ప్ర‌భాస్ సినిమా: దేవుడు Vs సైన్స్‌

ప్ర‌భాస్ ప్ర‌స్తుతం రాధాకృష్ణ‌తో ఓ సినిమా చేస్తున్నాడు. ‘జాన్‌’, ‘రాధే శ్యామ్‌’ పేర్లు ప‌రిశీల‌న‌లో ఉన్నాయి. న‌వంబ‌రు నుంచి వైజ‌యంతీ మూవీస్‌కి డేట్లు ఇచ్చాడు. ఈ చిత్రానికి నాగ అశ్విన్ నిర్మాత‌. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. దాదాపు రూ.250 కోట్ల బ‌డ్జెట్‌తో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమా క‌థే చాలా విచిత్రంగా ఉంటుంద‌ని, స‌రికొత్త జోన‌ర్‌లో ఈ చిత్రం త‌యార‌వుతోంద‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు చెబుతున్నారు.

అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన అంశం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ సినిమా క‌థంతా దేవుడు Vs సైన్స్ చుట్టూనే తిరుగుతుంద‌ట‌. దేవుడు ఉన్నాడా లేడా? అనే చ‌ర్చ వ‌చ్చిన ప్ర‌తీసారీ.. సైన్స్ గురించి మాట్లాడుకుంటూనే ఉంటాం. అలాంటి టాపిక్ ఈ సినిమాలోనూ ఉంటుంద‌ని, దానిపై చర్చ జ‌రుగుతుంద‌ని తెలుస్తోంది. నిజానికి ఇదో సైన్స్ ఫిక్ష‌న్ మూవీ. అందులో చాలా ఇంటిలిజెంట్‌గా దేవుడు అనే టాపిక్‌ని మిళితం చేశాడ‌ట నాగ అశ్విన్‌. ఆ మేళ‌వింపు.. త‌ప్ప‌కుండా కొత్త‌గా ఉంటుంద‌ని తెలుస్తోంది. ఈ చిత్రంలో క‌థానాయిక‌గా కొంత‌మంది బాలీవుడ్ భామ‌ల పేర్లు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. మ‌రోవైపు దీపికా ప‌దుకొణెని ఫిక్స్ చేసిన‌ట్టు గుస‌గుస‌లూ వినిపిస్తున్నాయి. కానీ.. చిత్ర‌బృందం మాత్రం ఈ విష‌యంలో స్పందించ‌డం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డెడ్లీ వైరస్ : ఏపీలో మరో 43 మరణాలు..!

ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా రెండు రోజుల పాటు నమోదన మరణాలు.. 37, 43. అంటే.. రెండు రోజుల్లో 80 మందికిపైగా కోవిడ్ కారణంగా చనిపోయారు. ఈ స్థాయిలో మరణాలు రికార్డవడం.. కలకలం రేపుతోంది....

మ‌ణిర‌త్నంతో సూర్య‌

మ‌ణిర‌త్నం - సూర్య‌... సూప‌ర్ కాంబినేష‌న్‌. యువ సినిమాతో వీరిద్ద‌రూ మ్యాజిక్ చేశారు. ఇప్పుడు మ‌రోసారి క‌ల‌సి ప‌నిచేయ‌బోతున్నారు. సినిమా కోసం కాదు. వెబ్ సిరీస్ కోసం. మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క సార‌థ్యంలో...

ముద్రగడ ని వదలని సోషల్ మీడియా

ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమం నుండి తాను తప్పుకుంటున్నాను అంటూ నిన్న రాసిన లేఖ ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించింది. గత చంద్రబాబు హయాంలో ప్రభుత్వాన్ని కొన్నిసార్లు ఉక్కిరిబిక్కిరి చేసిన...

పవన్ ని పొగిడిన అలీ, అప్పటి మాటలను గుర్తు చేసిన జన సైనికులు

కమెడియన్ ఆలీ కి, పవన్ కళ్యాణ్ కి మధ్య ఒకప్పుడు ఉన్న సన్నిహిత సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకానొక సందర్భంలో, " ఆలీ లేకుండా నీవు సినిమా తీయలేవా " అని...

HOT NEWS

[X] Close
[X] Close