హైదరాబాద్‌ను చూస్తుంటే బాధగా ఉందన్న ఏపీ ఎమ్మెల్యే

హైదరాబాద్: హైదరాబాద్ వెళ్ళినప్పుడల్లా బాధ కలుగుతోందని అనంతపురంజిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే, జేసీ బ్రదర్స్‌లో ఒకరైన జేసీ ప్రభాకరరెడ్డి అన్నారు. హైదరాబాద్‌వంటి రాజధాని ఏపీకి వస్తుందో, లేదో తనకు నమ్మకం లేదని చెప్పారు. అనంతపురంలో ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడుతూ వివిధ అంశాలపై స్పందించారు. కాంగ్రెస్ పార్టీవల్ల తాము బాగుపడ్డామని అంగీకరించారు. రాష్ట్ర విభజనవల్లే కాంగ్రెస్ పార్టీని వీడాల్సివచ్చిందని చెప్పారు. ఏపీ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలన్నీ వృథాగానే ఉన్నాయని విమర్శించారు. తన నియోజకవర్గం తాడిపత్రి అభివృద్ధికోసం అవసరమైతే దౌర్జన్యానికి దిగుతానని చెప్పారు. సీమలోని కరువుప్రాంతాలకు తాగు, సాగునీరు ఇస్తే చంద్రబాబు మళ్ళీ సీఎమ్ అవుతారని అన్నారు. రాహుల్ అనంతపురం పర్యటన అవసరంలేదని, కాంగ్రెస్ హయాంలో అత్మహత్యలకు పాల్పడ్డ రైతు కుటుంబాలకు సాయం చేస్తే మంచిదని చెప్పారు.

ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలు చేసే జేసీ ప్రభాకరరెడ్డి ఇవాళ హైదరాబాద్‌గురించి చేసిన వ్యాఖ్యలుమాత్రం సీమాంధ్రప్రాంత ప్రజలందరి మనసుల్లో ఇప్పుడు గూడుకట్టుకున్న మనోభావాలేనని అంగీకరించాలి. హైదరాబాద్ అభివృద్ధిలో తమకూ భాగస్వామ్యం ఉన్నప్పటికీ ఇప్పుడు అది తమకు కాకుండా పోయిందనేది వారి భావన.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కాళ్లు పట్టుకోవడంలో పెద్దిరెడ్డి ఎక్స్‌పర్ట్ – కిరణ్ చెప్పిన ఫ్లాష్ బ్యాక్ !

కిరణ్ కుమార్ రెడ్డికి.. పెద్దిరెడ్డికి రాజకీయ వైరం దశాబ్దాలుగా ఉంది. ఆ విషయం అందరికీ తెలుసు. ఒకే పార్టీలో ఉన్నా కిరణ్ కుమార్ రెడ్డిపై పెద్దిరెడ్డికి వ్యతిరేకత ఉంది. కానీ తాను...

తేజా స‌జ్జా… క‌రెక్టు రూటులో!

'హ‌నుమాన్' లాంటి హిట్ త‌ర‌వాత ఏ హీరోకైనా కాస్త క‌న్‌ఫ్యూజన్ మొద‌లైపోతుంది. త‌ర‌వాత ఏం చేయాలి? ఎలాంటి క‌థ‌లు ఎంచుకోవాలి? అనే విష‌యంలో త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డిపోతుంటారు. ఆ గంద‌ర‌గోళంలో త‌ప్పులు...

మేనిఫెస్టో మోసాలు : సీపీఎస్ రద్దు ఏది బాసూ !

" అధికారంలోకి వస్తే వారం రోజుల్లో సీపీఎస్ రద్దు " .. ఈ డైలాగ్ పాదయాత్ర పొడుగుతూ వినిపించింది. ఉద్యోగుల్ని పిలిపించుకుని ర్యాలీలు చేసి... ప్లకార్డులు పట్టుకుని ఎంత డ్రామా...

ఈ విషయంలో కేసీఆర్‌ నెంబర్ వన్ !

రాజకీయ నిర్ణయాలు తీసుకోవడంలో కేసీఆర్ ను మించిన వారు లేరు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తన పార్టీ అభ్యర్థులను బీజేపీ ,కాంగ్రెస్ పంచుకున్నప్పటికీ ఆయన అభ్యర్థులను ఖరారు.. చేసి నోటిఫికేషన్ వచ్చిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close