విక్రమ్ చేసిన పొరపాటే ప్రభాస్ చేశాడా?

ఎంతగానో ఊరించిన సాహో సినిమా ఇవాళ తెరమీదకు వచ్చింది. టీజర్, ట్రైలర్ ల తో విపరీతంగా అంచనాలు పెంచిన ఈ సినిమా తెర మీదకు వచ్చేసరికి తుస్సుమంది. అయితే, బాహుబలి 2 పార్ట్స్ ఘన విజయం సాధించిన తర్వాత ప్రభాస్ ఎంచుకున్న ఈ సినిమాను చూసి, విక్రమ్ లాంటి హీరో చేసిన తప్పే ప్రభాస్ చేశాడు అని విశ్లేషకులు అంటున్నారు. వివరాలు లోకి వెళ్తే..

అటు విమర్శకులు , ఇటు ప్రేక్షకుల నుండి విమర్శలు పొందుతున్న సాహో:

సాహో సినిమా విడుదలకు దాదాపు వారం ముందు నుండి సెన్సార్ టాక్ అద్భుతంగా వచ్చిందని, ఇన్సైడ్ టాక్ చాలా బాగా ఉందని ఇలా రకరకాలుగా వార్తలు వినిపించాయి. ఈ రోజు సాహో సినిమా విడుదలవగానే ఆ వార్తలన్నీ కేవలం పుకార్లేనని అర్థం అయిపోయింది. ఇటు విమర్శకులు అటు ప్రేక్షకులు ఇద్దరూ కూడా సినిమా పట్ల పెదవి విరిచారు. అయితే సినిమా పరిశ్రమలో జయాపజయాలు అన్నది సాధారణం. అపజయం కలిగినప్పుడు పొరపాటు ఎక్కడ జరిగిందో విశ్లేషించుకుంటే, పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్త పడవచ్చు.

మల్లన్న సినిమా సమయంలో బోల్తాపడ్డ విక్రమ్ అంచనాలు:

విక్రమ్ స్వతహాగా మంచి నటుడు అయినప్పటికీ, సేతు, పితామగన్ లాంటి సినిమాలు కమర్షియల్ గా విజయం సాధించినప్పటికీ, బాక్సాఫీస్ ని షేక్ చేసే సినిమా తనకు పడింది మాత్రం శంకర్ దర్శకత్వంలో వచ్చిన అపరిచితుడు సినిమాతోనే. ఆ సినిమా తమిళంలో పాటు తెలుగు, హిందీ భాషలలో కూడా విజయం సాధించింది. ఇండియాలోని ఇతర భాషల వాళ్ళు కూడా ఈ సినిమా హిందీ వెర్షన్ ను లేదంటే తమిళ వెర్షన్ను చూసి మెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే అపరిచితుడు భారీ హిట్ అయ్యాక విక్రమ్, సుశీ గణేషన్ అనే దర్శకుడి తో కందసామి అనే సినిమా చేశారు. తెలుగులో ఇది మల్లన్న పేరుతో డబ్ అయింది. అపరిచితుడు సినిమా విజయం ఇచ్చిన ఉత్సాహంతో, విక్రమ్ ఇప్పుడు అన్ని భాషలలో హీరో గా చలామణి అవుతున్నాడు అన్న నమ్మకంతో, ఈ సినిమా కోసం భారీగా ఖర్చు పెట్టారు. దేశదేశాల్లో షూటింగులు చేశారు. సినిమా మొదలైనప్పటి నుండి చివరి దాకా కాన్వాస్ రిచ్ గా ఉండేలా సినిమా తీశారు. ఇన్ని లెక్కలు వేసుకున్న వాళ్ళు కథ పై మాత్రం సరిగ్గా కసరత్తు చేయలేదు. దాంతో ఆ సినిమా భారీ నష్టాలను మూటగట్టుకుంది.

దాదాపుగా అదే తరహా పొరపాటు చేసిన ప్రభాస్:

అపరిచితుడు సినిమా క్రెడిట్ లో సింహభాగం శంకర్ ది అన్న అవగాహన లేకపోవడంతో, అప్పటికి కేవలం మూడే సినిమాలు, అవీ అంతంత మాత్రం సినిమాలు తీసిన దర్శకుడికి మల్లన్న లాంటి భారీ బడ్జెట్ సినిమా ఇవ్వడం విక్రమ్ చేసిన పొరపాటు. ఇప్పుడు సాహో విడుదల తర్వాత ప్రభాస్ కూడా విక్రమ్ చేసిన పొరపాటే చేశాడు అని విశ్లేషకులు భావిస్తున్నారు. బాహుబలి వేల కోట్లు సంపాదించి నప్పటికీ, అందులో సింహభాగం క్రెడిట్ రాజమౌళి ది. ఆ అవగాహన లేకపోవడంతో, మల్లన్న సినిమా సమయంలో విక్రం వేసుకున్న లెక్కలు లాంటివి వేసుకుని, బాహుబలి ద్వారా వచ్చిన మార్కెట్ ను క్యాష్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఇటువంటి భారీ సినిమాలు తీసిన అనుభవం ఏ మాత్రం లేని సుజిత్ కు ప్రభాస్ సినిమా ఇచ్చినట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పుడా పొరపాటు వందల కోట్ల నష్టానికి కారణం అవుతుంది.

విక్రమ్ కెరీర్ నుండి ప్రభాస్ నేర్చుకోవలసిన మరొక అంశం కూడా ఉంది:

శంకర్ ద్వారా భారీ హిట్లు సాధించినప్పటికీ, స్వతహాగా తను మంచి నటుడే అయినప్పటికీ, సరైన కథలు ఎంచుకోకపోవడం వల్ల విక్రమ్ కొద్ది సంవత్సరాలలోనే పూర్తిగా మార్కెట్ను కోల్పోయాడు. బాహుబలి తర్వాత తాను పాన్ ఇండియన్ స్టార్ అయ్యానన్న భ్రమలో నుంచి బయటికి వచ్చి సరైన కథలు ఎంచుకోకపోతే, ప్రభాస్ కూడా విక్రమ్ తరహాలోనే మార్కెట్ కోల్పోయే అవకాశం ఉంది. వీలైనంత త్వరగా ఈ అపజయం నుండి బయటపడి ప్రభాస్ మంచి కథల పై దృష్టి సారించాల్సి ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హోదా ఇస్తేనే విభజన చట్టం అమలు..! హైకోర్టుకు ఏపీ సర్కార్ అఫిడవిట్..!

అమరావతి మార్పు గురించి ప్రస్తావన లేని పిటిషన్‌పై వేసే అఫిడవిట్లలో అటు కేంద్రం..ఇటు ఏపీ...రాజధాని మార్పు గురించి తమ విధానానని హైకోర్టులో చెప్పడం... ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 2018 మార్చి 29న విభజన...

ఆహా ప్లానింగ్ : చిరుతో వెబ్ సిరీస్… 42 షోస్‌

తొట్ట తొలి ఓటీటీ సంస్థ ఆహా.. భారీ ప్లానింగ్ తో రాబోతోంది. వ‌రుస‌గా సినిమాలు కొంటూ, వెబ్ సిరీస్ లు రూపొందిస్తూ.. కంటెంట్ బ్యాంక్ ని పెంచుకుంటోంది ఆహా. రాబోయే రోజుల్లో ఆహా...

170 కోట్ల‌తో ఓటీటీ సినిమానా?

ఓటీటీ.. ప‌రిధి పెరుగుతోంది. చిత్ర‌సీమ‌ని మెల్ల‌మెల్ల‌గా ఓటీటీ ఆక్ర‌మించుకుంటోంది. నిర్మాత‌ల‌కు ఇదో ప్ర‌ధాన ఆదాయ వ‌న‌రుగా మారింది. థియేట‌ర్ల‌కు ప్ర‌త్యామ్నాయంగా ఓటీటీ త‌న రూపాన్ని మార్చుకుంటోంది. ఓటీటీ సంస్థ‌లే... భారీ పెట్టుబ‌డితో సినిమాలు...

ఫ్లాప్ హీరోతో.. యూవీ సినిమా

ద‌ర్శ‌కుడు శోభ‌న్ గుర్తున్నాడా? వ‌ర్షం సినిమా ద‌ర్శ‌కుడు. ప్ర‌తిభావంత‌మైన ద‌ర్శ‌కుడు... చాలా త‌క్కువ వ‌య‌సులోనే క‌న్నుమూశాడు. త‌న త‌న‌యుడే సంతోష్. త‌ను నేను, పేప‌ర్ బోయ్ సినిమాల‌లో హీరోగా క‌నిపించాడు. ఆ...

HOT NEWS

[X] Close
[X] Close