ప్రభాస్ ‘ది రాజాసాబ్’ 2026 జనవరి 9న బాక్సాఫీసు ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పాటలు, ఓ ట్రైలర్ను రిలీజ్ చేసిన టీమ్ తాజాగా మరో ట్రైలర్ ను విడుదల చేసింది.’నానమ్మ ఈ ప్రపంచంలో నీకు అన్ని మర్చిపోయే రోగం ఉన్నా ఆయన్ని మాత్రం అస్సలు మర్చిపోలేవు’ అనే ప్రభాస్ వాయిస్ ఎవరితో మొదలైన ట్రైలర్ అధ్యంతం ఆసక్తికరమైన విజువల్స్, యాక్షన్, హారర్, మిస్టరీ ఫాంటీసీ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంది.
ఇంతకుముందు రిలీజ్ చేసిన టీజర్ ట్రైలర్లో రాజాసాబ్ వరల్డ్ పరిచయం చేశారు. ఈ ట్రైలర్లో కథని ఇంకొంచెం డెప్త్ గా చెప్పే ప్రయత్నం జరిగింది. ఒక మయసభ లాంటి ఇంట్లో జరిగే కథ ఇది. అక్కడ కొన్నేళ్లుగా సంజయ్ దత్ ఆత్మ ఉంటుంది. కాకపోతే అది మామూలు ఇల్లు, ఆత్మ కాదు. అక్కడ ప్రతి వస్తువు ఆయన కనుసన్నల్లో ఉంటుంది. ప్రతిదీ హిప్నోటైజ్ చేసి ఉంటుంది. అతనితో పోరాడాలంటే వేరే ప్రపంచాన్ని సృష్టించుకుని పోరాడాలి. దేవానగర సంస్థానంకు, రాజా సాబ్ కు, ఆయన తాతకు మధ్య ఎలాంటి పోరాటం జరిగిందనేది ఆసక్తికరం.
ఈ ట్రైలర్ చివర్లో ప్రభాస్ జోకర్ క్యారెక్టర్ గెటప్ లో కనిపించడం కొసమెరుపు. ఇదొక హారర్ ఫాంటసీ. నిజానికి తెలుగులో ఇలాంటి విజువల్స్ తో ఇప్పటివరకు ఈ తరహా సినిమా రాలేదనే చెప్పాలి. ట్రైలర్ లో కనిపించిన విజువల్స్ బిగ్ స్క్రీన్ పై ఎలా ఉంటాయో అనే ఆసక్తి కలిగించేలా వున్నాయి. దర్శకుడు మారుతి మహల్ లాంటి ఇంట్లో క్రియేట్ చేసిన యాక్షన్, ఫాంటసీ, హారర్ ఆసక్తికరంగా వున్నాయి. తమన్ మ్యూజిక్ కూడా పవర్ ఫుల్ గా వుంది. మొత్తానికి ఈ ట్రైలర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచడంలో సఫలీకృతమైయింది.