ప్ర‌భాస్ ‘ఫ్రీ’గా చేస్తున్నాడా?

మంచు విష్ణు ఏం మంత్ర‌మేశాడో ఏమో, ‘క‌న్న‌ప్ప‌’ కోసం చాలామంది స్టార్ల‌ని త‌న టీమ్ లోకి తీసుకొన్నాడు. అందులో ప్ర‌భాస్ ఒక‌డు. ఈరోజుల్లో ప్ర‌భాస్ తో సినిమాలో ఓ పాత్ర చేయించ‌డం ఏమంత ఆషామాషీ వ్య‌వ‌హారం కాదు. అది అతిథి పాత్ర అయినా స‌రే. ఎందుకంటే ప్ర‌భాస్ ఉన్న బిజీ షెడ్యూల్ లో మ‌రో సినిమాకు డేట్లు కేటాయించ‌డం చాలా క‌ష్ట‌మైన విష‌యం. అయినా స‌రే.. ‘క‌న్న‌ప్ప‌’లో ఓ కీల‌క పాత్ర చేయ‌డానికి ప్ర‌భాస్‌ముందుకొచ్చాడు. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రభాస్ పై కీల‌క‌మైన స‌న్నివేశాల్ని పూర్తి చేశారు. ప్ర‌భాస్ పార్ట్ అయిపోయిన‌ట్టే.

అయితే ఈ సినిమా కోసం ప్ర‌భాస్ పైసా కూడా పారితోషికం తీసుకోలేదు. మోహ‌న్ బాబుపై త‌న‌కున్న గౌర‌వం, ఇష్టంతో ఈ సినిమాని ఫ్రీగా చేసిన‌ట్టు తెలుస్తోంది. మోహ‌న్‌బాబుతో ప్ర‌భాస్‌కు మంచి అనుబంధం ఉంది. ‘బుజ్జిగాడు’లో ఇద్ద‌రూ క‌లిసి న‌టించారు. అప్ప‌టి నుంచీ.. వీరి మైత్రి బ‌ల‌ప‌డింది. మోహ‌న్ బాబు కోరిక మేర‌కు ఈ సినిమాలో న‌టించ‌డానికి ప్ర‌భాస్ ముందుకొచ్చాడు. అన్నింటికంటే ముఖ్యంగా పెద‌నాన్న కృష్ణంరాజుకు ‘క‌న్న‌ప్ప‌’ ఇష్ట‌మైన స‌బ్జెక్ట్. ప్ర‌భాస్ తో ‘భ‌క్త కన్న‌ప్ప‌’ రీమేక్ చేద్దామ‌నుకొన్నారు. కానీ కుద‌ర్లేదు. పెద‌నాన్న కోరిక‌ని కొంత వ‌ర‌కూ ఈ సినిమాతో నెర‌వేర్చే ప్ర‌య‌త్నం చేశాడు ప్ర‌భాస్‌. నిజానికి ముందు ఒక స‌న్నివేశానికే ప్ర‌భాస్ పాత్ర ప‌రిమితం. కానీ… ఆ త‌ర‌వాత లెంగ్త్ పెరిగింది. అయినా సరే, ప్ర‌భాస్ త‌న కాల్షీట్లు స‌ర్దుబాటు చేశాడు.

ప్ర‌భాస్ ఒక్క‌డే కాదు, ఈ సినిమాలో అతిథి పాత్ర‌ల్లో చేయ‌డానికి ముందుకొచ్చిన చాలామంది న‌టీన‌టులు పారితోషికం గురించి ఆలోచించ‌లేదని తెలుస్తోంది. అయితే మోహ‌న్ బాబు మాత్రం `విలువైన` కానుక‌ల్ని రిట‌ర్న్ గిఫ్ట్ రూపంలో ఇవ్వ‌బోతున్న‌ట్టు స‌మాచారం అందుతోంది. అక్ష‌య్ కుమార్ మాత్రం రోజువారీ పారితోషికానికే సినిమా పూర్తి చేసిన‌ట్టు తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అమెరికాలో వల్లభనేని వంశీ

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అమెరికా వెళ్లారు. పోలింగ్ అయిపోయిన తర్వాత చాలా మంది వెళ్లారు కానీ.. అందరూ తిరిగి వస్తారు.. కానీ వంశీ వస్తారా లేదా అన్నది మాత్రం...

ఫాక్స్ లింక్ పరిశ్రమ తిరుపతి నుంచి చెన్నైకి జంప్ !

యాపిల్‌కు విడిభాగాలు తయారు చేసి సప్లయ్ చేసే ఫాక్స్ లింక్స్ కంపెనీ ఏపీ నుంచి తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోయింది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు నారా లోకేష్ ఈ పరిశ్రమను...

ఆ ల్యాండ్ చుట్టూనే తిరుగుతున్న మల్లారెడ్డి

తనకు ఐదు వందల ఎకరాలు ఉన్నాయని తనకు ఎవరి భూమి కబ్జా చేయాల్సిన పనే లేదని మల్లారెడ్డి తరచూ చెబుతూంటారు. కానీ ఓ స్థలం విషయంలో మాత్రం ఆయన నేరుగా రంగంలోకి...

సీఎస్‌ను తప్పిస్తే మొత్తం సెట్ రైట్ – ఎందుకు మార్చరు ?

ఏపీలో జరుగుతున్న సర్వ అవకతవకలకు కారణం చీఫ్ సెక్రటరీ. జగన్ రెడ్డి జేబులో మనిషిగా వ్యవహరిస్తూ వ్యవస్థలన్నింటినీ భ్రష్టుప్టటిస్తున్నారు. చివరికి అల్లర్లపై విచారణ చేయడానికి సిట్ అధికారులుగా ఏసీబీ వాళ్లను..సీఐడీలో పని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close