ప్ర‌భాస్ పుట్టిన రోజు గిఫ్టులు

బాహుబ‌లితో ఇంట‌ర్నేష‌న‌ల్ స్టార్ అయిపోయాడు ప్ర‌భాస్. ఇప్పుడు ప్ర‌భాస్ గురించో, త‌న సినిమా గురించో ఏ చిన్న క‌బురు బ‌య‌ట‌కు వ‌చ్చినా అది స‌న్సేష‌న‌లే అయిపోతోంది. ప్ర‌స్తుతం సాహో షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు ప్ర‌భాస్. ఈనెల 23న ప్ర‌భాస్ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా సాహోకి సంబంధించిన కొత్త విష‌యాలు, లేదంటే ఫ‌స్ట్ లుక్‌, టీజ‌ర్‌లాంటివి బ‌య‌ట‌కు వ‌స్తాయేమో అని ఆశ‌గా ఎదురుచూస్తున్నారు ప్ర‌భాస్ ఫ్యాన్స్‌. ఇప్ప‌టికే సాహోకి సంబంధించిన టీజ‌ర్ బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. ఈ సినిమాలో ప్రభాస్ లుక్ ఎలా ఉంటుందో ఆ టీజ‌ర్లో తెలిసిపోయింది. ఈ పుట్టిన రోజుకి టీజ‌ర్లేం లేవు.కాక‌పోతే మేకింగ్ వీడియో ఒక‌టి విడుద‌ల చేసే ఆలోచ‌న‌లో ఉంది చిత్ర‌బృందం. మీడియా కోసం ప్ర‌భాస్ పై స్టైలీష్ ఫొటో షూట్ నిర్వ‌హించార్ట‌. ఆ ఫొటోలు ఒక‌ట్రెండు రోజుల్లో్ బ‌య‌ట‌కు వ‌చ్చే అవ‌కాశాలున్నాయి. 22 అర్థరాత్రి ప్ర‌భాస్ మీడియాకి, త‌న సన్నిహితుల‌కు, సాహో టీమ్‌కీ పెద్ద పార్టీ ఇవ్వ‌బోతున్నాడు. బాహుబ‌లి టీమ్ కూడా ఈ పార్టీలో పాల్గొన‌బోతోంద‌ని టాక్‌. సాహో షూటింగ్ హైద‌రాబాద్ లో శ‌ర‌వేగంగా సాగుతోంది. షూటింగ్‌కి గ్యాప్ ఇవ్వ‌డానికి ప్ర‌భాస్ ఇష్ట‌ప‌డ‌డం లేద‌ని తెలుస్తోంది. వీలైనంత త్వ‌ర‌గా సాహోని విడుద‌ల చేయాల‌న్న‌ది త‌న ప్లాన్‌. పుట్టిన రోజునా.. సాహో సెట్లోనే ఉండ‌బోతున్నాడు ప్ర‌భాస్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.