కామెడీలు కాదు..! కేఏ పాల్ రాజకీయానికి జగన్ ఉక్కిరిబిక్కిరి..!

ప్రజాశాంతి పార్టీ తరపున పర్చూరు నుంచి దగ్గుబాటి వెంకటేశ్వర్లు అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అదేంటి.. దగ్గుబాటి వైసీపీ కదా.. అనే డౌట్ సహజంగా వస్తుంది. కానీ.. వంద శాతం.. దగ్గుబాటి వెంకటేశ్వర్లు.. ప్రజాశాంతి అభ్యర్థిగానే పోటీ చేస్తున్నారు. అయితే.. అందరూ అనుకునే దగ్గుబాటి వేరు..ఈ దగ్గుబాటి వెంకటేశ్వర్లు వేరు. ఈ కన్ఫ్యూజ్ ఇప్పుడు… వైసీపీని వణికిస్తోంది. 35 అసెంబ్లీ , 4 పార్లమెంట్ నియోజకవర్గాల్లో దేవుడా.. దేవుడా.. అని ప్రార్థించుకునేలా చేస్తోంది. “కేఏ పాల్‌ను అందరూ జోకర్‌గా చూస్తారు..” ఇవీ విజయసాయిరెడ్డి… ఢిల్లీలో ప్రజాశాంతి పార్టీపై, ఆ పార్టీ గుర్తుపై.. ఢిల్లీలో ఈసీకి ఫిర్యాదు చేసిన తర్వాత చేసిన వ్యాఖ్యలు. కానీ.. ఇప్పుడు విజయసాయిరెడ్డికే కాదు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి… కేఏ పాల్ వణుకు పుట్టిస్తున్నారు. పదే పదే ఢిల్లీకి పరుగెత్తెలా చేస్తున్నారు. ఎన్నికల సంఘానికి ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేసేలా చేస్తున్నారు. ఆయనను.. తమ ప్రధాన టార్గెట్లలో ఒకరిగా… చేర్చుకున్నారు. ఇంతగా పాల్… వైసీపీని ఎలా భయపెడుతున్నారు…? ఆయనేం చేస్తున్నారు..?

కేఏ పాల్.. మెడలో తన పార్టీ కండువా వేసుకుని మీడియా సమావేశానికి వస్తారు. చాలా మంది.. అదేంటి సార్ వైసీపీ కండువా వేసుకున్నారని ప్రశ్నిస్తారు. కానీ ఆయన తనదైన శైలిలోనే.. అసలు ఆ జెండా ప్రజాశాంతి పార్టీలది చెబుతూ.. దానిపై.. తన పార్టీ గుర్తును చూపిస్తారు. దాన్ని చూసి.. ఓహో అనుకోవడం… మీడియా వంతు అవుతుంది. అచ్చంగా వైసీపీ కండువాలను పోలి ఉంటాయి. అదొక్కటే కాదు.. గుర్తు కూడా.. ఫ్యాన్‌లాగే ఉంటుందన్న అభిప్రాయం ఏర్పడిపోయింది. హెలికాఫ్టర్‌కి .. ఫ్యాన్‌కి సంబంధం లేదు. కానీ.. ఫ్యాన్ రెక్కలు, హెలికాఫ్టర్ రెక్కలు ఒకేలా ఉన్నాయని… వైసీపీ నేతలు కంగారు పడిపోయేలా చేశారు. ఐదారు సార్లు వైసీపీ నేతలు ఢిల్లీకి పరుగెత్తుకెళ్లి గుర్తుపై ఫిర్యాదు చేశారు. దానిపై.. కేఏ పాల్ చేసిన… సీరియస్ కామెడీ అంతా ఇంతా కాదు. “వైసీపీ నేతలు.. మరీ అంత అమాయకులా.., ఓ మాదిరి జ్ఞానం కూడా లేదా.. ? ఫ్యాన్‌కి .. హెలికాఫ్టర్‌కి తేడా తెలీదా..?..” అన్న అర్థంలో మాట్లాడేశారు.

ఆ తలనొప్పే అలా ఉంటే… తాజాగా.. కేఏ పాల్.. ప్రజాశాంతి పార్టీ అభ్యర్థులందర్నీ… వింతగా ఎంపిక చేశారు. వైసీపీ అభ్యర్థుల పేర్లతో.. సరిపోలేలా ఉండే.. వారికి బీఫారాలు ఇచ్చారు. వారు నామినేషన్లు కూడా వేశారు. 35 అసెంబ్లీ నియోజకవర్గాల్లో, 4 పార్లమెంట్ నియోజకవర్గాల్లో.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పేర్లకు దగ్గరగా ఉండేవారికి బీఫాం ఇచ్చారు. వారు నామినేషన్లు వేశారు. ఆమోదం కూడా తెలిపారు. వారు ఉపసంహరించుకోకపోతే… పోటీలో ఉండటం ఖాయం. అంటే… గుర్తు మాత్రమే కాదు.. పేర్లు కూడా ఒకటే. అందుకే.. వైసీపీ నేతలకు .. మళ్లీ వణుకు వచ్చేసింది. కేఏ పాల్ పార్టీ మీద ఫిర్యాదుతో మళ్లీ ఢిల్లీకి పరుగెత్తారు. అయితే.. ఇప్పుడు ఈసీ కూడా చేసేదేమీ ఉండదు. వాళ్ల నిబంధనలు వాళ్లకు ఉంటాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎన్టీఆర్‌ను వైసీపీ స్మరించుకుంది.. చంద్రబాబును తిట్టడానికైనా సరే!

ఎన్టీఆర్ అందరి మనిషి. అయితే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సహజంగానేకొంత మందికి దూరంఅవుతారు. అలా దూరమైన వారు కూడా ప్రత్యేక సందర్భాల్లో దగ్గర చేసుకోక తప్పదు. ఎన్టీఆర్‌ను అలా దగ్గర చేసుకోవాల్సిన ప...

బాలయ్య కోసం కొత్త ప్ర‌పంచం సృష్టిస్తాడ‌ట‌

అ, క‌ల్కి, జాంబిరెడ్డి చిత్రాల‌తో ఆక‌ట్టుకొన్నాడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌. ఇప్పుడు హను-మాన్ రూపొందిస్తున్నాడు. తేజా స‌జ్జా క‌థానాయ‌కుడిగా న‌టించిన ఈ చిత్రం త్వ‌ర‌లో విడుద‌ల కాబోతోంది. ఈలోగా నంద‌మూరి బాల‌కృష్ణ‌తో సినిమా చేసే...

అందరికీ బెంచ్ మార్క్ బిల్డింగ్‌లు – ఏపీ జనానికి మాత్రం బటన్లు !

తెలంగాణ ప్రభుత్వం ఓ పెద్ద సెక్రటేరియట్ కట్టుకుంది. కథలు కథలుగా చెప్పుకున్నారు. ఇప్పుడు కేంద్రం పార్లమెంట్ నిర్మించింది.. అంత కంటే ఎక్కువ కథలు చెప్పుకుంటున్నారు. నిజానికి ఈ రెండు నిర్మాణాలూ అవసరం లేదని..దుబారా...

కడప వాసుల్లో సునీత పోరాటానికి పెరుగుతున్న మద్దతు !

రాజకీయాల్లో భయ పెట్టి అందర్నీ తమ వెనుక నడిపించుకోవడం కన్నా...సానుభూతి అనేది ఎక్కువ బలమైనది. ప్రజల సానుభూతి పొందితే వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కడప జిల్లాలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close