ప్ర‌భాస్ సినిమా.. ఓ చంద‌మామ క‌థ‌!

`బాహుబ‌లి`ని టార్గెట్ చేసి సినిమా తీయాల‌న్న సాహ‌సం కూడా ఎవ‌రూ చేయ‌ని రోజులివి. నాన్ బాహుబ‌లి రికార్డుల్ని చూసి మురిసిపోవ‌డం త‌ప్ప‌, బాహుబ‌లి ద‌రిదాపుల్లోకి వెళ్లాల‌న్న ఆలోచ‌న కూడా ఎవ‌రికీ రావ‌డం లేదు. అయితే… నాగ అశ్విన్ మాత్రం ఏకంగా `బాహుబ‌లి`కే గురిపెట్టాడు. ప్ర‌భాస్ – నాగ అశ్విన్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగ‌తి తెలిసిందే. బుధ‌వార‌మే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది. ఈ కాంబో గురించిన కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల్ని రాబ‌ట్టే ప్ర‌య‌త్నం చేసింది తెలుగు 360.

ఇదో జాన‌ప‌ద క‌థా చిత్ర‌మ‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది. మాయ‌లూ, మంత్రాలూ… త‌ర‌హా క‌థ ఇది. ఒక్క మాట‌లో చెప్పాలంటే ఓ చంద‌మామ క‌థ‌లా ఉండ‌బోతోంది. మ‌హాన‌టి పూర్తయ్యాక `పాతాళ భైర‌వి`లాంటి సినిమా తీయాల‌ని వుంద‌ని నాగ అశ్విన్ చెప్పుకొచ్చాడు. అలాంటి క‌థ‌లో చిరంజీవి న‌టిస్తే బాగుంటుంద‌న్న ఆలోచ‌న‌ని అశ్వ‌నీద‌త్ వ్య‌క్త‌ప‌రిచారు. అక్క‌డే ఈ సినిమా క‌థ‌కు బీజం ప‌డింది. అప్ప‌టి నుంచీ ఈ క‌థ‌పై నాగ అశ్విన్ క‌స‌ర‌త్తు చేయ‌డం మొదలెట్టారు. ఆ క‌థ కార్య‌రూపం దాలుస్తూ.. దాలుస్తూ… ఇప్పుడు పూర్తి స్థాయి స్క్రిప్టుగా మారింది. తీరా చూస్తే… ఈ క‌థ ప్ర‌భాస్‌కి బాగా న‌ప్పుతుంద‌న్న భావ‌న క‌లిగింది. ఆ క‌థ‌ని ఆమ‌ధ్య చూచాయిగా.. ప్ర‌భాస్‌కి వినిపించ‌డం, తొలి సిట్టింగ్‌లోనే ప్ర‌భాస్ ఓకే చెప్పేయ‌డం జ‌రిగిపోయాయి. ఈ సినిమా కోసం దాదాపు 200 కోట్ల బ‌డ్జెట్ అవుతుంద‌ని సమాచారం. అశ్వ‌నీద‌త్ ఓ బాలీవుడ్ నిర్మాణ సంస్థ‌తో చేతులు క‌లిపే ఉద్దేశం ఉంద‌ని తెలుస్తోంది. మొత్తానికి టాలీవుడ్ నుంచి మ‌రో పాన్ ఇండియా సినిమా రాబోతోంది. తారాగ‌ణం, ఇత‌ర న‌టీన‌టులు ఇత‌ర భాష‌ల్లోంచి దిగుమ‌తి చేసే ప‌నిలో ఉంది చిత్ర‌బృందం. ఈ సినిమాలో చాలా చాలా ప్ర‌త్యేక‌తలు క‌నిపించ‌బోతున్నాయి. అవి ఒకొక్క‌టిగా వైజ‌యంతీ మూవీస్ రివీల్ చేయ‌బోతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ ఎమ్మెల్యే కూడా పార్టీ మారడం లేదని క్లారిటీ ఇచ్చేశారు..!

వైసీపీలో చేరబోతున్నారని ప్రచారం జరిగిన రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ కూడా..ఖండించారు. తాను పార్టీ మారబోవడం లేదని ప్రకటించారు. ఎప్పటిలాగే తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. పార్టీలోని కొంత మంది వ్యక్తులు కూడా...

ఎస్ఈసీ ఆర్డినెన్స్‌పై హైకోర్టు తీర్పును సవాల్ చేసిన ఏపీ సర్కార్..!

ఎస్ఈసీ అర్హతలు మార్చుతూ తెచ్చిన ఆర్డినెన్స్‌పై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని కోరుతూ.. ఏపీ సర్కార్ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. సుప్రీంకోర్టుకు వేసవి సెలవులు కొనసాగుతున్నప్పటికీ...ఎస్ఎల్పీ దాఖలు...

శంకించొద్దు.. జగన్‌కు విధేయుడినే : విజయసాయిరెడ్డి 

తాను చనిపోయేవరకు జగన్‌కు, ఆయన కుటుంబానికి విధేయుడిగానే ఉంటానని.. నన్ను శంకించాల్సిన అవసరం లేదని ఎంపీ విజయసాయిరెడ్డి మీడియా ముఖంగా వెల్లడించారు. వైఎస్ జగన్ కు... అత్యంత ఆప్తునిగా పేరు తెచ్చుకున్న ఆయన...

అమిత్‌షాతో భేటీకి మంగళవారం ఢిల్లీకి జగన్..!?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం అత్యవసరంగా ఢిల్లీకి వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు మీడియా ప్రతినిధులకు అనధికారిక సమాచారం అందింది. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్తారని.. కేంద్ర హోంమంత్రి అమిత్...

HOT NEWS

[X] Close
[X] Close