ప్ర‌భాస్ పెళ్లి తిరుప‌తిలోనే!

టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ ప్ర‌భాస్‌. త‌న పెళ్లి గురించి ఎన్ని వార్త‌లో, ఇంకెన్ని పుకార్లో. ఇంత‌కాలం ప్ర‌భాస్ ఈ విష‌య‌మై మౌనంగా ఉన్నాడు. ఎట్ట‌కేల‌కు త‌న ఫ్యాన్స్‌కి కాస్త హింట్ ఇచ్చాడు. పెళ్లంటూ చేసుకొంటే – తిరుప‌తిలోనే చేసుకొంటా అని ప్ర‌క‌టించాడు.

ఆదిపురుష్ ప్రీ రిలీజ్ వేడుక తిరుప‌తిలో జ‌రిగింది. ఈ సందర్భంగా ప్ర‌భాస్ వేదిక‌పై మాట్లాడుతున్న‌ప్పుడు అభిమానులు `పెళ్లెప్పుడు.. పెళ్లెప్పుడూ` అంటూ గోల గోల చేశారు. ఆ అరుపులు ప్ర‌భాస్ చెవిన ప‌డ్డాయి. వాటికి ప్ర‌భాస్ స్పందించాడు కూడా. `పెళ్లా..? పెళ్లి గ‌నుక చేసుకొంటే ఇక్క‌డే.. ఈ తిరుప‌తిలోనే చేసుకొంటా` అని అభిమానుల‌కు మాటిచ్చాడు ప్ర‌భాస్‌. కృతి స‌న‌న్‌తో ప్ర‌భాస్ ల‌వ్ లో ప‌డ్డాడ‌ని దేశ‌మంతా కోడై కూస్తోంది. అయితే ఇటు ప్ర‌భాస్ గానీ, అటు కృతి గానీ ఈ విష‌య‌మై స్పందించడం లేదు. త‌మ‌ది కేవ‌లం ఫ్రెండ్ షిప్పే అంటున్నారు. మ‌రి.. ప్ర‌భాస్ మ‌న‌సులో ఏముంది? అనేది త‌న‌కే తెలియాలి. కృష్ణంరాజు మాత్రం ప్ర‌భాస్‌కి పెళ్లి చేయాల‌ని చాలా తాప‌త్ర‌య‌ప‌డ్డారు. ఆయ‌న కోరిక నెర‌వేర‌లేదు. క‌నీసం ఈ యేడాదైనా ప్ర‌భాస్ పెళ్లి క‌బురు వినిపిస్తాడేమో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చైతన్య : నిజమే మాస్టారూ – వై ఏపీ నీడ్స్ బటన్ రెడ్డి ?

వై ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమాన్ని జగన్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. ఆంధ్రాకు ఆయన అవసరం ఏంటి అనే చర్చ ప్రజల్లో పెట్టబోతున్నారు. ఇది నెగెటివ్ టోన్ లో ఉంది. అయినా...

ఈ సారి కూడా మోదీకి కేసీఆర్ స్వాగతం చెప్పలేరు !

తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఐదుగురు వైద్యుల బృందంతో చికిత్స అందిస్తున్నట్లుగా మంత్రి కేటీఆర్ తెలిపారు. వారం రోజులుగా జ్వరం, దగ్గుతో కేసీఆర్ బాధపడుతున్నారు. ఒకటి, రెండు రోజులకు తగ్గిపోయే...

టీఆర్ఎస్ కాదు బీఆర్ఎస్ అని మర్చిపోతున్న కేటీఆర్ !

కేటీఆర్ ఇంకా తెలంగాణ రాష్ట్ర సమితిలోనే ఉన్నారు. భారత రాష్ట్ర సమితి వరకూ వెళ్లలేదు. అందరితో పాటు తాను కూడా భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినప్పటికీ... అలా అనుకోవడం లేదు....

ఉద్యోగులందర్నీ సాగనంపుతున్న బైజూస్

ఆన్ లైన్ విద్యను వ్యాపారంగా చేసుకుని లక్షల కోట్లకు పడగలెత్తే ప్రయత్నంలో జారి కిందపడిన బైజూస్ .. లేవడానికి చేస్తున్న ప్రయత్నాలు దివాలా దిశగా సాగుతున్నాయి. ఇటీవలే సీఈవో గుడ్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close