 2898 ఏడీ’. కమల్‌ హాసన్‌ విలన్‌, బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌, దీపిక పదుకొణె, దిశా పటానీ ఇలా...

అసెంబ్లీలో 10 మంది టీడీపీ ఎమ్మెల్యేల్ని ఎదుర్కోలేక నైతిక పతనమైన వైసీపీ!

అసెంబ్లీలో వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. టీడీపీకి గట్టిగా పదిహేను మంది ఉన్నారు. వారిలో ఐదుగురు సైలెంట్ గా ఉంటారు. మహా అయితే గట్టిగా ఓ పది మంది టీడీపీ సభ్యులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close