ప్ర‌కాష్‌రాజ్ ఫస్ట్రేష‌న్‌.. అర్థం చేసుకోద‌గిన‌దే!

ద‌ర్శ‌కుడిగా త‌న‌ని తాను నిరూపించుకొనేందుకు ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు ప్ర‌కాష్ రాజ్‌. ధోనీ ఓకే అనిపించినా ఆర్థికంగా నిరుత్సాహ‌ప‌రిచింది. ఉల‌వ‌చారు బిరియానీ కూడా సంతృప్తిని ఇవ్వ‌లేదు. ఇప్పుడు మ‌న ఊరి రామాయాణం సినిమా తీశారాయ‌న‌. చూసిన‌వాళ్లంతా ‘బాగుంది.. మంచి ప్ర‌య‌త్నం’ అంటున్నారు. కానీ చూసిన వాళ్ల సంఖ్య చాలా త‌క్కువ‌. ఈ ద‌స‌రాకి వ‌చ్చిన అన్ని సినిమాల్లోకీ లోయెస్ట్ క‌ల‌క్ష‌న్స్ ఉన్న సినిమా ఇదే. ప‌ట్టుమ‌ని ఇర‌వైమంది కూడా థియేట‌ర్ల‌లో ఉండ‌డం లేదు. మ‌ల్టీప్లెక్స్‌కి న‌చ్చే సినిమా అనుకొన్నా.. అక్క‌డా ఆద‌ర‌ణ క‌ర‌వ‌య్యింది.
ఈ ఫలితం పై ప్ర‌కాష్ రాజ్ అసంతృప్తితో ఉన్నాడు. అందుకే ఓ వీడియో  సోష‌ల్ మీడియాలో పెట్టాడు. ఈ సినిమా తీస్తున్న‌ప్పుడు త‌న‌ని అంద‌రూ భ‌య‌పెట్టార‌ని, ఐటెమ్స్‌, మ‌సాలా లేక‌పోతే సినిమాలుచూడ‌ర‌న్నార‌ని.. వాళ్ల‌ని కాద‌ని సినిమా తీశాన‌ని, ఇప్పుడు వాళ్లే గెలిచేలా ఉన్నార‌ని ప‌రోక్షంగా త‌న ఓట‌మిని ఒప్పుకొన్నాడు ప్ర‌కాష్ రాజ్‌.  మంచి సినిమాలు చూడ‌ర‌న్న నింద‌ని చెరిపేసే బాధ్య‌త ప్రేక్ష‌కుల‌దే అని గుర్తు చేస్తున్నాడు. అయితే తానేం నిరుత్సాహ ప‌డ‌డం లేద‌ని, ఇక‌పైనా తాను మంచి సినిమాలే తీస్తాన‌ని ధైర్యంగా చెబుతున్నాడు ప్ర‌కాష్‌రాజ్‌, నిజం చెప్పాలంటే.. మ‌న ఊరి రామాయ‌ణం బెట‌ర్ సినిమానే. ఓ చిన్న క‌థ చుట్టూ ఆస‌క్తిక‌రంగా న‌డిపాడు. ప్రియ‌మ‌ణి, ఫృద్వీల న‌ట‌న అయితే భ‌లే గా ఉంది. పొయెటిక్‌… ఎండింగ్ ఇచ్చిన విధానం కూడా న‌చ్చుతుంది.
ఇలాంటి సినిమాల‌కు ఆద‌ర‌ణ ద‌క్క‌క‌పోవ‌డం శోచ‌నీయం. మంచి సినిమాలు రావూ.. రావూ… అంటుంటారు. క‌నీసం వ‌చ్చిన‌ప్పుడైనా చూడాలి క‌దా?  అదే ప్ర‌కాష్‌రాజ్ ఆవేద‌న కూడా. తాను నిజంగానే ఓ క‌మర్షియ‌ల్ సినిమా తీయాలంటే, త‌న చేతులో ఉన్న డ‌బ్బుతో, త‌న‌కున్న ప‌రిచ‌యాల‌తో భారీ హంగామా చేసి ఓ మాస్ మ‌సాలా సినిమా నూరేద్దుడు. కానీ… వాటిపై విసుగెత్తి మెగా ఫోన్ ప‌ట్టిన వ్య‌క్తి.. అంద‌రిలా క‌మ‌ర్షియ‌ల్ సినిమాలెందుకు తీస్తాడు?  ప్ర‌కాష్ రాజ్ నుంచి మ‌ళ్లీ మ‌ళ్లీ ఇలాంటి డీసెంట్ ప్ర‌య‌త్నాలు రావాలంటే… క‌నీసం ఇలాంటి సినిమాల్ని కాస్త ఓపిక తెచ్చుకొని ప‌నిగ‌ట్టుకొని చూడాల్సిందే

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close