‘గుహ’ క‌డుతున్న ప్ర‌భాస్‌

డ్రీమ్ హౌస్‌.. అంటూ ప్ర‌తీ ఒక్క‌రికీ ఉంటుంది. త‌మ ఇల్లు ఎలా ఉండాలో.. ముందు నుంచీ క‌ల‌లు కంటుంటారు. అలాంటి క‌ల ప్ర‌భాస్‌కీ ఉంది. అత్యాధునిక హంగుల‌తో ఓ ఫామ్ హౌస్ నిర్మించుకోవాల‌ని ఎప్ప‌టి నుంచో ప్ర‌భాస్ ఆశ‌. ఇటీవ‌ల హైద‌రాబాద్ శివార్ల‌లో దాదాపు 5 ఎక‌రాల విస్తీర్ణంలో ఓ ఫామ్ హౌస్ కొన్నాడు ప్ర‌భాస్‌. ఇప్పుడు ఆ ఫామ్ హౌస్‌ని ఆధునీక‌రించే పనులు జ‌రుగుతున్నాయి. ఫామ్ హోస్ అంటే.. గార్డెన్ ఏరియా, హ‌ట్స్, స్విమ్మింగ్ పూల్స్ లాంటివి స‌హ‌జం. ప్ర‌భాస్ కాస్త భిన్నంగా ఆలోచించాడు. త‌న ఫామ్ హౌస్‌లో ఓ చిన్న‌పాటి గుహ‌లాంటిది నిర్మించుకొంటున్నాడ‌ట‌. అందుకోసం విదేశీ నిపుణులు ప‌ని చేస్తున్నార‌ని తెలుస్తోంది. ఈ ఫామ్ హౌస్‌.. కొండ లాంటి ప్ర‌దేశంలో ఉంటుంది. అక్క‌డి నుంచి చూస్తే… సిటీ లుక్ మొత్తం క‌నిపిస్తుంటుంది. అందుకే… ఆ ప్రాంతాన్ని స‌ర్వాంగ సుంద‌రంగా తీర్చిదిద్దాల‌ని ప్ర‌భాస్ భావిస్తున్నాడ‌ట‌. ప్ర‌భాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌. సినిమాకి రూ.100 నుంచి రూ.200 కోట్ల వ‌ర‌కూ పారితోషికం తీసుకొంటున్నాడు. యువ క‌థానాయ‌కులంతా త‌మ సంపాద‌న‌ని వ్యాపారంలో పెట్టుబ‌డులు పెట్ట‌డానికి ఉప‌యోగిస్తున్నారు. ప్ర‌భాస్‌కి అలాంటి వ్యాప‌కాలేం లేవు. ప్ర‌స్తుతానికి ఈ ఫామ్ హౌస్‌పైనే భారీగా పెట్టుబ‌డి పెడుతున్న‌ట్టు టాక్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంగళవారం సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్‌ మెన్షన్ !

స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ కేసులో తనపై అక్రమంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి, రిమాండ్ కు తరలించారని.. రిమాండ్ ను కొట్టి వేయాలని చంద్రబాబు దాఖలు చేసుకున్న పిటిషన్ ను మంగళవారం ధర్మాసనం ముందు...

ప్ర‌వీణ్ స‌త్తారు… మిష‌న్ త‌షాఫి!

చంద‌మామ క‌థ‌లు, గ‌రుడ‌వేగ చిత్రాల‌తో ఆక‌ట్టుకొన్నాడు ప్ర‌వీణ్ స‌త్తారు. ఆయ‌న్నుంచి వ‌చ్చిన ఘోస్ట్, గాండీవ‌ధారి అర్జున నిరాశ ప‌రిచాయి. ఇప్పుడు ఆయ‌న‌.. ఓ వెబ్ సిరీస్‌తో బిజీగా ఉన్నారు. అదే.. మిష‌న్ త‌షాఫీ....

ఈవారం బాక్సాఫీస్‌: ముక్కోణ‌పు పోటీ

గ‌త‌వారం బాక్సాఫీసు కొత్త సినిమాల్లేక వెల‌వెల‌పోయింది. `స‌ప్త సాగ‌రాలు దాటి` అనే ఓ డబ్బింగ్ సినిమా వ‌చ్చింది కానీ, ఎలాంటి ప్ర‌భావం చూపించ‌లేక‌పోయింది. ఈసారి... ఏకంగా మూడు క్రేజీ సినిమాలు విడుద‌ల‌కు సిద్ధ‌మ‌య్యాయి....

ఎల్బీనగర్ కోసమే చంద్రబాబుకు మధుయాష్కీ మద్దతు !

తెలంగాణ సీనియర్ నేత, రాహుల్ కు సన్నిహితుడిగా పేరున్న మధుయాష్కీ ఎల్బీనగర్‌లో పోటీ చేయాలనుకుంటున్నారు. నిజామాబాద్ ఎంపీగా మాత్రమే పోటీ చేసిన మధుయాష్కీ ఈ సారి అసెంబ్లీకి పోటీ చేయాలనుకున్నారు.కానీ నిజామాబాద్‌లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close