ప్ర‌భాస్ ఫ్యాన్స్‌ని మ‌రింత భ‌య‌పెడుతున్న మారుతి

మారుతితో ప్ర‌భాస్ సినిమా అన‌గానే.. టాలీవుడ్ షాకైంది. ఈ కాంబో ఎలా కుదిరింద‌బ్బా..? అని ఆశ్చ‌ర్య‌పోయింది. ప్ర‌భాస్ ఫ్యాన్స్ అయితే.. ముందు కంగారు ప‌డ్డారు. బ‌డా బ‌డా స్టార్ ద‌ర్శ‌కుల‌తో చేయాల్సిన ప్ర‌భాస్‌, మారుతికి ఎలా ఛాన్సిచ్చాడో వాళ్ల‌కు అర్థం కాలేదు. ఈ కాంబోపై ఎవ‌రి లాజిక్కులు వాళ్ల‌వి. ప్ర‌భాస్ త్వ‌ర‌త్వ‌ర‌గా పూర్త‌యిపోయే ఓ సినిమా చేయాల‌ని ఉవ్వీళ్లూరుతున్నాడ‌ని, అందుకు మారుతినే క‌రెక్ట్ అని, అందుకే మారుతి క‌థ కు ఓకే చెప్పాడ‌ని చెప్పుకొన్నారు. అయితే మారుతికి.. స్టార్ హీరోల‌ను డైరెక్ట్ చేసి, హిట్టు కొట్టిన దాఖ‌లాలు లేవు. అందుకే ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆందోళ‌న చెందారు.

ఇప్పుడు మారుతి వాళ్ల‌ని మ‌రింత భ‌య‌పెట్టాడు. `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌` సినిమాతో. గోపీచంద్ – మారుతి కాంబోలో వ‌చ్చిన ఈ సినిమా.. తొలి రోజు టాక్ తోనే తేలిపోయింది. రొటీన్ క‌థ‌, రొటీన్ హీరోయిజాల‌తో మ‌వారుతి బోర్ కొట్టించాడు. కామెడీ పండించ‌డంలో మారుతికి తిరుగులేద‌న్న‌ది పేరు. ఆ విభాగంలోనూ మారుతి ఫెయిల్ అయ్యాడు. దాంతో.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆందోళ‌న మ‌రింత పెరిగింది. గోపీచంద్ ని హ్యాండిల్ చేయ‌లేక‌పోయిన మారుతి.. ప్ర‌భాస్ కి హిట్టు ఇవ్వ‌గ‌ల‌డా? అనేదే పెద్ద ప్ర‌శ్న‌. బ‌డా హీరోల‌కు స‌రిప‌డా క‌థ‌లు మారుతి రాసుకోలేడ‌ని గ‌తంలో బాబు బంగారంతో రుజువైంది. ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ తో ఇంకాస్త స్ట్రాంగ్ అయ్యింది. అందుకే ప్ర‌భాస్ – మారుతి సినిమా అనేస‌రికి రెబల్ స్టార్ ఫ్యాన్స్ లో ఆందోళ‌న మ‌రింత ఎక్కువైంది. `ఈ సినిమా ఎలాగోలా ఆగిపోతే బాగుణ్ణు` అంటూ ప్ర‌భాస్ ఫ్యాన్స్ సోష‌ల్ మీడియాలో మీమ్స్ ద్వారా త‌మ బాధ‌ని వ్య‌క్తం చేసుకుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అల్ల‌రి న‌రేష్‌.. మ‌ళ్లీనా..?

ఈవీవీ మంచి ద‌ర్శ‌కుడే కాదు. నిర్మాత కూడా. ఈవీవీ సినిమా ప‌తాకంపై ఆయ‌న కొన్ని మంచి చిత్రాల్ని అందించారు. ఫ్లాపుల్లో ప‌డి స‌త‌మ‌త‌మ‌వుతున్న ఈవీవీకి... త‌న సొంత బ్యాన‌రే మ‌ళ్లీ నిల‌బెట్టింది. ఈవీవీ...

బీజేపీని టార్గెట్ చేసే స్టైల్ మార్చిన కేసీఆర్ !

తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాని మోదీని ఇష్టారీతిన విమర్శించడమే ఇప్పటి వరకూ బీజేపీపై చేస్తున్న యుద్దంగా భావించేవారు. అయితే అనూహ్యంగా ఇప్పుడు స్టైల్ మార్చారు. వికారాబాద్‌లో కలెక్టరేట్ భవనాలను ప్రారంభించిన ఆయన......

“ఆ ప్రశ్న” అడిగితే అసహనానికి గురవుతున్న జనసేన !

మంత్రి అంబటి రాంబాబుపై జనసేన పార్టీ నేతలు విరుచుకుపడుతున్నారు. ఆయనపై రకరకాల పద ప్రయోగాలు చేస్తూ మండి పడుతున్నారు. అంబటి రాంబాబును బపూన్‌ను చేస్తూ.. ఆయన ఫోటోను మార్ఫింగ్ చేసి మరీ...

లెక్కల్లేవ్ ..అయినా ఏపీని అలా వదిలేశారేంటి !?

ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకున్నంత మాత్రాన వారికి రాసిచ్చినట్లు కాదు. ఏదైనా రాజ్యాంగ పరంగా చేయాలి. ప్రజలు పన్నులు కట్టగా వచ్చే డబ్బును.. వారిని చూపించి చేసే అప్పును.. పద్దతిగా వాడాలి....

HOT NEWS

css.php
[X] Close
[X] Close