సీక్వెల్, ప్రీక్వెల్, పార్ట్ 2 అనేవి ట్రెండ్ లో భాగాలు. అయితే ఈ ట్రెండ్ ని గట్టిగా వాడుకొంటోంది ప్రభాస్ ఒక్కడేనేమో..? బాహుబలి 2 భాగాలుగా తీశారు. సలార్, కల్కి వీటికి పార్ట్ 2 వుంది. రాజాసాబ్ 2 కూడా చూడబోతున్నారంటూ మారుతి ప్రకటించేశారు. ఇప్పుడు ఫౌజీకి సైతం ప్రీక్వెల్ ఉందట.
ప్రభాస్ – హను రాఘవపూడి కాంబినేషన్ లో రూపుదిద్దుకొంటున్న సినిమా ఇది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఈ చిత్రానికి ప్రీక్వెల్ ప్లాన్ చేశారని, ప్రభాస్ సైతం ఓకే చెప్పేశాడని ఇన్ సైడ్ వర్గాల టాక్. హను వర్కింగ్ స్టైల్ ప్రభాస్‌కు విపరీతంగా నచ్చిందని సమాచారం. అందుకే వెంటనే మరో సినిమా చేద్దామని ఆఫర్ కూడా ఇచ్చాడట. వేరే సినిమా చేసే బదులు `ఫౌజీ`కి ప్రీక్వెల్ చేస్తే సరిపోతుందని హను చెప్పడం, వెంటనే ఓ ఐడియా వినిపించడం కూడా జరిగిపోయాయట. అలా.. ఈ ప్రీక్వెల్ సెట్ అయ్యింది.
అయితే ప్రభాస్ ప్రకటించిన ఇన్ని ప్రీక్వెల్స్ ఎప్పుడు పూర్తవుతాయన్నది ఓ ప్రశ్న. కల్కి 2 అయితే 2026లో పట్టాలెక్కుతుంది. ఈ విషయంలో డౌటు లేదు. సలార్ 2 సంగతే కాస్త డౌటు. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమాలో బిజీగా ఉన్నాడు. దానికి కూడా సీక్వెల్ ఉండే ఛాన్సుంది. మధ్యలో కేజీఎఫ్ 3 తీద్దామంటే ఆయన్ని ఆపేవాడు లేడు. అవన్నీ పూర్తయ్యాకే సలార్ 2 ఉంటుంది. రాజాసాబ్ అంటారా.. ఆ సినిమా జయాపజయాల మీదే పార్ట్ 2 ఆధారపడి ఉంటుంది.


