ప్ర‌భాస్ సాయం ప‌డుతున్నాడు

గ‌త వారం విడుద‌లైన ‘మ‌త్తు వ‌ద‌ల‌రా’ మంచి టాకే తెచ్చుకుంది. కానీ వ‌సూళ్లు మాత్రం అంత ఆశాజ‌న‌కంగా లేవు. మ‌రోవైపు ఈ సినిమాకి ప‌బ్లిసిటీ తీసుకురావ‌డానికి చిత్ర‌బృందం త‌న వంతు కృషి చేస్తూనే ఉంది. రాజ‌మౌళి తో ట్వీట్లు చేయించి కాస్త ఊపు తెచ్చింది. రాజ‌మౌళితో చేసిన స్పెష‌ల్ ఇంట‌ర్వ్యూ కూడా బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. సుకుమార్ లాంటి వాళ్లు ముందు నుంచీ ఈసినిమాని త‌మ భుజాన వేసుకుని మోస్తున్నారు. ఇప్పుడు బ్రహ్మాస్త్రాన్ని కూడా సంధించేశారు.

ప్ర‌భాస్ ఈ సినిమాకి సాయం ప‌ట్ట‌డానికి ముందుకొచ్చాడు. ఈ సినిమాని ప్ర‌భాస్ చూశాడు. అంతేకాదు, చిత్ర‌బృందాన్ని అభినందించాడు కూడా. ఇందుకు సంబంధించిన ఓ వీడియోని చిత్ర‌బృందం విడుద‌ల చేయ‌నుంది. ప్రభాస్ బైట్లు, త‌న మాట‌లు, ప్ర‌శంస‌లు… ఈ సినిమాకి కొత్త ప్ర‌చారాన్ని తీసుకురాడం ఖాయం. అయితే.. ప్రేక్ష‌కుల మూడ్ సంక్రాంతి సీజ‌న్‌పై ఉంది. సంక్రాంతికి విడుద‌ల‌వుతున్న సినిమాల గురించి, వాటి మ‌ధ్య ఉన్న పోటీ గురించి ఆసక్తిగా చ‌ర్చించుకుంటున్నారు. ఈ స‌మ‌యంలో.. మిగిలిన సినిమాల‌పై దృష్టి పెట్ట‌డం క‌ష్ట‌మే. కానీ.. ‘మ‌త్తు వ‌ద‌ల‌రా’ టీమ్ త‌న వంతు ప్ర‌య‌త్నాలు మాత్రం ఇలా చేస్తూనే ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ ఎమ్మెల్యే కూడా పార్టీ మారడం లేదని క్లారిటీ ఇచ్చేశారు..!

వైసీపీలో చేరబోతున్నారని ప్రచారం జరిగిన రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ కూడా..ఖండించారు. తాను పార్టీ మారబోవడం లేదని ప్రకటించారు. ఎప్పటిలాగే తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. పార్టీలోని కొంత మంది వ్యక్తులు కూడా...

ఎస్ఈసీ ఆర్డినెన్స్‌పై హైకోర్టు తీర్పును సవాల్ చేసిన ఏపీ సర్కార్..!

ఎస్ఈసీ అర్హతలు మార్చుతూ తెచ్చిన ఆర్డినెన్స్‌పై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని కోరుతూ.. ఏపీ సర్కార్ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. సుప్రీంకోర్టుకు వేసవి సెలవులు కొనసాగుతున్నప్పటికీ...ఎస్ఎల్పీ దాఖలు...

శంకించొద్దు.. జగన్‌కు విధేయుడినే : విజయసాయిరెడ్డి 

తాను చనిపోయేవరకు జగన్‌కు, ఆయన కుటుంబానికి విధేయుడిగానే ఉంటానని.. నన్ను శంకించాల్సిన అవసరం లేదని ఎంపీ విజయసాయిరెడ్డి మీడియా ముఖంగా వెల్లడించారు. వైఎస్ జగన్ కు... అత్యంత ఆప్తునిగా పేరు తెచ్చుకున్న ఆయన...

అమిత్‌షాతో భేటీకి మంగళవారం ఢిల్లీకి జగన్..!?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం అత్యవసరంగా ఢిల్లీకి వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు మీడియా ప్రతినిధులకు అనధికారిక సమాచారం అందింది. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్తారని.. కేంద్ర హోంమంత్రి అమిత్...

HOT NEWS

[X] Close
[X] Close