బ్రేకింగ్‌: ప్ర‌భాస్ – నాగ అశ్విన్ – క‌ర‌ణ్ జోహార్ సినిమా

ప్ర‌భాస్ ఇప్పుడు ఫుల్ స్వింగులో ఉన్నాడు. క‌థ‌లు ఓకే చెప్ప‌డానికీ, అడ్వాన్సులు తీసుకోవ‌డానికి ఏమాత్రం మొహ‌మాట ప‌డ‌డం లేదు. ప్ర‌భాస్ చేతిలో చాలా సినిమాలున్నాయిప్పుడు. ఆదిపురుష్‌, స‌లార్. ప్రాజెక్ట్ కె సెట్స్‌పై ఉన్నాయి. సందీప్ రెడ్డి వంగా లైన్లో ఉన్నాడు. రెండ్రోజుల నుంచీ మారుతితో సినిమా ఉంద‌ని ప్ర‌చారం ముమ్మ‌రంగా సాగుతోంది. దాదాపుగా ఆ ప్రాజెక్ట్ కూడా ఓకే. ఇప్పుడు క‌ర‌ణ్ జోహార్ తో ఓ సినిమా చేయ‌డానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. ధ‌ర్మా ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై ప్ర‌భాస్ తో ఓ సినిమా చేయ‌డానికి క‌ర‌ణ్ ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు. ఈ సినిమాకి నాగ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించే ఛాన్స్ వుంది. ఇప్ప‌టికే ప్ర‌భాస్ – అశ్విన్‌ల కాంబోలో `ప్రాజెక్ట్ కె` రూపుదిద్దుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ప్రాజెక్ట్ కె అవ్వ‌గానే.. మ‌ళ్లీ ప్ర‌భాస్‌తోనే ప‌నిచేయాల‌నుకుంటున్నాడు నాగ అశ్విన్‌. క‌ర‌ణ్ జోహార్ లాంటి నిర్మాత వ‌స్తే.. ఇక ఈ కాంబోకి అడ్డేముంది? ప్రాజెక్ట్ కెని బాలీవుడ్ లో ప్ర‌మోట్ చేసే బాధ్య‌త కూడా క‌ర‌ణ్ నే స్వ‌యంగా తీసుకున్నాడ‌ట‌. టాలీవుడ్ సినిమాల‌కు బాలీవుడ్ లో ప్ర‌మోష‌న్ క‌ల్పిస్తోంది క‌ర‌ణ్ జోహారే. అందుకు సంబంధించి క‌ర‌ణ్ కు భారీ ప్యాకేజ్ కూడా అందుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తెలంగాణలోనూ మసీదులు తవ్వుదామంటున్న బండి సంజయ్ !

బండి సంజయ్ ఏ మాత్రం మొహమాటలు పెట్టుకోవడం లేదు. ముందూ వెనుకా ఆలోచించడం లేదు. తన రాజకీయం తాను చేస్తున్నారు. యూపీలో జ్ఞానవాపి మసీదులో శివలింగం బయటపడిందని.. తెలంగాణలోనూ అదే వాదన...

అనంతబాబు సస్పెన్షన్ – గౌతంరెడ్డిని చేసినట్లుగానేనా!?

ఎమ్మెల్సీ అనంతబాబును చేయలేక.. చేయలేక సస్పెండ్ చేశారు వైఎస్ఆర్‌సీపీ అగ్రనేతలు. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లుగా మీడియాకు సమాచారం ఇచ్చారు. అయితే నిజంగానే సస్పెండ్ చేశారో లేకపోతే.. గతంలో వంగవీటి రంగాపై...

మా పార్టీ నేతలపై దాడులు చేసుకుంటామా ?: సజ్జల

అమలాపురం దాడుల వెనుక వైసీపీ నేతల కుట్ర ఉందన్న తీవ్ర ఆరోపణలు వస్తూండటంతో ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెరపైకి వచ్చారు. విపక్షాల విమర్శలు చూస్తుంటే... నవ్వొస్తుంది... అధికార పార్టీ నేతలప ఇళ్లపై...

మళ్లీ జగన్‌ను దారుణంగా అవమానించిన టీఆర్ఎస్ మంత్రి !

సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దావోస్‌లో కేటీఆర్‌తో భేటీ అయి... తమ మధ్య మంచి ర్యాపో ఉందని నిరూపిస్తూంటే తెలంగాణలో మాత్రం టీఆర్ఎస్ నేతలు దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏపీ సీఎం జగన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close