ప్ర‌భాస్ – నాగ అశ్విన్… లేట‌వుతుందా?

ప్ర‌భాస్ రాబోయే సినిమాల లైన‌ప్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేసే స‌రికి మ‌రో 5 ఏళ్ల‌యినా ప‌డుతుంది. అన్నీ పాన్ ఇండియా ప్రాజెక్టులే. ఒక్కో సినిమాకీ రెండేళ్లు అనుకున్నా – ఐదేళ్ల వ‌ర‌కూ ప్ర‌భాస్ ఎవ‌రికీ దొర‌క‌డు.

రాధేశ్యామ్ త‌ర‌వాత‌.. నాగ అశ్విన్ సినిమా మొద‌ల‌వ్వాలి. ఇది వ‌ర‌కే.. ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చేసింది. హీరోయిన్ గా దీపికా ప‌దుకొణెని కూడా ఫిక్స్ చేసేశారు. అక్టోబ‌రులో లాంఛ‌నంగా మొద‌లెట్టాల‌ని ప్లాన్‌. కానీ… ఈరోజు ప్ర‌క‌టించిన `ఆది పురుష్‌` వ‌ల్ల నాగ అశ్విన్ సినిమా ఆల‌స్యం అవ్వ‌బోతోంద‌న్న‌ది ఇన్ సైడ్ వ‌ర్గాల టాక్‌. `రాధేశ్యామ్‌` పూర్త‌వ‌గానే.. `ఆది పురుష్‌` కొంత మేర షూటింగ్ జ‌రుపుతార‌ని తెలుస్తోంది. ఆ సినిమా ఓ షెడ్యూల్ పూర్త‌యిన త‌ర‌వాతే… నాగ అశ్విన్ సినిమా మొద‌ల‌వుతుంద‌ట‌. ఎందుకంటే.. `ఆదిపురుష్‌` విజువ‌ల్ ఎఫెక్ట్స్ ప్రాధాన్యం ఉన్న చిత్రం. కొంత‌మేర టాకీ పూర్త‌యితే.. మెల్ల‌గా విజువ‌ల్ ఎఫెక్ట్స్‌కి సంబంధించిన ప‌నులూ మొద‌లు పెట్టుకోవొచ్చ‌న్న‌ది ద‌ర్శ‌క నిర్మాత‌ల ఆలోచ‌న‌. `ఆదిపురుష్‌`లో ప్ర‌భాస్ తో పాటు మ‌రికొంత మంది స్టార్స్ న‌టించ‌నున్నారు. వాళ్ల కాంబినేష‌న్ల బ‌ట్టే కాల్షీట్లు స‌ర్దుబాటు చేయాలి. `ఆది పురుష్‌` ముందే మొద‌లైనా… లైన‌ప్ ప్ర‌కారం మాత్రం నాగ అశ్విన్ సినిమానే విడుద‌ల అవుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close